శపించడానికి మీరేమైనా మునీశ్వరులా?దేవతలా?: విజయసాయిరెడ్డి!

టీడీపీ అధినేత చంద్రబాబు మీద వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సోషల్‌ మీడియా వేదికగా ఆయన చంద్రబాబు మీద విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయడం పై విజయసాయి రెడ్డి స్పందించారు.

New Update
శపించడానికి మీరేమైనా మునీశ్వరులా?దేవతలా?: విజయసాయిరెడ్డి!

టీడీపీ అధినేత చంద్రబాబు మీద వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సోషల్‌ మీడియా వేదికగా ఆయన చంద్రబాబు మీద విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయడం పై విజయసాయి రెడ్డి స్పందించారు. పుంగనూరు లో కార్యకర్తలను రెచ్చగొట్టింది మీరు..దాడులకు పాల్పడటట్లు చేసింది మీరు..మళ్లీ ఏమి తెలియనట్లు కేంద్రానికి లేఖలు రాయడం మీకే చెల్లిందని విమర్శించారు.

మీరు ఈ విషయాలు గురించి కాకుండా కేంద్రానికి '' బీకామ్ లో ఫిజిక్స్ పెట్టాలని, ఒలింపిక్స్ లో గెలిస్తే నోబెల్‌ ప్రైజ్‌, ఆస్కార్‌ ఇవ్వాలని ఇలాంటి విషయాలు గురించి రాస్తే బాగుంటుందేమో ఒకసారి ఆలోచించండి బాబు గారూ అంటూ ఆయన ట్విట్టర్‌ వేదికగా చురకలు అంటించారు.

మరో ఆరు నెలల్లో భవిష్యత్తు లో కనిపించకుండా పోయే పార్టీ టీడీపీ..2047 విజన్ డాక్యుమెంట్‌ ఎలా విడుదల చేస్తుందని ఆయన ప్రశ్నించారు. రెమిటెన్సెస్ కోసం ఎక్కువమంది యువతను విదేశాలకు పంపించాలనే ఆలోచన దేశ వ్యతిరేక చర్య అవుతుంది. మన దేశంలోనే ఉద్యోగాలు సృష్టించాలి. తద్వారా తెలుగువారంతా భారతదేశంలోనే తమ కుటుంబ సభ్యులతో కలిసి ఉంటారు. వీరంతా దేశ అభివృద్ధికి తోడ్పడుతార'ని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

అంతకుముందు ఆయన చేసిన మరో ట్వీట్‌లో 'చివరకు ఎంతకు దిగజారిపోయారు బాబుగారూ! రాజకీయంగా ఎదుర్కోలేక ఆ వ్యక్తే లేకపోతే బాగుండు అనే దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నారు. భూమి పేలిపోయి అందులోకి ఆయన కూరుకుపోవాలా? పురాణగాథల్లో వలె శపిస్తే నిజమైపోవడానికి మీరేమైనా మునీశ్వరులా? దేవతలా?' అని చురకలు అంటించారు.

'విజన్ 2020 అని దేశమంతా తిరిగి స్వీయ ప్రగల్భాలు పలికినా 2004లో ప్రజలు చిత్తుగా ఓడించారు. ఇప్పుడు విజన్ 2047 అంటూ మరో గారడీ చేయాలని చూస్తున్నాడు బాబుగారు. ఓటి పడవకు పైన ఎన్ని అలంకారాలు చేసినా నీటిలోకి వెళ్లిన తర్వాత మునగక తప్పదు' అని మరో ట్విట్‌ లో పేర్కొన్నారు.

ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు విడుదల చేసిన విజన్‌ 2047 గురించి వైసీపీ నేతలు ఒక్కొక్కరిగా విమర్శలు కురిపిస్తున్నారు. బుధవారం మాజీ మంత్రి పేర్ని నాని విరుచుకుపడ్డారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు