Rave Party: రేవ్ పార్టీ అంటే ఏంటి? అక్కడ ఎలాంటి పనులు చేస్తారో తెలుసా?

రేవ్ పార్టీ.. ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన అంశం. ఈ వేడుక ఎలా పురుడుపోసుకుంది? దీని మూలాలు ఏమిటి? గుట్టు చప్పుడుకాకుండా జరిగే చట్ట విరుద్ధ కార్యక్రమాలేమిటి? పార్టీకి హాజరైన వారి వివరాలు ఎందుకు గోప్యంగా ఉంచుతారు? ఆసక్తికరమైన విషయాలకోసం పూర్తి ఆర్టికల్ చదివేయండి.

New Update
Rave Party: రేవ్ పార్టీ అంటే ఏంటి? అక్కడ ఎలాంటి పనులు చేస్తారో తెలుసా?

Rave Party: రేవ్ పార్టీ.. ఇప్పుడు తెలుగురాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన అంశం. ఇటీవల బెంగళూర్ వేదికగా జరిగిన రేవ్ పార్టీలో సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, బడా బాబులు పాల్గొన్నట్లు బయటపడటంతో ఈ పార్టీల కల్చర్‌కు సంబంధించిన అంశం మరోసారి తెరపైకొచ్చింది. ఇంతకు ఈ వేడుక ప్రత్యేకలేంటి? ఎవరెవరెకీ ఎంట్రీ ఉంటుంది? స్త్రీ, పురుషులు సంయుక్తంగా పాల్గొని ఇందులో ఏమి చేస్తారు? కస్టమర్ల వివరాలను నిర్హాహకులు ఎందుకు రహస్యంగా ఉంచుతారు? అనే ఆసక్తికర అంశాలను తెలుసుకుందాం.

గోొవాలో ప్రారంభించిన హిప్పీలు..
ఒకప్పుడు పార్టీ అంటే మద్యం, లేదా ఇతరత్రా పద్ధతుల్లో జరుపుకునే వారు. కానీ నేటి యువతరం పార్టీ అంటే మితిమీరిన మ‌త్తు, డబ్బు, విచ్చలవిడి శృంగారంలో మునిగి తేలుతున్నారు. దీనికి తోడు విదేశీ కల్చర్ పెరుగుతోంది. పార్టీల పేరిట అమ్మాయిలను బుక్ చేసుకొని, వారితో అర్థనగ్నంగా డ్యాన్సులు చేయిస్తూ మత్తులో ఊగుతున్నారు. అయితే ఈ రేవ్ పార్టీ కల్చర్ మొదటగా హిప్పీలు గోవాలో ప్రారంభించగా క్రమంగా అనేక నగరాలకు పాకింది. ఈ క్రమంలోనే హిమాచల్‌లోని కులు లోయ, బెంగుళూరు, పూణే, ముంబై వంటి అనేక నగరాలు వీటికి ప్రత్యేక హాట్‌స్పాట్లుగా నిలిచాయి. ఈ పార్టీ వైల్డ్ బిహేవియర్‌తో చేసుకుంటారు. రేవ్ పార్టీ‌లో పాల్గొనే వారిని ‘రేవర్స్’గా పిలచుకుంటారు. రేవ్ అనే పదం జమైకా భాష నుంచి వచ్చింది. యువతీ యువకులు ఆల్కహాల్‌తో పాటు డ్రగ్స్‌ను కూడా తీసుకుంటూ.. లేజర్ లైట్ల వెలుగులో చెవులు దద్దరిల్లే మ్యూజిక్‌తో ఒళ్లు మరిచి చిందులేస్తుంటారు.

ఇది కూడా చదవండి: Wines close: తెలంగాణలో వైన్ షాపులు, బార్లు బంద్!

చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు వేదికగా..
ఈ పార్టీల ధోరణి 1980లో గ్రేట్ బ్రిటన్‌లో ప్రారంభమైంది. తర్వాత మిగిలిన దేశాలకు పాకింది. కాలక్రమంలో రేవ్ పార్టీ కల్చర్ చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు వేదికగా మారింది. ఈ పార్టీలు 24 గంటల నుంచి మూడు రోజుల వరకు నిర్వహిస్తారు. ఇందులో పాల్గొనాలంటే పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయాలి. ఒకప్పటి రాక్ ఎన్ రోల్ యుగం, హిప్పీ యుగం, డిస్కో, ర్యాప్ లాగా ఇప్పుడు ఈ రేవ్ యుగం. అయితే వీటికంటే ఈ ‘రేవ్’ ది ఏ హద్దులు లేని విచ్చలవిడి సంస్కృతి. ఈ రేవ్ పార్టీలో పాల్గొనాలంటే మద్యం సేవించడం, డ్రగ్స్ తీసుకోవడం, విచ్చలవిడిగా వ్యభిచారం చేయడం, అవసరానికి మించిన డబ్బును కలిగి ఉండటం లాంటి అవలక్షణాలు ఉండాలి. అందుకే ఈ రేవ్ పార్టీలకు కొంతమందికి మాత్రమే అవకాశం కల్పిస్తారు. వారి వివరాలు బయటకు రాకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు.

గుట్టుచప్పుడు కాకుండా దందాలు..
మ్యూజిక్‌తో స్టార్ట్ అయిన రేవ్‌ పార్టీలో అందమైన అమ్మాయిలు అర్ధనగ్నంగా చిందులేస్తారు. వారిని చూసి పార్టీకి వచ్చినవారంతా ఎంజాయ్ చేస్తారు. ఈ క్రమంలో యువతులపై కరెన్సీ నోట్లు విసురుతూ ఎంజాయ్ చేస్తుంటారు. అదే సమయంలో ఆ పార్టీలో మద్యం కూడా విచ్చలవిడిగా ఏరులై పారుతుంది. ఇదే ఊపులో పలు కార్యక్రమాలు గుట్టుగా జరిగిపోతుంటాయి. అయితే హైదరాబాద్ శివారుల్లోనూ ఈ రేవ్ పార్టీలు జరిగాయి. పోలీసులు చాలామందిని అరెస్టు చేశారు. విశాఖ, విజయవాడ ప్రాంతాల్లోనూ ఈ రేవ్ పార్టీ కల్చర్ కొనసాగుతోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు