Rains: మరో నాలుగు రోజులు భారీ వర్షాలు... ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌!

తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.ఈ క్రమంలో పలు జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్‌ ను జారీ చేశారు.

New Update
Weather Alert: ఈ నెల 12 వరకు భారీ వర్షాలు

Rains: రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దీంతో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వివరించారు. దీంతో ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.శుక్రవారం ఆదిలాబాద్‌, కుమ్రంభీం, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మెదక్‌, కామారెడ్డి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది.

ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.. అంతేకాకుండా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. నిర్మల్‌, నిజామాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది.

శనివారం వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, వనపర్తి, నారాయణపేట , ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.

ఆదివారం వరంగల్‌, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, వికారాబాద్‌, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి,, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.

Also Read: షేక్ హసీనాకు షాకిచ్చిన బంగ్లాదేశ్ ప్రభుత్వం

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TG Crime : అన్నంలో మత్తు మందు కలిపి... వ్యాపారవేత్త ఇంట్లో భారీ చోరీ

హైదరాబాద్ కాచిగూడలో భారీ దోపిడీ జరిగింది. వృద్ధ దంపతులకు భోజనంలో మత్తుమందు కలిపి దాదాపు 2 కిలోల బంగారు నగలు, రూ.3కోట్ల నగదు, ఖరీదైన కారు ఎత్తుకెళ్లిన సంఘటన కాచిగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వెలుగులోకి వచ్చింది. ఇంట్లో పని మనుషులే ఈ దోపిడీకి పాల్పడ్డారు.

New Update
Massive theft

Massive theft

 TG Crime :  హైదరాబాద్ కాచిగూడలో భారీ దోపిడీ జరిగింది. వృద్ధ దంపతులకు భోజనంలో మత్తుమందు కలిపి దాదాపు 2 కిలోల బంగారు నగలు, రూ.3కోట్ల నగదు, ఖరీదైన కారు ఎత్తుకెళ్లిన సంఘటన కాచిగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వెలుగులోకి వచ్చింది. కాచిగూడ లింగంపల్లి అమ్మవారి దేవాలయం సమీపంలో ప్రముఖ పారిశ్రామికవేత్త హేమ్‌రాజ్‌ , అతడి భార్య మీనా దుగ్గర్‌ నివాసముంటున్నారు. ఇంట్లో పని మనుషులు వ్యాపారవేత్త హేమరాజు దంపతులకు రాత్రి భోజనంలో మత్తుమందు కలిపి పెట్టారు. అది తిన్న దంపతులిద్దరు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. దీంతో వారు నగలు, నగదు తీసుకుని పారిపోయారు.

ఇది కూడా చూడండి: Horoscope: ఈ రాశుల వారికి ఈరోజు అంతగా బాగోలేదు..జాగ్రత్తగా ఉంటే బెటర్‌!

కొద్ది రోజుల క్రితం వారు నేపాల్‌కు చెందిన దంపతులను ఇంట్లో పనికి పెట్టుకున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఇటీవల వారి కొడుకు, కోడలు విదేశీ యాత్రకు వెళ్లడంతో హేమ్‌రాజ్, అతడి భార్య మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఇదే అదనుగా భావించిన పనివారు ఆదివారం రాత్రి భోజనంలో మత్తు మందు కలిపారు. వారు మత్తులోకి వెళ్లగానే ఇంట్లోని బంగారు ఆభరణాలు, నగదుతో పాటు కారు తీసుకుని ఉడాయించారు. ప్రతి రోజూ వాకింగ్‌కు వెళ్లే  హేమరాజ్‌ సోమవారం వాకింగ్‌కు రాకపోవడంతో అతని స్నేహితుడు ఫోన్‌ చేయగా స్విచ్‌ ఆఫ్‌ వచ్చింది. 

Also read: Murder case: కొడుకు అక్రమ సంబంధానికి బలైన తండ్రి.. వాడి పెళ్లం ఫొటోలు వాట్సాప్ స్టేటస్‌

దీంతో అనుమానం వచ్చిన అతని స్నేహితుడు ఇంటికి వచ్చాడు. ఇంట్లో అపస్మారక స్థితిలో ఉన్న హేమరాజు దంపతులను అతను ఆసుపత్రిలో చేర్పించారు. అలాగే పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుటాహుటిన సంఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంటి నుంచి బంగారు ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లిన పని మనుషులు (నేపాలి దంపతులు) కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Also read: wife harassment: మరో భార్యా బాధితుడు బలి.. ‘నా అస్తికలను డ్రైనేజీలో కలపండి’

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు