AP: ఏపీలో భారీ వర్షాల నేపథ్యంలో.. విద్యుత్ శాఖ అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు! ఏపీలో విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమావేశమయ్యారు. ఏపీఈపీడీసీఎల్ అధికారులతో మంత్రి వర్చువల్‌గా సమీక్షించారు. అల్పపీడన ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నందున్న అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. By Bhavana 20 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి AP: ఏపీలో విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమావేశమయ్యారు. ఏపీఈపీడీసీఎల్ అధికారులతో మంత్రి వర్చువల్‌గా సమీక్షించారు. అల్పపీడన ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నందున్న అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. వర్ష ప్రభావిత జిల్లాల అధికారులతో మాట్లాడిన మంత్రి అక్కడి పరిస్థితులను గురించి తెలుసుకున్నారు. విద్యుత్ స్థంభాలు, చెట్లు నెలకొరిగిన ప్రాంతాల్లో సహాయక చర్యలు ప్రాంరంభించాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని తెలిపారు. లంక గ్రామాల ప్రజలపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి అన్నారు. వర్షాలు, వరదలతో ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి ఆదేశాలతో వరదలో చిక్కుకున్న ఏలూరు జిల్లా మాదేపల్లి గ్రామస్థులను సురక్షిత ప్రాంతానికి అధికారులు తరలించారు. Also read: 3 గంటల నుంచి స్థిరంగా వాయుగుండం..ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు! #rains #heavy-rains #minister #meeting #gottipati-ravi-kumar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి