శ్రీలీలపై కన్నేసిన యంగ్ హీరో.. ఈవెంట్ ల్లో తెగ పొగిడేస్తున్నాడే!

‘ఎక్స్‌ట్రా ఆర్డినరీమ్యాన్‌’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా యంగ్ బ్యూటీ శ్రీలీలపై హీరో నితిన్ ప్రశంసలు కురిపించారు. నిజ జీవితంలో ఎక్స్‌ట్రార్డినరీ మహిళ. భరతనాట్యం, కూచిపూడి, హాకీ, స్విమ్మింగ్‌ వంటి ఎన్నో కలలున్న మల్టీ టాలెంటెడ్ యాక్టర్ ఇండస్ట్రీకి లభించడం నిజంగా లక్కీ అన్నారు.

New Update
శ్రీలీలపై కన్నేసిన యంగ్ హీరో.. ఈవెంట్ ల్లో తెగ పొగిడేస్తున్నాడే!

టాలీవుడ్ స్టార్ హీరో నితిన్‌ యంగ్ బ్యూటీ శ్రీలీలను తెగ పొగిడేస్తున్నాడు. శ్రీలీల కేవలం నటనలోనే కాదు మిగతా విషయాల్లోనూ హై టాలెంటెడ్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నాడు. ఈ మేరకు వీరిద్దరు జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీమ్యాన్‌’ డిసెంబర్‌ 8న రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా  సినిమాను జోరుగా ప్రచారం చేస్తున్న మేకర్స్.. రీసెంట్ గా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. కాగా ఈ వేడుకకు మూవీ యూనిట్ తోపాటు పలువురు సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు.

publive-image

అయితే ఈ వేడుకలో సినిమాను ఉద్దేశిస్తూ మాట్లాడిన నితిన్.. ఈ కామెండీ ఎంటర్ టైనర్ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పింస్తుందన్నారు. ‘‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ నాకు చాలా ప్రత్యేకమైన సినిమా. నా కెరీర్‌లో ఇంత మంచి పాత్ర ఇప్పటి వరకు పోషించలేదు. మా నాన్న డిస్ట్రిబ్యూటర్‌గా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆయన డిస్ట్రిబ్యూట్‌ చేసిన మొదటి సినిమా రాజశేఖర్‌ నటించిన ‘మగాడు’. అది సూపర్‌ హిట్‌ కావడంతో ఇండస్ట్రీలోనే కొనసాగారు. దాంతో నాకు సినిమాల్లోకి రావాలనే ఆసక్తి కలిగింది. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే దానికి రాజశేఖర్‌ ప్రధాన కారణం. ఆయన ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ చేయడమే మాకు పెద్ద బహుమతి' అన్నారు. అలాగే నటి శ్రీలీల గురించి చెబుతూ.. ఆమె నిజ జీవితంలో ఎక్స్‌ట్రార్డినరీ మహిళ. ఆమెకు భరతనాట్యం, కూచిపూడిలోపాటు రాష్ట్రస్థాయిలో హాకీ ప్లేయర్‌, స్విమ్మింగ్‌లోనూ రికార్డు ఉంది. త్వరలోనే మెడిసిన్‌ పూర్తిచేయనుంది. ఇలాంటి మల్టీ టాలెంటెడ్ యాక్టర్ ఇండస్ట్రీకి లభించడం నిజంగా లక్కీ అంటూ ప్రశంసలు కురిపించారు.

publive-image

Also read : మీరు సుఖంగా ఉంటే సరిపోతుందా.. సిగ్గుతో తలదించుకోండి: చెన్నై అధికారులపై విశాల్ ఫైర్

ఈ క్రమంలోనే సినిమా గురించి పలు విషయాలు వెల్లడించిన శ్రీలీల.. ‘ఇప్పటి వరకు విడుదలైన ట్రైలర్‌, పాటలను ఆదరించినందుకు ధన్యవాదాలు. ఈ సినిమాలో నా పాత్రకు హద్దులు ఉండవు. కచ్చితంగా అందరూ ఎంజాయ్‌ చేస్తారు’ అన్నారు. అలాగే నితిన్‌ చాలా కష్టపడతాడు. ఈ సినిమాలో నాది చిన్న పాత్రే అయినా.. నవ్వులు పూయిస్తుంది. ‘జీవితమూ జీవిత ఒక్కటే’ అని నేను చెప్పిన డైలాగ్ ఇప్పటికే వైరల్‌గా మారింది. నేను నా భార్య ఏం చెబితే అది చేస్తానని అందరూ అనుకుంటారు. కానీ, అది నిజం కాదు.. నేను ఏది చెబితే జీవిత అది చేస్తుంది. చాలా మంచి వ్యక్తి అంటూ జీవితపై ప్రశంసలు కురిపించారు రాజశేఖర్. అలాగే ‘భార్యాభర్త ఎప్పుడూ ఒకరినొకరు అర్థంచేసుకోవాలి. అలా అయితేనే జీవితం అందంగా ఉంటుంది. నా కుటుంబమే నా ప్రపంచం. మంచి పాత్ర ఉంటే రాజశేఖర్‌ అతిథి పాత్రల్లో నటించడానికి సిద్ధంగా ఉంటారు’ అని జీవిత అన్నారు. చివరగా దర్శకుడు వక్కంతం వంశీ మాట్లాడుతూ.. సినిమా అవుట్ పుట్ అద్భుతంగా రావడంకోసం నిర్మాత ఎక్కడా రాజీ పడలేదని, రాజశేఖర్‌ ఇందులో నటించడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఈ సినిమా అందరికీ నచ్చుతుందని, తప్పకుండా హిట్ అవుతుందని చెప్పారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Indian Film Pyre: అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఏకంగా 6 విభాగాల్లో 'పైర్' నామినేషన్

నేషనల్ అవార్డు విజేత డైరెక్టర్ వినోద్ కాప్రి తెరకెక్కించిన 'పైర్' 24వ ఇమాజిన్ ఇండియా అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో 6 విభాగాల్లో నామినేషన్ దక్కించుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ కథ, సంగీతం, ఉత్తమ DOP, ఉత్తమ సౌండ్ డిజైనింగ్ విభాగంలో నామినేట్ చేయబడింది.

New Update
Indian film pyre nominated for 6 categories at 24th Imagine India International Film Festival

Indian film pyre nominated for 6 categories at 24th Imagine India International Film Festival

Indian Film Pyre:  2024లో  నేషనల్ అవార్డు గ్రహీత దర్శకుడు వినోద్ చోప్రా రూపొందించిన 'ఫైర్' చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఉత్తరాఖండ్‌లోని వలసల వల్ల ప్రభావితమైన మున్సియారి అనే గ్రామంలోని వృద్ధ జంట నిజమైన కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు.  పద్మ సింగ్,  హీరా దేవి ఇద్దరు వృద్దులు ఇందులో ముఖ్యమైన పాత్రలు పోషించారు. అయితే విడుదలకు ముందే  ప్రపంచవ్యాప్తంగా పలు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడిన ఈ చిత్రం..  తాజాగా ఈ చిత్రం మరో ఘనత సాధించింది. 

ఏకంగా 6 విభాగాల్లో 

స్పెయిన్  అంతర్జాతీయ చలనచిత్రోత్సవం '24th Imagine India International Film Festival' ఏకంగా 6 విభాగాల్లో నామినేషన్ దక్కించుకుంది.  ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ కథ, ఉత్తమ సంగీతం, ఉత్తమ ఫోటోగ్రఫీ దర్శకుడు,  ఉత్తమ సంగీత రూపకల్పన విభాగాలలో నామినేట్ చేయబడింది.

  • డైరెక్టర్  వినోద్ కాప్రి ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు,  ఉత్తమ కథకు నామినేట్ అయ్యారు.
  • 'లైఫ్ ఆఫ్ పై'  ఫేమ్ కెనడియన్ సింగర్,  అకాడమీ అవార్డు గ్రహీత మైఖేల్ డన్నా ఉత్తమ సంగీతానికి నామినేట్ అయ్యారు.
  • మానస్ భట్టాచార్య ఉత్తమ DOPకి నామినేషన్ పొందగా, సౌస్తవ్ నస్కర్ ఉత్తమ సౌండ్ డిజైన్‌కు నామినేట్ అయ్యారు.

ఇదిఇలా ఉంటే ఇటీవలే 16వ బెంగళూరు అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో కూడా  ప్రారంభ చిత్రంగా  'ఫైర్' ప్రదర్షింపబడింది.  

ఫిల్మ్ ఫెస్టివల్ ఉద్దేశ్యం?

24వ ఇమాజిన్ ఇండియా అంతర్జాతీయ చలనచిత్రోత్సవం 2025 సెప్టెంబర్ 1 నుంచి 16 వరకు స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో జరగనుంది. భారతదేశం నుంచి వచ్చే చిత్రాలను ప్రదర్శించడం,  వాటిపై దృష్టిని ఆకర్షించడం  ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లక్ష్యం.  

latest-news | telugu-news | cinema-news 

Advertisment
Advertisment
Advertisment