Brazil: ప్రాణలకు తెగించి భార్య, కూతురిని రక్షించాడు.. వీడియో చూస్తే మెచ్చుకోకుండా ఉండలేరు!

ఆపద వచ్చినప్పుడు మనల్ని మనం కాపాడుకోవడం చాలా కామన్. కానీ మన ప్రాణాల్ని కూడా లెక్క చేయకుండా అవతలి వారిని కాపాడే వాడే హీరో. ఇప్పుడు ఇలాంటి హీరో గురించే మనం చెప్పుకోబోతున్నాం. ఆ హీరో ఎవరు..ఎక్కడి వాడు తెలియాలంటే... ఈకథనం చదివేయండి.

New Update
Brazil: ప్రాణలకు తెగించి భార్య, కూతురిని రక్షించాడు.. వీడియో చూస్తే మెచ్చుకోకుండా ఉండలేరు!

Marcos Vinicius: కొన్ని వీడియోలు చూస్తే మనం ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోతాం. భయం, ఆదుర్దా, ఆశ్చర్యంతో మన చేతులు ఆటోమేటిక్‌గా గుండెల మీదకు చేరుకుంటాయి. అలాంటి వీడియోనే ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వీడియోను చూసి వావ్ అంటున్నారు అందరూ. ఇందులో ఉన్న హీరో మార్కోస్ వినిసియస్‌ను తెగ మెచ్చేసుకుంటున్నారు కూడా. ఇంతకీ ఏం్ జరిగిందంటే...

వరదల నుంచి తల్లీ, బిడ్డను కాపాడిన వైనం..

కొన్ని రోజుల క్రితం ఆకస్మిక వరదలు బ్రెజిల్‌ను ముంచేశాయి. ఈ వరదల్లో ఒక కారు చిక్కుకుపోయింది. అందులో ఒక తల్లీ, బిడ్డా ఉన్నారు. వారితో పాటూ మార్కోస్ కూడా ఉన్నాడు. అయితే మార్కోస్ ఇందులో నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. తాను క్షేమంగానే ఉన్నాను కదా అని అనుకోలేదు మార్కోస్. తన భార్యా, బిడ్డలను కూడా రక్షించాలని అనుకున్నాడు. అంతే అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించి, వరదలకు ఎదురీది మరీ కారులో ఉన్నవారిని రక్షించాడు. దీని కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయలేదు మార్కోస్. వరదల్లో కొట్టుకువెళిపోతున్న కారుకు ఒక పక్క వేలాడుతూ ఒక్కొక్కరిగా ఒడ్డుకు చేర్చాడు. ముందు బిడ్డను కారులో నుంచి తీసి బయటకు చేరవేశాడు. తర్వాత తల్లిని కూడా రక్షించాడు. మార్కోస్ ఇద్దరినీ రక్షించాక కారు శరవేగంగా వరదల్లో కొట్టుకుపోయింది. ఒక్క నిమిషం లేటయినా తల్లి, బిడ్డా ప్రాణాలు నీటిలో కలిసిసోయేవి.

వీడియోను విపరీతంగా చూస్తున్న నెటిజన్లు...

మార్కోస్ సాహసాన్ని ఎవరో వీడియోగా తీశారు. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఒక్క రోజులోనే ఈ వీడియోకు 7.8లక్షల వ్యూస్ వచ్చాయి. దాదాపు 37వేల లైకులను సంపాదించుకుంది. అంతేకాదు ఈ వీడియో కింద తెగ కామెంట్లు కూడా పెడుతున్నారు నెటిజన్లు. అందరూ మార్కోస్ వినిసియస్ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. అతను అంత ప్రశాంతంగా , ఓపికగా తల్లీ, బిడ్డా ప్రాణాలను కాపాడ్డం అద్భుతమని పొగుడుతున్నారు. ఈ రోజుల్లో ఇంత నిస్వార్ధంగా ఉండడం చాలా అరుదని మెచ్చుకుంటున్నారు.

Also Read:PM Modi: సముద్రగర్భంలోని ద్వారకాకు ప్రధాని మోదీ పూజలు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

చనిపోయిన పందిని మళ్లీ బతికించారు ..!

చైనా శాస్త్రవేత్తలు అద్భుతాన్ని సృష్టించారు. చనిపోయిన పంది మెదడును మళ్లి బతికించారు. 50 నిమిషాల పాటు పనిచేయకుండా పోయిన పంది మెదడు మళ్లి పని చేయడం వైద్య శాస్త్రంలో అద్భుతం అని చెప్పవచ్చు.

author-image
By Archana
New Update

Life Style: ఇదొక మెడికల్ మిరాకిల్ అనే పదం వినే ఉంటారు. ఇప్పుడు ఇలాంటి సంఘటనే చైనాలో చోటుచేసుకుంది. చైనా శాస్త్రవేత్తలు అద్భుతాన్ని సృష్టించారు. చనిపోయిన పంది మెదడును మళ్ళీ బతికించారు. 50 నిమిషాల పాటు పనిచేయకుండా పోయిన పంది మెదడు మళ్లి పని చేయడం వైద్య శాస్త్రంలో అద్భుతం అని చెప్పవచ్చు. సాధారణంగా గుండె ఆగిపోయినప్పుడు.. మెదడు రక్తప్రసరణ కూడా ఆగిపోతుంది. ఆ తర్వాత కొన్ని నిమిషాల్లోనే మెదడు కణాలు చనిపోవడం ప్రారంభిస్తాయి. ఈ పరిస్థితి ఇస్కీమియాకు దారితీస్తుంది. ఇస్కీమియా అనేది శరీరంలో కొంత భాగానికి రక్త ప్రవాహం తక్కువగా ఉండడం. సరైన రక్త ప్రవాహం లేకపోవడం వల్ల కణజాలాలకు అవసరమైన ఆక్సిజన్‌ అందదు. ఇలాంటి పరిస్థితిల్లో మెదడుకు రక్త సరఫరా నిలిచిపోయి శాశ్వతంగా మెదడు క్షీణించటం మొదలవుతుంది. అంతేకాదు  గుండెపోటు గుండెపోటు, స్ట్రోక్స్ వంటి ప్రాణాంతక పరిస్థితులకు దారితీస్తుంది.

Also Read: 'ఆ కట్ అవుట్ చూసి అన్ని నమ్మేయాలి డ్యూడ్'! మెగాస్టార్ ట్వీట్ చూస్తే ఫ్యాన్స్ కు పూనకాలే

చైనా శాస్త్రవేత్తలు అద్భుతం 

ఇప్పుడు చైనా శాస్త్రవేత్తలు చనిపోయిన పంది మెదడును బతికించిన ఫలితాలు .. మెదడుకు రక్త సరఫరా నిలిచిపోయిన నిమిషాల వ్యవధిలోనే మెదడు శాశ్వతంగా క్షీణించటం మొదలవుతుందనే భావనను సవాలు చేసేలా ఉన్నాయి. అయితే పందులు చనిపోయిన తర్వాత నాలుగు గంటల అనంతరం వాటి మెదళ్లను పాక్షికంగా పునరుద్ధరించిన ఘటన 2019లోనూ జరిగింది. 

బ్రెయిన్ డెడ్ అంటే ఏమిటి? 

మెదడుకు రక్తం లేదా ఆక్సిజన్ సరఫరా ఆగిపోయినప్పుడు బ్రెయిన్ డెత్ సంభవిస్తుంది.

బ్రెయిన్ డెడ్ కారణాలు

  • మెదడుకు తీవ్రమైన గాయమైనప్పుడు
  • మెదడులో రక్తస్రావం జరగడం (ఇంట్రాసెరెబ్రల్ హెమరేజ్) 
  • ఇస్కీమిక్ స్ట్రోక్ ( సరైన ఆక్సిజన్ అందకపోవడం) 
  • గుండెపోటు
  • మెనింజైటిస్ లేదా ఎన్సెఫాలిటిస్ వంటి ఇంట్రాక్రానియల్ ఇన్ఫెక్షన్లు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Also Read: గంగవ్వకు బిగ్ బాస్ షాక్! పాపం అవ్వ.. ఇలా జరిగిందేంటి

Advertisment
Advertisment
Advertisment