Fitness: నిమ్మరసంతో ఈజీగా బరువు తగ్గొచ్చు..ఎలాగో తెలుసా.

బరువు, లావు..ఈరోజుల్లో అందరూ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఈ సమస్యతో బాధపడుతున్నారు. దీనికి కారణం మారిన జీవన ప్రమాణాలు, ఆహారపు అలవాట్లు. అయితే ఈజీగా బరువు తగ్గేందుకు నిమ్మరసం బాగా పని చేస్తుంది. అదెలాగో తెలుసా..

New Update
Fitness: నిమ్మరసంతో ఈజీగా బరువు తగ్గొచ్చు..ఎలాగో తెలుసా.

బాడీలో కొలెస్ట్రాల్‌ తగ్గితే బరువు ఈజీగా తగ్గుతారు. ఈపనిని నిమ్మరసం బాగా పనిచేస్తుంది. బరువు తగ్గాలంటే తక్కువ కేలరీలు తీసుకోవడం ఒక్కటే సరిపోదు. ముందుగా బాడీలోని ట్యాక్సిన్స్‌ని పోయేలా చూడాలి. దీనికి నిమ్మరసం బాగా పనిచేస్తుంది. ఈ ట్యాక్సిన్స్‌ని బయటికి పంపడంలో నిమ్మరసం బాగా పనిచేస్తుంది. దీనిని పద్నాలుగు రోజుల చొప్పున చేయాలి. వరుసగా పద్నాలుగు రోజులు తీసుకున్న తర్వాత 10 రోజులు బ్రేక్ తీసుకుని మళ్ళీ స్టార్ట్ చేయాలి. కానీ మొదటి 14 రోజులకే శరీరంలో మార్పు కనిపిస్తుందని చెబుతున్నారు నిపుణులు.

Also Read:మరీ ఇంత గర్వం పనికిరాదు కంగారూలూ..

మొదటి రెండు రోజులు..

మొదటిరోజు ఓ కప్పు నీటిలో నిమ్మరసం పిండి తాగాలి. రెండో రోజు రెండు నిమ్మకాయలను రెండు కప్పుల నీటితో కలిపి తాగాలి. ఇవన్నీ కూడా బ్రేక్‌ఫాస్ట్‌కి ముందు తాగాలి. అవసరమనుకుంటే కొద్దిగా తేనె కలుపుకోవచ్చును.

3, 4 రోజులు..

మూడో రోజు మూడుకప్పుల నీటిలో మూడు నిమ్మకాయల రసాన్ని కలిపి తాగాలి. అవసరమనుకుంటే తేనె కలపండి. దీన్ని రోజుకి రెండు సార్లు తాగాలి. నాల్గవరోజు.. నాలుగు నిమ్మకాయల్ని పిండి నాలుగు కప్పుల నీటిని కొంచెం తేనె కలపి భోజనానికి ముందు తాగాలి. రోజుకు రెండు సార్లు ఉదయం , రాత్రి పడుకునే ముందు తాగాలి.

5,6 రోజులు

ఈ రోజుల్లో ఐదు నిమ్మకాయల రసాన్ని ఐదు కప్పుల నీరు, తేనెతో కలిపి రోజుకు రెండు సార్లు తీసుకోవాలి. 6వ రోజు ఆరు నిమ్మకాయల రసాన్ని ఆరుకప్పుల నీటిలో కలిపి ఓ టీస్పూన్ తేనె కలిపి మూడు సార్లు తాగాలి.

7,8 రోజులు..

ఏడో రోజు 3 నిమ్మకాయల్ని పది కప్పుల నీటిలో కలిపి మూడుసార్లు భోజనానికి ముందు తాగాలి. ఎనిమిదో రోజు కూడా ఆరు నిమ్మకాయల రసాన్ని ఆరు కప్పుల నీటిలో కలిపి చెంచా తేనె కలిపి తాగాలి.

9,10 రోజులు..

తొమ్మిదో రోజు ఐదు నిమ్మకాయల రసాన్ని ఐదు కప్పుల నీటిలో వేసి ఓ టేబుల్స్పూన్ తేనె వేసి తాగాలి. పదో రోజు 4 నిమ్మకాయల్ని 4 కప్పుల నీటిలో రసాన్ని పిండి తేనె కలిపి తాగాలి.

ఇక 11వ రోజు 3 నిమ్మకాయలు, 3 కప్పుల నీటిలో కలిపి రెండుసార్లు తాగాలి. 12వ రోజు రెండు నిమ్మకాయల 2 కప్పుల నీటిలో కలిపి బ్రేక్‌ఫాస్ట్ ముందు తాగాలి. 13 వ రోజు 3నిమ్మకాయల రసాన్ని 10 కప్పుల నీటిలో కలిపి తేనె కలిపి తాగాలి. అవసరమనుకుంటే చిటికెడు జీలకర్ర పొడి, ఉప్పు కలిపి తాగండి. 14 వ రోజు కూడా దీనినే రిపీట్ చేయాలి. ఇలా చేయడం వల్ల చాలా వరకూ రిజల్ట్ ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. అయితే ఏం చేసినా మన శరీరంలో జరిగే మార్పులను గమనించుకుంటూ చేయాలి. లేదా నినుణుల సలహాలు తీసుకుని చేయడం మంచిది. ఏ మాత్రం తేడా వచ్చినా వెంటనే ఆపేసి డాక్టర్ ని సంప్రదించాలి.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TG Crime : అన్నంలో మత్తు మందు కలిపి... వ్యాపారవేత్త ఇంట్లో భారీ చోరీ

హైదరాబాద్ కాచిగూడలో భారీ దోపిడీ జరిగింది. వృద్ధ దంపతులకు భోజనంలో మత్తుమందు కలిపి దాదాపు 2 కిలోల బంగారు నగలు, రూ.3కోట్ల నగదు, ఖరీదైన కారు ఎత్తుకెళ్లిన సంఘటన కాచిగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వెలుగులోకి వచ్చింది. ఇంట్లో పని మనుషులే ఈ దోపిడీకి పాల్పడ్డారు.

New Update
Massive theft

Massive theft

 TG Crime :  హైదరాబాద్ కాచిగూడలో భారీ దోపిడీ జరిగింది. వృద్ధ దంపతులకు భోజనంలో మత్తుమందు కలిపి దాదాపు 2 కిలోల బంగారు నగలు, రూ.3కోట్ల నగదు, ఖరీదైన కారు ఎత్తుకెళ్లిన సంఘటన కాచిగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వెలుగులోకి వచ్చింది. కాచిగూడ లింగంపల్లి అమ్మవారి దేవాలయం సమీపంలో ప్రముఖ పారిశ్రామికవేత్త హేమ్‌రాజ్‌ , అతడి భార్య మీనా దుగ్గర్‌ నివాసముంటున్నారు. ఇంట్లో పని మనుషులు వ్యాపారవేత్త హేమరాజు దంపతులకు రాత్రి భోజనంలో మత్తుమందు కలిపి పెట్టారు. అది తిన్న దంపతులిద్దరు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. దీంతో వారు నగలు, నగదు తీసుకుని పారిపోయారు.

ఇది కూడా చూడండి: Horoscope: ఈ రాశుల వారికి ఈరోజు అంతగా బాగోలేదు..జాగ్రత్తగా ఉంటే బెటర్‌!

కొద్ది రోజుల క్రితం వారు నేపాల్‌కు చెందిన దంపతులను ఇంట్లో పనికి పెట్టుకున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఇటీవల వారి కొడుకు, కోడలు విదేశీ యాత్రకు వెళ్లడంతో హేమ్‌రాజ్, అతడి భార్య మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఇదే అదనుగా భావించిన పనివారు ఆదివారం రాత్రి భోజనంలో మత్తు మందు కలిపారు. వారు మత్తులోకి వెళ్లగానే ఇంట్లోని బంగారు ఆభరణాలు, నగదుతో పాటు కారు తీసుకుని ఉడాయించారు. ప్రతి రోజూ వాకింగ్‌కు వెళ్లే  హేమరాజ్‌ సోమవారం వాకింగ్‌కు రాకపోవడంతో అతని స్నేహితుడు ఫోన్‌ చేయగా స్విచ్‌ ఆఫ్‌ వచ్చింది. 

Also read: Murder case: కొడుకు అక్రమ సంబంధానికి బలైన తండ్రి.. వాడి పెళ్లం ఫొటోలు వాట్సాప్ స్టేటస్‌

దీంతో అనుమానం వచ్చిన అతని స్నేహితుడు ఇంటికి వచ్చాడు. ఇంట్లో అపస్మారక స్థితిలో ఉన్న హేమరాజు దంపతులను అతను ఆసుపత్రిలో చేర్పించారు. అలాగే పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుటాహుటిన సంఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంటి నుంచి బంగారు ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లిన పని మనుషులు (నేపాలి దంపతులు) కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Also read: wife harassment: మరో భార్యా బాధితుడు బలి.. ‘నా అస్తికలను డ్రైనేజీలో కలపండి’

Advertisment
Advertisment
Advertisment