Hyderabad: రేపు ఇందిరాపార్క్ స్టీల్ బ్రిడ్జ్‌ ప్రారంభం.. నాయినిగా నామకరణం

ఇందిరాపార్క్ నుంచి వీఎస్‌టీ వరకు నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్‌ రేపు ప్రారంభం కాకున్నది. దీనికి నాయిని నరసింహారెడ్డి ఫ్లై ఓవర్‌గా నామకరణం చేశారు. సీఎం సూచన మేరకు ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు పురపాలక శాఖ అధికారులు జారీ చేశారు.

New Update
Hyderabad: రేపు ఇందిరాపార్క్ స్టీల్ బ్రిడ్జ్‌ ప్రారంభం.. నాయినిగా నామకరణం

Indira Park to VST steel bridge

ట్రాఫిక్ కష్టాలు దూరం

హైదరాబాద్‌లో ప్రజా రవాణాలో మరో మైలురాయి చేరనున్నది. సుమారు 450 కోట్ల రూపాయలతో నిర్మించిన పొడవైన స్టీల్ బ్రిడ్జి (రేపు) ఈనెల 19వ తేదీన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానున్నది. 2.63 కిలోమీటర్ల పొడవైన ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మాణాన్ని జీహెచ్ఎంసీ స్టాటజిక్ రోడ్డు డెవల్‌మెంట్ ప్రోగ్రాం ఎస్ఆర్డీపీలో భాగంగా చేపట్టింది.

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి హోంశాఖ మంత్రిగా పనిచేసిన కీర్తిశేషులు నాయిని నరసింహారెడ్డి పేరును (Naini Narasimha Reddy Flyover)  ఈ స్టీల్ బ్రిడ్జి ఫ్లైఓవర్‌కి పెట్టారు. సీఎం కేసీఆర్‌ (CM Kcr) ఆదేశాల మేరకు ఈ స్టీల్ బ్రిడ్జ్‌కి నాయినిపేరు పెడుతున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ముషీరాబాద్‌లో సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో, జీఎస్టీ కార్మిక సంఘం నాయకుడిగా నాయిని చేసిన సేవలకు స్మరించుకునేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని కేటీఆర్‌ (KTR) వెల్లడించారు.

నాయిని సేవలతో..

ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఆదేశాలను జారీ చేసింది. సుదీర్ఘ కాలం పాటు ముషీరాబాద్ కేంద్రంగా రాజకీయాల్లో పాల్గొని తెలంగాణ ఉద్యమానికి అనేక సేవలందించిన నాయిని నర్సింహారెడ్డి, అక్కడే ఉన్న వీఎస్టీ ఫ్యాక్టరీ కార్మికుల యూనియన్ నాయకుడిగా దశాబ్దాల పాటు పనిచేశారు. ఈ నేపథ్యంలో ఈ రెండు ప్రాంతాల్లో నాయిని సేవలను దృష్టిలో ఉంచుకొని నాయిని నరసింహారెడ్డి పేరును ఈ స్టీల్ బ్రిడ్జికి పేరు పెట్టేందుకు ప్రభుత్వ నిర్ణయం తీసుకుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.

సీఎం ఆదేశాలతో
అయితే ఈ వంతెన ప్రారంభోత్సవ నేపథ్యంలో కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. స్వర్గీయ నాయిని నర్సింహారెడ్డి పేరు పెట్టటం చాలా సంతోషంగా ఉందని ఐటీ శాఖ మంత్రి వెల్లడించారు. దశాబ్దాల తరబడి ఆర్టీసీ ఎక్స్‌రోడ్డు, అశోక్‌నగర్‌, వీఎస్టీ జంక్షన్లలో ఉన్న ట్రాఫిక్‌ రద్దీ సమస్యకు పరిష్క అవుతుందని తెలిపారు. రేపటి నుంచి వంతెన అందుబాటులోకి రావడంతో ఆ మార్గంలో వెళ్లె వాహనదారుల కష్టాలు తీరనున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు