Floods : తెగిన రోడ్లు.. కొట్టుకుపోయిన కార్లు.. వరద బీభత్సం

భారీ వర్షాలతో గురజరాత్‌ అతలాకుతలమవుతుంది. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు విపరీతంగా పడుతున్నాయి. అహ్మదాబాద్, సూరత్ సహా పలు జిల్లాల్లో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది.

New Update
Floods : తెగిన రోడ్లు.. కొట్టుకుపోయిన కార్లు.. వరద బీభత్సం

Heavy Rains In Gujarat : భారీ వర్షాలతో గురజరాత్‌ అతలాకుతలమవుతుంది. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు (Heavy Rains) విపరీతంగా పడుతున్నాయి. అహ్మదాబాద్, సూరత్ సహా పలు జిల్లాల్లో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. సూరత్ జిల్లాలోని పాల్సానా తాలూకాలో కేవల పది గంటల సమయంలోనే 15.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

భారీ వర్షాలకు సూరత్, భుజ్, వాపి, భరూచ్, అహ్మదాబాద్ నగరాల్లో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది.. ఆ నగరాల్లోని అండర్ పాస్ తో పాటు లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడంతో స్థానికులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. దీంతో నగరంలోని చాలా ప్రాంతాల్లో నీరు చేరి స్థానికులు ఇబ్బందిపడ్డారు. మరో నాలుగు రోజుల పాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

భారీ వర్షాలకు అహ్మదాబాద్ (Ahmedabad) లోని షేలా ఏరియాలో ఓ రోడ్డు కుంగిపోయింది. దీంతో రోడ్డు మధ్య భాగంలో భారీ గొయ్యి ఏర్పడి ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చుట్టుపక్కల వర్షపు నీళ్లన్నీ కుంగిపోయిన రోడ్డులో చేరాయి. కాగా.. రోడ్డు కుంగిపోవడంపై కేరళ కాంగ్రెస్ యూనిట్.. గుజరాత్ బీజేపీ (BJP) ప్రభుత్వంపై విమర్శలు చేసింది. ‘‘అహ్మదాబాద్ సిటీలో ఇటీవలే వర్షపు నీటిని ఒడిసిపట్టే కార్యక్రమం చేపట్టారు. ఎంతగా అంటే ఒక్క చుక్క వర్షపు నీరు కూడా అరేబియా సముద్రంలో చేరనంతగా” అని కేరళ కాంగ్రెస్ (Congress) విమర్శలు చేసింది.

Also read: రాష్ట్రంలో పండగ వాతావరణం.. చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేర్చారు: హోం మంత్రి అనిత

Advertisment
Advertisment
తాజా కథనాలు