Telangana Crime: కన్న కొడుకే కాల యముడయ్యాడు...తండ్రి హత్యకు 25 లక్షల సుపారీ!

నాలుగు రోజుల క్రితం సంచలనం రేపిన రియల్టర్ కమ్మరి కృష్ణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. తండ్రి ఆస్తిని మూడో భార్యకి ఇచ్చేస్తాడనే అనుమానంతో కన్న కొడుకు శివ తండ్రి బాడీగార్డ్‌ తో కలిసి ఈ హత్య చేసినట్లు పోలీసులు వివరించారు.

New Update
Inter Student: అనుమానాస్పదస్థితిలో ఇంటర్‌ విద్యార్థి మృతి

Hyderabad: నాలుగు రోజుల క్రితం సంచలనం రేపిన రియల్టర్ కమ్మరి కృష్ణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. శనివారం షాద్ నగర్‌ ఏసీపీ కార్యాలయ ఆవరణలో శంషాబాద్‌ డీసీపీ రాజేశ్‌ కేసు వివరాలను మీడియాకి తెలియజేశారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ నియోజకవర్గం బండ్లగూడ జాగీర్‌, రఘురాంనగర్‌ కాలనీకి చెందిన కమ్మరి కృష్ణ (63) అనే రియల్‌ ఎస్టేట్‌ తో పాటు మరికొన్ని వ్యాపారాలు కూడా చేసేవారు.

కృష్ణ మొదటి భార్య, పిల్లలను పట్టించుకోకుండా రెండో వివాహం చేసుకున్నాడు. అయితే ఆమె అనారోగ్యంతో మృతి చెందడంతో పావని అనే మరో మహిళను వివాహం చేసుకున్నాడు. ఆమెతో కలిసి ఫారూఖ్‌నగర్‌ మండలం కమ్మదనం రెవెన్యూ పరిధిలోని కేకే ఫామ్‌ హౌస్‌లో నివాసం ఉంటున్నాడు. ఇటీవల పావని పేరుమీదు రూ.16 కోట్ల విలువచేసే 10 భవనాలు, హైదరాబాద్‌లోని కేకే గార్డెన్‌ ఫంక్షన్‌ హాల్‌ను రిజిస్ట్రేషన్‌ చేయించాడు. ఈ విషయమై తండ్రితో మొదటి భార్య కుమారుడు శివ గొడవపడ్డాడు.

ఆస్తి మొత్తం మూడో భార్యకు ఇస్తాడని భావించి తండ్రిని హత్య చేసేందుకు స్కెచ్‌ వేశాడు. తండ్రికి బాడీగార్డ్‌గా ఉన్న బీస్కుంద బాబాశివానంద్‌ని కలిశాడు. తన తండ్రిని హత్య చేస్తే రూ.25 లక్షల నగదు, ఓ ఇల్లు సుపారిగా ఇస్తానని తెలిపాడు. దీంతో బాబాశివానంద్‌ బండ్లగూడ జాగీర్‌కు చెందిన జీలకర్ర గణేశ్‌, అజయ్‌తోపాటు మరో బాలుడితో కలిసి హత్య చేసేందుకు రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే ఈ నెల 10న కేకే ఫామ్‌ హౌస్‌లో ఉన్న కమ్మరి కృష్ణ వద్దకు చేరుకున్నారు. బాడీగార్డ్‌ కృష్ణ గొంతు కోయగా, మిగతా ఇద్దరు కృష్ణ చేతులు పట్టుకున్నారు. హత్య చేసిన అనంతరం నిందితులు అక్కడ నుంచి పారిపోయారు. ఈ విషయాన్ని గమనించిన పావని తన భర్తను శంషాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకుని వెళ్లగా అప్పటికే మృతి చెందినట్టు అక్కడి వైద్యులు నిర్ధారించారు. మృతుని మూడో భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు శివ, గణేశ్‌ , బాలుడిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని ఒప్పుకొన్నారు.

నిందితుల వద్ద నుంచి రెండు కార్లు, ద్విచక్ర వాహనం, మూడు కత్తులు, సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. తండ్రి ఆస్తిని ఇతరులకు ఇస్తున్నాడనే కోపంతోనే శివ ఈ హత్య చేయించాడని వారు తెలిపారు.

Also Read: ఆరోజున స్వామి వారి బ్రేక్‌ దర్శనాలు రద్దు!

Advertisment
Advertisment
తాజా కథనాలు