Gold Price: మురిసినంత సేపు లేదు.. మళ్ళీ బంగారం ధర పెరిగింది.. ఎంతంటే.. 

ఈరోజు బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. ఈరోజు హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.65,850ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.71,830ల వద్ద ఉన్నాయి. వెండి ధర కేజీకి రూ.86,500 వద్ద ఉంది.

New Update
Gold Price: మురిసినంత సేపు లేదు.. మళ్ళీ బంగారం ధర పెరిగింది.. ఎంతంటే.. 

Gold Price: ఈవారంలో మూడురోజుల పాటు తగ్గుదల కనబర్చి.. గోల్డ్ లవర్స్ కు ఆశలు రేకెత్తించిన బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి. బంగారం ధరలు ఇకపై తగ్గే అవకాశం ఉందని  అందరూ భావించారు. కానీ, పరిస్థితి చూస్తే అలా కనిపించడం లేదు. అమెరికా ఫెడ్ రేట్లలో మార్పులు జరగకపోవడం.. అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరుగుతూనే ఉండడంతో మళ్ళీ బంగారం ధరలు పెరగవచ్చని భావిస్తున్నారు. బంగారం ధరల(Gold Price)పరిస్థితి ఇలా ఉంటే,  మరోవైపు వెండి ధరలు మాత్రం కాస్త తగ్గుదల కనబరిచాయి.  

సాధారణంగా బంగారం ధరలు(Gold Price)  ప్రతిరోజూ పైకీ.. కిందికీ కదులుతూనే ఉంటాయి. కానీ, ఇటీవల కాలంలో మాత్రం పైకి కదలడం తప్ప కిందికి దిగిరాలేదు. ఈ నేపథ్యంలో బంగారం కొనాలనుకునే సామాన్యులకు ప్రతిరోజూ నిరాశ కలుగుతూనే వచ్చింది. అయితే, క్రమేపీ బంగారం ధరల్లో నిలకడ కనిపిస్తూ  వచ్చి కాస్త ఆశలు రేపిన బంగారం ధరలు.. మళ్ళీ మెల్లగా పైకి కదులుతున్నాయి. బంగారం ధరల(Gold Price)  తగ్గుదల – పెరుగుదలపై చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో వచ్చే మార్పులు, సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనడంపై చూపించే  ఉత్సాహం, అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు, అమెరికా ఫెడ్ రేట్లలో మార్పులు  బంగారం ధర  ల్లో మార్పులకు కారణంగా  నిపుణులు చెబుతారు.  ప్రస్తుతం వీటితో పాటు.. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధం కారణంగా బంగారం ధరలు పైకీ, కిందికీ కదులుతున్నాయి. 

ఇక ఈరోజు అంటే మే 5న అంతర్జాతీయ స్థాయిలో బంగారం ధర  కాస్త తగ్గుదల  నమోదు చేసింది.   అయితే, దేశీయంగా మాత్రం సీన్ రివర్స్ గా కనిపించింది.  బంగారం ధరలు(Gold Price) పెరిగాయి.  మరోవైపు వెండి ధరలు కూడా  అంతర్జాతీయంగా కాస్త తగ్గాయి.  దీంతో దేశీయంగా కూడా తగ్గుదల నమోదు అయింది. ఈరోజు అంటే ఆదివారం (మే 5) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం, వెండి ధరలు(Gold Rate) దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.                               

హైదరాబాద్ లో బంగారం ధరలు..
హైదరాబాద్(Hyderabad) లో బంగారం ధరలు ఈరోజు కాస్త పెరిగాయి.  దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(Gold Rate)  100 రూపాయలు పెరిగి రూ.65,850ల వద్ద నిలిచింది. 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు 100 రూపాయలు పెరిగింది. దీంతో  రూ.71,830లుగా ఉంది. 

Also Read: ఈ అక్షయ తృతీయకు బంగారం కొనే పరిస్థితి ఉంటుందా?

ఢిల్లీలో బంగారం ధరలు ఇలా..
అలాగే ఢిల్లీలో కూడా బంగారం ధరలు(Gold Price Today) కాస్త పెరుగుదల నమోదు చేశాయి. ఇక్కడ  22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు 100 రూపాయలు పెరిగి రూ.66,000ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా 180 రూపాయలు పెరిగి రూ.71,980ల వద్దకు చేరింది. 

వెండి ధరలు ఇలా..
ఇక వెండి విషయానికి వస్తే.. మొన్నటివరకూ బంగారం ధరల (Gold Price Today) పెరుగుదలతో పాటే వెండి కూడా రికార్డు పరుగులు తీసిన విషయం తెలిసిందే. అయితే, ఈ మధ్య వెండి ధరలు కూడా దిగివస్తున్నాయి. నిన్న నిలకడగా వెండి ధరలు ఈరోజు కేజీకి 500 రూపాయల మేర తగ్గాయి. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి రూ.86,500ల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే, ఢిల్లీ(Delhi) లోనూ కేజీ వెండి 500 తగ్గుదల నమోదు చేసి రూ.83,000ల వద్ద నిలిచింది. 

అంతర్జాతీయంగా..
మరోవైపు అంతర్జాతీయంగా బంగారం ధరల్లో కాస్త తగ్గుదల నమోదు అయింది.  ఈరోజు ఉదయం 9 గంటల సమయానికి ఔన్స్ బంగారం 2,302.57డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా స్పాట్ వెండి ధర స్వల్ప తగ్గుదలతో(Gold And Silver Price) ఔన్స్ 26.56డాలర్లకు చేరింది.   

గమనిక : బంగారం ధరలు అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయంగా ఉండే డిమాండ్, స్థానికంగా ఉండే పన్నులు, సెస్సులు ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతూ వస్తాయి. ఇక్కడ ఇచ్చిన ధరలు జ్యువెలరీ అసోసియేషన్ వెబ్ సైట్ లో ఇచ్చిన ధరల ఆధారంగా.. ఈరోజు మార్కెట్ ప్రారంభసమయానికి ఉన్నవి. బంగారం, వెండి కొనుక్కోవాలి అనుకుంటే, అన్ని అంశాలను పరిశీలించి.. స్థానికంగా ఉన్న మార్కెట్ రేట్లను స్పష్టంగా

Advertisment
Advertisment
తాజా కథనాలు