Floods : ముంచెత్తిన వరదలు... 20 మంది మృతి!

నేపాల్ ను వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగి పడటంతో పాటు, పిడుగులు పడటం వల్ల 20 మంది చనిపోయారు.కొండచరియలు విరిగిపడటంతో 3 ఇళ్లు వరదలల్లో కొట్టుపోగా...ఆ ఇళ్లలో ఇద్దరు చిన్నారులతో పాటు 4 గురు మరణించారని జిల్లా అధికారులు ప్రకటించారు.

New Update
Floods : ముంచెత్తిన వరదలు... 20 మంది మృతి!

Floods In Nepal : నేపాల్ (Nepal) ను వరదలు (Floods) ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల (Heavy Rains) కారణంగా కొండ చరియలు విరిగి పడటంతో పాటు, పిడుగులు పడటం వల్ల 20 మంది చనిపోయారు. ఖాట్మండుకు పశ్చిమాన 125 కి.మీ దూరంలో ఉన్న లామ్‌ జంగ్‌ జిల్లాలో రాత్రిపూట కొండచరియలు విరిగిపడటంతో 3 ఇళ్లు వరదలల్లో కొట్టుపోగా... ఆ ఇళ్లలో ఇద్దరు చిన్నారులతో పాటు 4 గురు మరణించారని జిల్లా అధికారులు ప్రకటించారు.

రెండు రోజుల నుంచి పిడుగుపాటుకు మరో తొమ్మిది మంది మరణించారని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 20 మంది చనిపోయినట్లుగా వెల్లడించారు. నేపాల్‌ కి ఆగ్నేయంగా 500 కి.మీ దూరంలో ఉన్న మోరాంగ్‌ జిల్లాలో మంగళవారం వరదలు కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు.

మరో పక్క కొండచరియలు విరిగిపడటంతో మరో ముగ్గురు మరణించారు. సహాయక సిబ్బంది రంగంలోకి దిగి చర్యలు చేపట్టాయి.

Also read: టార్గెట్ ఏవీ సుబ్బారెడ్డి.. అఖిల ప్రియ నెక్ట్స్ స్టెప్ ఇదేనా?

Advertisment
Advertisment
తాజా కథనాలు