Video Viral: ఫ్యాక్టరీలో నెయిల్ పాలిష్ ఎలా తయారు చేస్తారో ఎప్పుడైనా చూశారా..? రకరకాల కరల్స్ నెయిల్ పాలిష్‌లు మార్కెట్‌లో దొరుకుతున్నాయి. అది ఎలా తయారు చేస్తారో తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. తాజాగా ఓ యూజర్ నెయిల్ పాలిష్‌ను ఫ్యాక్టరీలో ఎలా తయారు చేస్తారనే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో కోసం ఈ ఆర్టికల్‌లోకి వెళ్లండి. By Vijaya Nimma 17 Apr 2024 in Latest News In Telugu వైరల్ New Update షేర్ చేయండి Nail Polish: పార్టీకి లేదా మరేదైనా పండుగ సందర్భంలో రెడీ అవుతున్నప్పుడు గోర్లకు నెయిల్ పాలిష్ తప్పనిసరిగా ఉండాల్సిందే. రకరకాల కరల్స్‌తో పాటు మెరిసే నెయిల్ పాలిష్‌లు మార్కెట్‌లో దొరుకుతున్నాయి. తక్కువ ధర నుంచి మొదలు ఎంతో ఖరీదైన నెయిల్ పాలిష్‌లు మార్కెట్‌లో దొరుకుతుంటాయి. అయితే నెయిల్ పాలిష్‌లు ఎలా తయారు చేస్తారో తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. View this post on Instagram A post shared by ABHISHEK ASHRA 💫🧿 (@thefoodiehat) తాజాగా ఓ యూజర్ నెయిల్ పాలిష్‌ను ఫ్యాక్టరీలో ఎలా తయారు చేస్తారనే వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో @foodiehat అనే ఖాతా ద్వారా వైరల్ వీడియో పోస్ట్ చేయబడింది. చిన్న బాటిల్‌లో నెయిల్ పెయింట్‌ను ఎలా నింపుతారో వీడియోలో మొదటగా చూపించారు. మొదటగా ఒక స్థూపాకార కంటైనర్‌లో మెరిసే ఎరుపు రంగు, మందపాటి ద్రవాన్ని పోశారు. ఆ తరువాత, యంత్రం సహాయంతో పెద్ద కంటైనర్‌లోకి మార్చారు. ఆ తర్వాత ప్లాస్టిక్ సీసాలలో నింపారు. ఆరెంజ్, పింక్ వంటి ఇతర రంగులకు కూడా ఇదే విధానాన్ని పాటిస్తారు. మందపాటి మెరిసే ద్రవాన్ని చిన్న గాజు సీసాలు లేదా నెయిల్ పాలిష్ నిల్వ చేయడానికి ప్రత్యేకంగా ఉపయోగించే సీసాలలో పోస్తారు. దీనిపై బ్రాండ్ పేరు కూడా ఉంటుంది. ఈ గాజు సీసాలను నెయిల్ పాలిష్ వేసుకునే చిన్న ప్లాస్టిక్ బ్రష్‌లతో సీల్ చేస్తారు. తర్వాత క్యాప్‌లు ఫిక్స్ చేస్తారు. వీడియో చివర్లో ఒక యువతి నెయిల్ పాలిష్ వేసుకుంటూ కనిపిస్తుంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. సింపుల్‌గా గోర్లకు వేసుకునే నెయిల్ పాలిష్ వెనుక ఇంత కథ ఉంటుందా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో 3,33,000 లైక్‌లను, 16 మిలియన్ వ్యూస్‌ని రాబట్టుకుంది. ఇది కూడా చదవండి: ప్రియురాలి ఇంట్లోనే వ్యక్తి బలవన్మరణం..ఎందుకంటే? గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. #viral-video #nail-polish మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి