/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/7-2-jpg.webp)
Suryapet: నడిరోడ్డుపై హిజ్రాలు మరోసారి వీరంగం సృష్టించారు. రెండు గ్రూపుల మధ్య మొదలైన చిన్న గొడవ కాస్త పెద్దదవడంతో దాడి చేసుకునేంతవరకూ వెళ్లింది. మాట మాట పెరగడంతో విచక్షణ కొల్పోయిన హిజ్రాలు దారుణంగా కొట్టుకున్నారు. అందరూ చూస్తుండగానే బట్టలిప్పి మరి రోడ్లపై హంగామా చేశారు. హిజ్రాల ఫైటింగ్ వీడియో వైరల్ అవుతుండగా ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
వీరంగం సృష్టించిన హిజ్రాలు
సూర్యాపేట - తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో రెండు గ్రూపులుగా ఏర్పడి విచక్షణారహితంగా దాడి చేసుకున్న హిజ్రాలు. pic.twitter.com/598flIe0dw
— Telugu Scribe (@TeluguScribe) March 18, 2024
సూర్యాపేట-తొర్రూర్ బ్యాచ్ లు..
ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో హిజ్రాలు రెండు గ్రూపులుగా విడిపోయి విచక్షణా రహితంగా దాడులు చేసుకున్నట్లు తెలిపారు. ఒకరి ఏరియాలోకి మరొకరు రావడమే ఇందుకు కారణమని, చిన్నగా మొదలైన వివాదం రెండు హిజ్రాల గ్రూపుల మధ్య దాడులవరకూ వెళ్లిందని చెప్పారు. సూర్యాపేట బ్యాచ్.. తొర్రూర్ గ్రూపులకు చెందిన 20 మంది పైగా అందరూ చూస్తుండగానే రోడ్డుపై పొట్టు పొట్టు కొట్టుకున్నారు. ఒక్కసారిగా ఈ ఘటనతో భయాందోళనకు గురైన స్థానికులు సమాచారం ఇవ్వడంతో వెంటనే ఘటన స్థలానికి వెళ్లి హిజ్రాలను వారించడంతో వివాదం సద్ధుమణిగిందని, బాధ్యులను స్టేషన్ కు పిలిచి విచారించినట్లు తెలిపారు. మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని మందలించి వదిలేసినట్లు సమాచారం.