/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-21T142117.808-jpg.webp)
Ratnam : హీరో విశాల్ లేటెస్ట్ చిత్రం 'రత్నం'. సింగం ఫేమ్ హరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యంగ్ బ్యూటీ ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటించగా.. సముద్రఖని, యోగిబాబు మరియు గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలు పోషించారు. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు మేకర్స్.
Just can't believe what I heard. My oh my. The words #uyire #Praanam has played a key role in all my songs in my career so far and made such an impact. Darling @ThisisDSP.
U r truly a rockstar. Giving such a lovely lyrical melody amidst the previous mass hits in our film… pic.twitter.com/vqOwefHtdC— Vishal (@VishalKOfficial) April 19, 2024
ఈ సందర్భంగా తాజాగా శనివారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన విశాల్ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సినిమాల పరంగా నేను మొదటి నుంచి ప్రయోగాలు, సాహసాలు చేస్తున్నా. ఈ క్రమంలో ఎన్నో సార్లు గాయపడ్డాను. అయినా సరే ప్రేక్షకులను మెప్పించేందుకు మంచి కథలనే ఎంచుకుంటున్నాను అని అన్నారు. ఇప్పుడు రత్నం కూడా అభిమానులకు నచ్చేలా ఉండబోతుంది. గతంలో హరి దర్శకత్వంలో చేసిన భరణి, పూజ సినిమాలు చేశానని.. అవి భారీ విజయాలు సాధించాయని. ఇప్పుడు 'రత్నం' కూడా మంచి విజయం సాధిస్తుందని విశాల్ నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతం అందించారు.
Also Read: Music Shop Murthy: 50 ఏండ్ల వయసులో డీజే అవ్వాలని కోరిక .. ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ టీజర్