Raviteja: హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన రవితేజ హీరో రవితేజ కుడి చేతికి సర్జరీ అనంతరం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ రవితేజ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. "ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నానని. తన క్షేమాన్ని ఆకాంక్షిస్తూ సందేశాలు పంపిన వారందరికీ ధన్యవాదాలు అని తెలిపారు." By Archana 24 Aug 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Ravi Teja: 'RT75' మూవీ షూటింగ్ లో గాయపడిన రవితేజ నిన్న ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. కుడి చేతికి గాయం పెద్దగా కావడంతో చికిత్స కోసం యశోద ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం ఆయన చేతికి చిన్న సర్జరీ నిర్వహించిన వైద్యులు.. ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. కాగా, సర్జరీ అనంతరం హీరో రవితేజ ఈరోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని రవితేజ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు." సాఫీగా సాగిన సర్జరీ తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాను. ప్రస్తుతం నేను ఆరోగ్యంగా ఉన్నాను. నా క్షేమాన్ని ఆశిస్తూ సందేశాలు పంపిన వారందరికీ ధన్యవాదాలు. త్వరలోనే సెట్స్ పై తిరిగి అడుగుపెట్టేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని ట్వీట్ చేశారు. " Successfully discharged after a smooth surgery and feeling fine. Grateful for all your warm blessings and support ❤️🙏 Excited to be back on set soon 👊 — Ravi Teja (@RaviTeja_offl) August 24, 2024 రవితేజ 'RT75' ప్రస్తుతం రవితేజ ఆయన నెక్స్ట్ మూవీ 'RT75' చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. రవితేజ 75వ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీని భాను భోగవరపు తెరకెక్కిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ మూవీ 2025 సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. Also Read: Health: ఈ కూరగాయలను తక్కువగా ఉడికించండి.. లేదంటే పోషకాలు నశిస్తాయి..! - Rtvlive.com #tollywood #raviteja సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి