Weight Loss: రోజులో 10నిమిషాలు కేటాయించండి చాలు.. బరువు ఇట్టే తగ్గిపోతారు..!

రోజుకు స్క్వాట్స్ వ్యాయామం 10నిమిషాల చొప్పున 3సార్లు చేస్తే బరువు తగ్గుతారు. ఈ వ్యాయామం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఒత్తిడిని దూరం చేస్తుంది. నిద్రకు కూడా మంచిది. తక్కువ సమయంలోనే త్వరగా క్యాలరీలు ఖర్చవుతాయి. స్కాట్స్‌ ఎలా చేయాలో తెలుసుకోవాలనుకుంటే ఆర్టికల్‌ మొత్తం చదవండి.

New Update
Weight Loss: రోజులో 10నిమిషాలు కేటాయించండి చాలు.. బరువు ఇట్టే తగ్గిపోతారు..!

బరువు(Weight) పెరుగుదల తీవ్రమైన అనారోగ్యాలకు దారి తీస్తుంది. నేటి బిజీ లైఫ్‌స్టైల్‌లో చాలామందికి వ్యాయామం చేసే సమయం దొరకడంలేదు. నిజానికి టైమ్‌ ఉంటుంది కానీ ఓపిగా ఉండడం లేదని చాలా మంది చెబుతుంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీస్‌లో వర్క్‌తో కుస్తీ పట్టి చివరకు అలిసిపోయి ఇంటికి వచ్చి తినేసి, స్నానం చేసేసి నిద్రపోతున్నారు. అయితే అలాంటివారి కోసమే స్కాట్వ్స్‌ ఉన్నాయి. ఈ వ్యాయామం చాలా ఎఫెక్టీవ్‌గా పని చేస్తుంది. బరువు పెరుగుదల సమస్యలతో బాధపడుతుంటే, వెయిట్‌ తగ్గడానికి వ్యాయామం అవసరం. ప్రతిరోజూ మీ కోసం 10 నిమిషాలు కేటాయించుకోండి. స్క్వాట్స్‌(Squats) వ్యాయామం చేయండి.

పది నిమిషాలు చేస్తే చాలట:
ఒక్క వ్యాయామం వల్ల పొట్ట, తొడలు, చేతులపై పేరుకుపోయిన కొవ్వు తగ్గడంతో పాటు మీ శరీరం ఫిట్‌గా కనిపిస్తుంది. మీరు కొన్ని రోజుల్లో తేడాను చూడాలనుకుంటే వ్యాయామంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తినండి. కేవలం వ్యాయామంతోనే బరువు తగ్గుతారని భావించవద్దు. ఫుడ్‌ ఏం తింటున్నమన్నది ముఖ్యం. స్క్వాట్స్ వ్యాయామం శరీరాన్ని టోన్ చేస్తుంది. కడుపులోని కండరాలపై పనిచేస్తుంది. ఇది కేలరీలను కూడా తగ్గిస్తుంది. స్క్వాట్స్ చేయడానికి హిప్ లైన్ వద్ద మీ కాళ్ళ మధ్య దూరంతో నిలబడండి. వేలి రేఖలో మోకాళ్లను చాలా దూరం కదిలించవద్దు. తరువాత చేతులను వ్యతిరేక దిశలో నిటారుగా ముందుకు ఉంచి, పాదం మడమను నేలపై గట్టిగా ఉంచండి. కుర్చీలో కూర్చున్నట్లుగా మీ కాళ్ళను మీ మోకాళ్లలో వంచండి. మీ శరీరాన్ని క్రిందికి తీసుకురండి. కూర్చున్నప్పుడు, మోకాళ్ళను నెమ్మదిగా వంచండి. పిరుదులను వెనుకకు వంచండి. పూర్తిగా కూర్చోవద్దు, పిరుదులు మోకాళ్ల కిందకు వెనక్కి వెళతాయి. కిందకు వెళతాయి. తరువాత మళ్లీ లేచి నిలబడండి. ఈ చర్యను 15 సార్లు పునరావృతం చేయండి. మీరు ఈ వ్యాయామాన్ని ఒక సెట్లో 15 సార్లు చేయవచ్చు.. రోజుకు 3 సెట్లు చేయవచ్చు. కొన్ని రోజుల తరువాత, మీరు దాని కోసం అదనపు సెట్ చేయవచ్చు.

HOW TO DO SQUATS

స్క్వాట్స్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు:

- ఎగువ, దిగువ శరీరాలకు మంచిది.

- తక్కువ సమయంలోనే త్వరగా క్యాలరీలు ఖర్చవుతాయి.

- ప్రసరణను మెరుగుపరుస్తుంది.

- నడుము కింది భాగాన్ని బలంగా చేస్తుంది.

- భంగిమను మెరుగుపరుస్తుంది.

- కాళ్లు, పిరుదులు టోన్ అవుతాయి.

- జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

- శక్తి స్థాయిలు పెరుగుతాయి.

- ఒత్తిడిని దూరం చేస్తుంది.

- నిద్రకు కూడా మంచిది.

- హిప్ కండరాలను బలోపేతం చేస్తుంది.

Also Read: షుగర్ ఉన్నవారు ఖర్జూరాలు తింటున్నారా.. ఏమవుతుందో తెలుసా..!

Advertisment
Advertisment
తాజా కథనాలు