వెకేషన్ ను ఎంజాయ్ చేస్తూ సామ్ గూఫీ డ్యాన్స్.. వీడియో వైరల్

తన ఫ్రెండ్ తో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియను ఇన్ స్టాలో సామ్ షేర్ చేసింది. గ్రుపో రఫగా బ్యాండ్‌ స్వర పరిచిన మెంటిరోసా మ్యూజిక్‌కు తన స్నేహితురాలితో కలిసి గూఫి డ్యాన్స్‌ వేసింది. ప్రస్తుతం ఈ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో హల్చల్..

New Update
వెకేషన్ ను ఎంజాయ్ చేస్తూ సామ్ గూఫీ డ్యాన్స్.. వీడియో వైరల్

హాలీడే వెకేషన్ ను ఎంజాయ్ చేస్తోంది సమంత. ఓ వైపు తన వ్యాధికి సంబంధించిన చికిత్స తీసుంటూనే మరోవైపు స్నేహితులతో కలిసి సందడి చేస్తోంది. లేటెస్ట్ గా సమంత తన ఫ్రెండ్స్ తో కలిసి ఇండోనేషియాలోని బాలికి వెళ్లింది. ఈ సందర్భంగా ఇన్ స్టాలో తరచుగా ఆ ట్రిప్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను పెడుతూ అభిమానులను అలరిస్తుంది. తాజాగా తన ఫ్రెండ్ తో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియను ఇన్ స్టాలో సామ్ షేర్ చేసింది. గ్రుపో రఫగా బ్యాండ్‌ స్వర పరిచిన మెంటిరోసా మ్యూజిక్‌కు తన స్నేహితురాలితో కలిసి గూఫి డ్యాన్స్‌ వేసింది. ప్రస్తుతం ఈ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

ఇక సామ్ గత కొంతకాలంగా మయోసైటిస్ తో బాధపడుతుంది. ఆ మధ్య కొన్నిరోజులు షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత తన చేతిలో ఉన్న ప్రాజెక్ట్ లను పూర్తి చేసింది. ఇక ఇప్పుడు చికిత్స నిమిత్తం ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ తీసుకోనుంది. ప్రస్తుతం సామ్‌ నటించిన ఖుషీ రిలీజ్‌ కు సిద్ధంగా ఉంది. విజయ్‌ హీరోగా నటించిన ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకుడు. ఇప్పటికే రిలీజైన పాటలు ఇన్ ‌స్టాంట్‌ గా ఎక్కేశాయి. ఈ సినిమా సెప్టెంబర్‌ 1న విడుదలకు రెడీ అవుతోంది.

ఈ మూవీ టీజర్ ను వచ్చే వారం విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. దీనితో పాటు వరుణ్‌ ధావన్ ‌తో కలిసి చేసిన సిటాడెల్ వెబ్‌ సిరీస్‌ సెప్టెంబర్‌ లో స్ట్రీమింగ్‌ కానుంది. అయితే ఈ వెబ్ సిరీస్ కోసం సమంత భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మామూలుగా సమంత ఒక్కో సినిమాకు నాలుగు నుంచి ఐదు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట. అయితే ఈ సిరీస్ కోసం మాత్రం ఓ రేంజ్‌లో అంటే పది కోట్ల వరకు తీసుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది.

ఇటీవల సమంత నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ శాకుంతలం మూవీ ఏకంగా 80 కోట్లకు రూపాయల బడ్జెట్‌ తో తెరకెక్కి బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా విఫలం అయ్యింది. అయితే ఈ సినిమాకు రెవెన్యూ రాకపోయిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ లో అవార్డులు క్యూ కట్టాయి. స్ట్ ఫాంటసీ ఫిల్మ్, బెస్ట్ ఫారిన్ ఫిల్మ్, బెస్ట్ ఇండియన్ ఫిల్మ్, బెస్ట్ క్యాస్టూమ్ డిజైన్ విభాగాలలో ఈ సినిమాకు అవార్డులు వచ్చాయని తెలుస్తోంది. ఇక న్యూయార్క్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ అవార్డ్స్ లో కూడా శాకుంతలం సినిమాకు అవార్డ్స్ వచ్చాయి.

ఇక సమంత విషయానికొస్తే.. ఏమాయ చేశావే సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమకు పరిచమైన ఈమో.. ఆ తర్వాత హీరో నాగచైతన్యనే ప్రేమించి పెళ్లాడింది. ఏడేళ్లు ప్రేమించుకున్న వీళ్లు 2017 అక్టోబర్‌ 7న వివాహ బంధంతో ఒకటయ్యారు. ఓ నాలుగేళ్ల తర్వాత ఈ జంట విడిపోయి అందరికి షాక్ ఇచ్చారు. 2021లో వీరిద్దరూ విడిపోతున్నట్లు ప్రకటించారు. మరి వీరి డివోర్స్ తీసుకునేందుకు కారణాలు ఇంకా తెలీదు. రకరకాల రూమర్స్ అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు