Festive Beauty:పండుగల్లో మెరిసిపోవడం ఎలా...

పండగ అంటే ఆనందం. ఆరోజుల్లో అందంగా కనిపించాలని అందరికీ ఉంటుంది.పండుగ సువాసన మనల్నిఆనందంలో ముంచుతుంది. మరి ఈరోజుల్లో అందంగా కనిపించాలంటే ఏం చేయాలో తెలుసా?

New Update
Festive Beauty:పండుగల్లో మెరిసిపోవడం ఎలా...

Sankranthi Festival:కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేసాం. జనవరి వచ్చేసింది. ఏడాది మొదలవుతూనే మనకు వచ్చే పండగ సంక్రాంతి. దేశంలో చాలా చోట్ల ఈ పండుగను వేరేవేరే పేర్లతో జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్ లో అయితే ఇదే పెద్ద పండగ. భోగీ, కనుమ, ముక్కనుమతో కలిపి నాలుగు రోజులు చేసుకునే పండుగకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. ముగ్గులతో, ఆడపడుచులతో మెరిసిపోయే ఈ పండుగ రోజులు ప్రతీ ఇంటికి కళను తీసుకువస్తాయి. మరి పండగల్లో హ్యాపీగా మెరిసిపోవాలంటే ఏం చేయాలో తెలుసా. ఎలా కేర్ తీసుకోవాలో తెలుసా. లేదా అయితే మీ కోసమే ఈ చిట్కాలు.

ప్రతి ఒక్కరికి వివిధ రకాల చర్మాలు, సమస్యలు ఉన్నప్పటికీ మీ చర్మానికి సరైన క్లెన్సర్‌ని ఎంచుకోవడం ముఖ్యం. మనందరం పండుగ అనుభూతిని పొందాలి. ఈ దీపావళికి రెడీ అయ్యేందుకు హెల్ప్ చేస్తుంది. క్లీన్ చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే. దీని వల్ల చర్మంపై ఉండే కాలుష్యాన్ని తొలగించి, పోర్స్ క్లీన్ చేయడానికి సాయపడుతుంది. మన చర్మం తాజాగా, మృదువుగా కనిపిస్తుంది. ఈ సీజన్‌లో స్కిన్‌కి అవసరమయ్యే క్లెన్సర్‌లను ఎంచుకోండి. చర్మాన్ని ఎక్కువగా డ్రై అయ్యేలా చూడొద్దు.

చాలా సార్లు మనం ఎక్స్‌ఫోలియేషన్ చేయం. దీని వల్ల స్కిన్ కేర్ దెబ్బ తింటుంది. అయినప్పటికీ, చర్మ సంరక్షణలో ఎక్స్‌ఫోలియేషన్ అనేది కీ స్టెప్. డెడ్ స్కిన్ సెల్స్‌ని క్లియర్ చేయడం వల్ల మీరు క్లియర్, సాఫ్ట్ స్కిన్‌ని పొందుతారు. దీంతో పాటు, చర్మం వారానికి రెండు సార్లు ఎక్స్‌ఫోలియేట్ చేయడం వల్ల ప్రయోజనాలు పొందుతారు. దీపావళికి దీపాల్లా మన ముఖం మెరుస్తుంది.

చర్మం జిడ్డుగా మారకుండా మెరిసే మాయిశ్చరైజర్ కావాలంటే విటమిన్ సి, విటమిన్ ఇ, ఇతర పదార్థాలతో కూడిన ఒకదాన్ని ఎంచుకోండి. అది మన చర్మాన్ని ఏ టైమ్‌లో అయినా మెరిసేలా చేస్తుంది. బొద్దుగా, మృదువుగా ఉండే చర్మానికి తేమ అవసరం. ఇది లోపల నుండి చర్మానికి హైడ్రేషన్, మాయిశ్చరైజేషన్‌ని అందిస్తుంది.

పండగలప్పుడు, పార్టీలప్పుడు విపరీతమైన పని ఉంటుంది. ఈ ఒత్తిడి కారణంగా చర్మం మెరవదు. అలాంటి టైమ్‌లో ఫేస్ మాస్క్ మనకు హెల్ప్ అవుతుంది. మన బ్యూటీని పెంచేందుకు ఫేస్ మాస్క్ హెల్ప్ చేస్తుంది. మన స్కిన్ కలర్‌ని ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తుంది.సీరమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. పండుగ సీజన్‌లో మీ స్కిన్ కేర్ ఇంప్రూవ్ చేయడానికి సీరమ్స్ మంచి ఆప్షన్. బెస్ట్ సీరమ్ మన డెయిల్ స్కిన్ కేర్ రొటీన్‌ని త్వరగా మెరుగు పరుస్తుంది. అంతర్గతంగా మెరుపుని అందిస్తుంది. అయితే చర్మానికి అనుకూలమైన భాగాలు, ఫార్మూలాలతో ఉన్న సీరమ్‌ని మాత్రమే ఎంచుకోవాలి. స్కిన్ కేర్ ఎంచుకునేటప్పుడు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనివి ట్రై చేయాలి. ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి.

వీటికి తోడు అదనంగా తాజా పళ్ళు, కూరగాయలు తీసుకోవాలి. సమతుల్య ఆహారం చర్మాన్ని లోపల్నించి రిపేర్ చేసి మెరిసేలా చేస్తుంది. చివరగా, పండుగల సమయంలో హైడ్రేటెడ్‌గా ఉండేలా చూసుకోండి. ఎక్కువ కేలరీలకి దూరంగా ఉండి వర్కౌట్ చేయండి. దీంతో మీ స్కిన్ మెరుపుని ఏవీ అడ్డుకోలేవు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pawan Kalyan : విద్యార్థులు పరీక్ష అందుకోలేకపోయిన పరిస్థితిపై విచారణ

పెందుర్తి ప్రాంతంలో జె.ఈ.ఈ. పరీక్షకు కొందరు విద్యార్థులు అందుకోలేకపోవడానికి ఉప ముఖ్యమంత్రి కాన్వాయి కారణమని వచ్చిన వార్తా కథనాలను పరిగణనలోకి తీసుకొని వాస్తవ కారణాలను అన్వేషించి విచారణ కు పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఈ మేరకు పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.

New Update
pawan kalyan

pawan kalyan Photograph: (pawan kalyan)

Pawan Kalyan :పెందుర్తి ప్రాంతంలో జె.ఈ.ఈ. పరీక్షకు కొందరు విద్యార్థులు అందుకోలేకపోవడానికి ఉప ముఖ్యమంత్రి కాన్వాయి కారణమని వచ్చిన వార్తా కథనాలను పరిగణనలోకి తీసుకొని వాస్తవ కారణాలను అన్వేషించి విచారణ కు  పవన్ కళ్యాణ్  ఆదేశించారు. కాన్వాయి కోసం ఎంతసేపు ట్రాఫిక్ ను నిలుపుదల చేశారు.  పరీక్ష కేంద్రం దగ్గరకు విద్యార్థులు చేరుకోవలసిన మార్గాల్లో ఆ సమయంలో ఉన్న ట్రాఫిక్ పరిస్థితి ఏమిటి అనే దానిపై విచారణ చేయాలని ఆదేశించారు.  సర్వీసు రోడ్లలో ఉన్న ట్రాఫిక్ ను ఏమైనా నియంత్రించారా విషయాలను కూడా తెలుసుకోవాలన్నారు.తదితర అంశాలపై విచారించాల్సిందిగా విశాఖపట్నం పోలీసులకు పవర్‌ కళ్యాణ్‌  ఆదేశాలు జారీ చేశారు.

Also read: Rameswaram: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

 తన పర్యటనల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూడాలని ఇప్పటికే పవన్ సూచించారు.కూటమి ప్రభుత్వంలో ముఖ్యుల పర్యటనల సందర్భంలో స్వల్ప వ్యవధి మాత్రమే ట్రాఫిక్ రెగ్యులేషన్ చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా పోలీసులు ట్రాఫిక్ రెగ్యులేషన్ ,హెలికాప్టర్ లో వెళ్ళినా రోడ్డుపై ట్రాఫిక్ నిలవడం, చెట్లు కొట్టడం లాంటివి చేయడం ఆపడం లేదని తెలిపారు.పార్టీ శ్రేణులు, నాయకులకు సైతం క్రేన్ దండలు కార్యక్రమాలు, ట్రాఫిక్ అవాంతరాలు కలిగించే చర్యలు చేపట్టరాదని కేంద్ర కార్యాలయం నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

Also read :  Ram Navami 2025: అయోధ్యలో అద్భుతం. రామ్‌ లల్లాకు సూర్య తిలకం


కాగా ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కారణంగా పరీక్ష కి ఆలస్యం అయిందని కొంతమంది విద్యార్థులు ఆరోపించారు. కన్వాయి వల్ల - పెందుర్తి అయాన్ డిజిటల్  JE అడ్వాన్స్ విద్యార్థులు ఆలస్యంగా పరీక్షా కేంద్రానికి వెళ్ళాల్సి వచ్చిందని వాపోయారు. 30 మంది విద్యార్థులు పరీక్షా కేంద్రానికి వెళ్లి పరీక్ష   రాయకుండా వెనిదిరగాల్సి వచ్చింది. దీనివల్ల - పిల్లల భవిష్యత్తు అగమ్య అవుతుందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.

Also read: Ramnavami: రామాలయంలో అపశృతి.. టెంట్లు కూలీ భక్తుల తలలు పలిగాయి

Advertisment
Advertisment
Advertisment