Kangana Ranaut: కంగనా రౌనత్ పోటీ చేయడంపై మంత్రి సంచలన వ్యాఖ్యలు బాలివుడ్ నటి కంగనా రౌనత్‌కు బీజేపీ.. ఎంపీ టికెట్ ఇవ్వడంతో.. హిమాచల్‌ప్రదేశ్ మంత్రి విక్రమాదిత్య సింగ్ స్పందించారు. మూడింట ఒకవంతు సమయం కూడా తాను పోటీ చేయనున్న నియోజకవర్గంలో అందుబాటులో ఉండరని అన్నారు. By B Aravind 25 Mar 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి బీజేపీ హైకమాండ్ ఆదివారం 111 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అయితే హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి సెగ్మెంట్ నుంచి బాలీవుడ్ నటీ కంగనా రౌనత్‌కు బీజేపీ ఎంపీ టికెట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆమెకు ఎంపీ టికెట్ ఇవ్వడంతో హిమాచల్‌ప్రదేశ్ మంత్రి విక్రమాదిత్య సింగ్ స్పందించారు. కంగనా రౌనత్ మూడింట ఒకవంతు సమయం కూడా తాను పోటీ చేయనున్న నియోజకవర్గంలో కేటాయించరని తెలిపారు. Also Read: మనువడితో హోలీ ఆడిన సీఎం రేవంత్.. ఫొటోస్ వైరల్! సమయం కేటాయిస్తారా ? ' బీజేపీ అభ్యర్థుల ఎంపిక అనేది పార్టీ అంతర్గత విషయం. వాళ్లు ఎంపిక చేస్తున్న విధానంపై నేను మాట్లాడను. ఇది ఆ పార్టీ స్వేచ్ఛ. మేము మా బలంతో లోక్‌సభ ఎన్నికల రంగంలోకి దిగుతాం. కంగనా రౌనత్‌ను కూడా గౌరవిస్తాం. ఆమె నటిగా పలు అవార్డులు అందుకొని హిమాచల్‌ప్రదేశ్‌కు పేరు తీసుకొచ్చారు. కానీ ఇది రాజకీయం. అతిపెద్ద డౌట్ ఏంటంటే ఒక నటిగా ఆమెకు సినిమాల్లో నటించడం, నిర్మించమే మొదటి ప్రాధాన్యం. దీనివల్ల ఆమె మూడింట కనీసం ఒక వంతు సాయమైన హిమాచల్‌ప్రదేశ్‌కు కేటాయించగలరా అని' మంత్రి విక్రమాదిత్య ప్రశ్నించారు. ప్రజలే నిర్ణయించుకోవాలి ' బీజేపీ.. కంగనా రౌనత్ స్టార్‌డమ్ మీద ఆధారపడుతోంది. కేవలం స్టార్‌డమ్‌ను ఆధారంగా చేసుకొని అభ్యర్థిని ఎన్నికల రంగంలోకి దింపడం సరైంది కాదు. గెలిచినా ఓడినా ఆమెకు రాజకీయాలు తొలి ప్రాధాన్యం కాదు. అందుకే మండీ నియోజకవర్గం ప్రజలు మీకు అందుబాటులో ఉండే నేత కావాలా లేదా స్టార్‌డమ్ ఉన్న వాళ్లకు ఓటు వేస్తారా నిర్ణయించుకోవాలని' అన్నారు. Also read: నడి రోడ్డుపై అమ్మాయిల రొమాన్స్.. చివరికీ ఏమైందో చూస్తే షాక్ అవుతారు! ఇదిలాఉండగా.. ప్రస్తతం మండి ఎంపీగా ఉన్న హిమాచల్‌ప్రదేశ్ పీసీసీ చీఫ్.. ప్రతిభా సింగ్ ఇటీవల తాను రాబోయే లోక్‌సభ ఎన్నికల పోటీలో ఉండనని తెలిపారు. అయితే కంగనాకు బీజేపీ టికెట్ ఇవ్వడంపై కూడా ఆయన స్పందించారు. ఆమెకు ఎంపీగా పోటీ చేసే అవకాశం వచ్చినందుకు సంతోషమని అన్నారు. ఒక సినిమా సెలబ్రిటీ అయ్యి ఉండి.. రాజకీయాల్లోకి సడన్‌గా వచ్చిన కంగనా ఎలాంటి పాత్ర పోషిస్తారో చూస్తామని పేర్కొన్నారు. #telugu-news #national-news #lok-sabha-elections #kangana-ranaut మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి