Metro: ప్రభుత్వ చర్యలతోనే మెట్రో ప్రయాణికులకు ఇబ్బందులు.. కేటీఆర్! ప్రభుత్వ చర్యలతోనే హైదరాబాద్ మెట్రో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. పెయిడ్ పార్కింగ్ ప్రతిపాదన లేదని చెప్పి అకస్మాత్తుగా సెప్టెంబరు 15 నుంచి పెయిడ్ పార్కింగ్ బోర్డులు దర్శనమివ్వడాన్ని ఖండించారు. దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. By srinivas 31 Aug 2024 in బిజినెస్ తెలంగాణ New Update షేర్ చేయండి Hyderabad: హైదరాబాద్ మెట్రో పెయిడ్ పార్కింగ్ ఇష్యూపై కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. ప్రభుత్వ చర్యలతోనే మెట్రో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. Nagole/Miyapur paid parking at Metro stations issue was resisted severely by public when the proposal was floated Now, suddenly we see boards again saying the paid parking will be implemented from 15th September ! Forget about working on last mile connectivity, the govt is not… pic.twitter.com/cX7ijay19e — KTR (@KTRBRS) August 31, 2024 ఈ మేరకు ‘నాగోల్, మియాపూర్ మెట్రో స్టేషన్లలో పెయిడ్ పార్కింగ్ ప్రతిపాదనను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించడంతో అలాంటి ఆలోచన ఏమీ లేదని చెప్పారు. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా సెప్టెంబరు 15 నుంచి పెయిడ్ పార్కింగ్ అమలులోకి వస్తుందని బోర్డులు దర్శనమిస్తున్నాయి! మెట్రో ప్రయాణాన్ని మరింత ప్రోత్సహించే విధంగా ఉండాల్సిన ప్రభుత్వ చర్యలు మెట్రో ప్రయాణికులను ఇబ్బంది పెట్టేలా ఉన్నాయి. ఈ చర్యలు చూస్తుంటే మెట్రోను మరింత ప్రోత్సహించే లాస్ట్ మైల్ కనెక్టివిటీ అనే సంగతి ఇక ప్రభుత్వం పట్టించుకోదని స్పష్టంగా అర్థం అవుతుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మంచిదే అయితే అందుకోసం మెట్రో ప్రయాణికులకు జరిమానా విధిస్తూ వారిని నిరుత్సాహపరచడం ఎందుకు? తెలంగాణ సీఎస్ దీనిపై సమాధానాలు ఏమైనా ఉన్నాయా?’ అంటూ ప్రశ్నించారు. #hyderabad-metro #brs-working-president-ktr #paid-parking మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి