Court: ఉద్యోగ ఆదాయం లేకపోయినా భార్యకు మెయింటెనెన్స్‌ ఇవ్వాల్సిందే: కోర్టు!

భర్తకు ఉద్యోగం లేకపోయినప్పటికీ కూడా భార్యకు మెయింటెనెన్స్‌ ఇవ్వాల్సిందే అంటూ అలహాబాద్‌ హైకోర్టు పేర్కొంది. దినసరి కూలీగా అయినా రోజుకు కనీసం 600 రూపాయల వరకు సంపాదించవచ్చు కాబట్టి భార్యకు భరణం అందించడం తప్పనసరని కోర్టు తీర్పునిచ్చింది.

New Update
Court: ఉద్యోగ ఆదాయం లేకపోయినా భార్యకు మెయింటెనెన్స్‌ ఇవ్వాల్సిందే: కోర్టు!

Court: భర్తకు ఉద్యోగం లేకపోయినప్పటికీ కూడా భార్యకు మెయింటెనెన్స్‌ (Maintence) ఇవ్వాల్సిందే అంటూ అలహాబాద్‌ హైకోర్టు (Alahabad) పేర్కొంది. దినసరి కూలీగా అయినా రోజుకు కనీసం 600 రూపాయల వరకు సంపాదించవచ్చు కాబట్టి భార్యకు భరణం అందించడం తప్పనసరని కోర్టు తీర్పునిచ్చింది. భార్యకు నెలకు రూ.2000 భరణంగా ఇవ్వాల్సిందే అని కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు గురించి ఓ వ్యక్తి దాఖలు చేసిన రివిజన్‌ పిటిషన్‌ హైకోర్టు లక్నో బెంచ్‌ కొట్టివేసింది.

భార్యకు మెయింటెనెన్స్‌ ఇవ్వాల్సిందే..

బెంచ్‌ లోని న్యాయమూర్తి రేణు అగర్వాలతో కూడిన ధర్మాసనం భార్యకు మెయింటెనెన్స్‌ ఇవ్వాల్సిందే అంటూ తేల్చి చెప్పింది. భార్యకు అనుకూలంగా ఇప్పటికే అందజేసిన భరణాన్నిరికవరీ చేసేందుకు భర్తపై అన్ని విధాలుగా చర్యలు తీసుకోవాలని జస్టిస్ అగర్వాల్ ట్రయల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆదేశించారు.

క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) సెక్షన్ 125 ప్రకారం భరణం చెల్లించాలని కోరుతూ కుటుంబ న్యాయస్థానం, నంబర్ 2 ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ భర్త ఫిబ్రవరి 21, 2023న హైకోర్టులో రివిజన్ పిటిషన్‌ను దాఖలు చేశారు.కేసు వివరాల ప్రకారం, ఈ జంట 2015లో వివాహం చేసుకున్నారు. కట్నం డిమాండ్‌పై భార్య భర్త, అత్తమామలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. 2016 లో భర్త ఇంటి నుంచి వేరుపడి తల్లిదండ్రుల వద్దకు వచ్చేసింది.

ఈ క్రమంలోనే భర్త తన భార్య విద్యావంతురాలని , ఆమె టీచింగ్‌ ద్వారా నెలకు రూ. 10 వేలు సంపాదిస్తుందని నిరూపించడంలో ప్రిన్సిపల్‌ జడ్జి తెలుసుకోలేకపోయారని ఆరోపించాడు. అంతేకాకుండా తాను కూలీ పని చేసుకుంటూ,అద్దె గదిలో ఉంటూ తల్లిదండ్రులను, అక్కాచెల్లెళ్లను చూసుకుంటున్నానని తెలిపాడు. దాని వల్ల తన ఆరోగ్యం కూడా పూర్తిగా పాడైపోయిందని వివరించాడు.

అయితే అతని భార్య నెలకు రూ.10 వేలు సంపాదిస్తున్నట్లు నిరూపించే ఎలాంటి డాక్యుమెంట్లను కూడా భర్త సమర్పించలేదని హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. అంతేకాకుండా దినసరి కూలీగా సంపాదిస్తున్నట్లు చెప్పిన వ్యాఖ్యలను కూడా కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. భర్త ఆరోగ్యంగానే ఉన్నాడని, అతను కూలీ పని చేసి అయినా డబ్బు సంపాదించగలడని కోర్టు తెలిపింది. దీంతో భార్యకు ఎట్టి పరిస్థితుల్లోనూ మెయింటెనెన్స్‌ ఇవ్వాల్సిందేనని తెల్చి చెప్పింది.

Also read: ప్రతిభకు వయసు అడ్డుకాదని నిరూపించారు..బోపన్న పై మోడీ ప్రశంసలు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Telangana : ఏం మనిషివిరా.. ఆస్తి కోసం తండ్రికి తలకొరివి పెట్టనన్నాడు.. చివరికి కూతురితో

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఆస్తి కోసం కన్న తండ్రికి తలకొరివి పెట్టడానికి ఓ కొడుకు ముందుకు రాలేదు. దీంతో చేసేది ఏమీ లేక చిన్న కూతురుతో తండ్రి తలకొరివి పెట్టించి అంత్యక్రియలు జరిపించారు.

New Update
son-and-father

son-and-father

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఆస్తి కోసం ఓ కొడుకు మానవత్వాన్ని మరిచి పోయాడు. ఆస్తి కోసం కన్న తండ్రికి తలకొరివి పెట్టడానికి ఓ కొడుకు ముందుకు రాలేదు.  పద్మావతి కాలనీకి చెందిన మాణిక్యరావు బుధవారం మృతి చెందాడు. అయితే సంప్రాదాయాల ప్రకారం తల్లిదండ్రులు చనిపోతే కుమారులే అంత్యక్రియలు జరిపించాల్సి ఉంటుంది.  

ఆస్తి ఇస్తే తప్ప తలకొరివి పెట్టను 

అయితే  ఆస్తి ఇస్తే తప్ప తలకొరివి పెట్టనని స్మశానంలో అడ్డం తిరిగాడు మాణిక్యరావు కొడుకు. కోటి రూపాయల ఇల్లు, 10 తులాల బంగారం తన పేరు మీద రాసి ఇస్తేనే తన తండ్రికి కొరివి పెడతానని పట్టుబట్టాడు. కుటుంబ సభ్యులు, బంధువులు ఎంత చెప్పిన వినలేదు. దీంతో చేసేది ఏమీ లేక మాణిక్యరావు చిన్న కూతురుతో తండ్రి తలకొరివి పెట్టించి అంత్యక్రియలు జరిపించారు బంధువులు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు