MMTS TRAINS CANCELLED: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. 29 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు.. రూట్ల వారీగా వివరాలివే! హైదరాబాద్ వాసులకు అలర్ట్. ఈ రోజు 29 ఎంఎంటీఎస్ రైళ్ల రాకపోకలను తాత్కలికంగా నిలిపివేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. పలు మరమ్మత్తుల కారణంగా లింగంపల్లి, సికింద్రాబాద్, హైదరాబాద్, ఉందానగర్, ఫలక్ నామా డివిజన్ పరిధిలో 29 రైళ్లను క్యాన్సిల్ చేస్తున్నట్లు ప్రకటించారు. By srinivas 24 Dec 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి MMTS TRAINS CANCELLED: దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ ఎంఎంటీఎస్ ప్రయాణికులకు కీలక ప్రకటన జారీ చేసింది. ఎంఎంటీఎస్ రైళ్ల రాకపోకలను తాత్కలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. రైల్వే స్టేషన్లు, ట్రాక్ తదితర నిర్మాణ, మరమ్మత్తుల కారణంగా లింగంపల్లి, సికింద్రాబాద్, హైదరాబాద్, ఉందానగర్, ఫలక్ నామా డివిజన్ పరిధిలో 29 రైళ్లను క్యాన్సిల్ చేస్తున్నట్లు తన ప్రకటనలో రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. ఇది కూడా చదవండి : CM Jagan: సంక్రాంతి నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం? ఈ మేరకు ఉందానగర్- లింగంపల్లి, లింగంపల్లి- ఉందానగర్, సికింద్రాబాద్-ఉందానగర్, లింగంపల్లి- ఫలక్ నామా, రామచంద్రాపూరం- ఫలక్ నామా, ఫలక్ నామా - సికింద్రాబాద్, మేడ్చల్ - సికింద్రాబాద్, సికింద్రాబాద్ - మేడ్చల్, సికింద్రాబాద్ - ఫలక్ నామా, ఫలక్ నామా- హైదరాబాద్, హైదరాబాద్ -లింగంపల్లి మధ్య నడిచే 29 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటన జారీ చేశారు. #hyderabad #trains #cancelled #29-mmts మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి