Home Loans: లక్షల కోట్ల రూపాయల హోమ్ లోన్స్ బకాయిలు.. బ్యాంకులకు పెద్ద కష్టం ఈమధ్య కాలంలో హోమ్ లోన్స్ సంఖ్య పెరిగింది. ఆర్బీఐ నివేదిక ప్రకారం 2024లో హౌసింగ్ బకాయి రుణాలు రూ.27,22,720 కోట్లుగా ఉన్నాయి. ఇది మర్చి 2023లో 19,88,532 కోట్లుగా ఉంది. రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్‌కు డిమాండ్ బలంగా ఉన్నందున హౌసింగ్ లోన్ వృద్ధి కొనసాగుతోంది. By KVD Varma 06 May 2024 in బిజినెస్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో గృహనిర్మాణ రంగానికి సంబంధించి బకాయిలు(Home Loans) దాదాపు రూ.10 లక్షల కోట్లు పెరిగి, ఈ ఏడాది మార్చిలో రికార్డు స్థాయిలో రూ.27.23 లక్షల కోట్లకు చేరాయి. సెక్టార్‌ల వారీగా ఆర్‌బీఐ బ్యాంకు రుణాల వివరాల ఆధారంగా వచ్చిన రిపోర్ట్ లో ఈ సమాచారం అందించారు. కోవిడ్ మహమ్మారి తర్వాత రెసిడెన్షియల్ ప్రాపర్టీ మార్కెట్‌లో పెరిగిన డిమాండ్ కారణంగా, హోమ్ లోన్స్(Home Loans) బకాయిలు పెరిగాయని బ్యాంకింగ్ - రియల్ ఎస్టేట్ రంగాల నిపుణులు తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నివేదిక ప్రకారం, మార్చి 2024లో హౌసింగ్ (ప్రాధాన్య రంగ గృహాలతో సహా) బకాయి రుణాలు(Home Loans) రూ.27,22,720 కోట్లుగా ఉన్నాయి. ఈ సంఖ్య మార్చి, 2023లో రూ. 19,88,532 కోట్లు, మార్చి 2022లో రూ. 17,26,697 కోట్లు. మార్చి 2024లో వాణిజ్య స్థిరాస్తి రుణాలు రూ.4,48,145 కోట్లుగా ఉన్నాయని డేటా వెల్లడించింది. ఇది మార్చి 2022లో రూ.2,97,231 కోట్లు. రిపోర్ట్ లో ఈ సమాచారం పొందుపరిచారు.. వివిధ ప్రాపర్టీ కన్సల్టెంట్ల నివేదికల ప్రకారం, గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో గృహాల విక్రయాలు, ధరలలో(Home Loans) భారీ వృద్ధి ఉంది. బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకనామిస్ట్ మదన్ సబ్నవిస్ మాట్లాడుతూ, గృహ రుణాలలో అధిక వృద్ధికి రెసిడెన్షియల్ సెక్టార్‌లోని అన్ని విభాగాల్లో బూమ్ కారణమని అన్నారు. ప్రభుత్వ ప్రయత్నాల వల్ల ముఖ్యంగా అఫర్డబుల్ హౌసింగ్ సెగ్మెంట్ పుంజుకుందని అన్నారు. గృహ రుణాల(Home Loans) వృద్ధి బలంగానే ఉంటుందని, అయితే అధిక బేస్ కారణంగా ఇది 15-20 శాతానికి తగ్గవచ్చని సబ్నవిస్ చెప్పారు. Also Read: ఐఆర్సీటీసీ ఇన్సూరెన్స్ ప్రీమియం పెరిగింది.. వివరాలివే.. RBI డేటాపై, రియల్ ఎస్టేట్ అనలిటిక్స్ కంపెనీ ప్రాప్‌ఈక్విటీ CEO- మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ జసుజా మాట్లాడుతూ, గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో అందించిన, విక్రయించిన ఆస్తుల పరిమాణం పెరగడం వల్ల బకాయి ఉన్న గృహ రుణాలు(Home Loans) పెరిగాయని అన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి మొదటి శ్రేణి నగరాల్లో 50-100 శాతం మధ్య ధరల పెరుగుదల కనిపించిందని ఆయన చెప్పారు. దీని కారణంగా, ఒక్కో ఆస్తికి సగటు రుణ పరిమాణం పెరిగింది. ఇండ్లు వేగంగా అమ్ముడవుతున్నాయి.. రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్‌కు డిమాండ్ బలంగా ఉన్నందున హౌసింగ్ లోన్ వృద్ధి కొనసాగుతుందని జసుజా అంచనా వేస్తున్నారు. క్రిసుమి కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ మోహిత్ జైన్ మాట్లాడుతూ, పెద్ద ఇళ్లకు డిమాండ్ నిజంగా ఆకాశాన్ని తాకుతోంది. ఒకప్పుడు విలాసానికి ప్రతీకగా భావించే ఇండ్లు ఇప్పుడు నిత్యావసరంగా మారాయన్నారు. #home-loan #rbi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి