IMD Rain Alert : ఈ రాష్ట్రాల్లో మెరుపులతో కూడిన భారీ వర్షం..అప్రమత్తంగా ఉండాలంటూ IMD హెచ్చరిక..!!

గతకొన్నాళ్లుగా దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాపాతం నమోదు అయ్యింది. ఈనేపథ్యంలో రానున్న రెండు రోజుల్లో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుందని ఐఏండీ తెలిపింది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్ , మహారాష్ట్ర తోపాటు తెలంగాణలోనూ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే రెండు మూడు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెల్లడించింది.

New Update
IMD Rain Alert : ఈ రాష్ట్రాల్లో మెరుపులతో కూడిన భారీ వర్షం..అప్రమత్తంగా ఉండాలంటూ IMD హెచ్చరిక..!!

ఈ ఏడాది హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానాలలో బీభత్సం సృష్టించిన వర్షాలు ఇప్పుడు మధ్య భారతదేశాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా మధ్యప్రదేశ్‌లో నర్మదా నది ఉప్పొంగుతోంది. గుజరాత్‌లోనూ సర్దార్ సరోవర్ నర్మదా డ్యామ్‌పై పలు గేట్లు తెరిచారు. నర్మదా, భరూచ్, వడోదరలోని పలు గ్రామాల్లో అలర్ట్ ప్రకటించారు. మరోవైపు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పలు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈసారి వర్షాల ప్రభావం మధ్యప్రదేశ్‌లో ఎక్కువగా కనిపిస్తోంది, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్ని శాఖలను అప్రమత్తంగా ఉండాలని, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.

ఇది కూడా చదవండి:  ప్రధాని మోదీని ఏయే దేశాలు అత్యన్నత గౌరవంతో సత్కరించాయో తెలుసా?

శనివారం ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఆదివారం కూడా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. వాతావరణ శాఖ ప్రకారం రానున్న రెండు మూడు రోజుల పాటు ఈ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్‌లో కూడా ఈరోజు రోజంతా వర్షాలు కురిసే సూచన ఉందని తెలిపింది. శనివారం మధ్యప్రదేశ్ లోని పలు జిల్లాల్లో 200 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. అనేక ప్రాంతాల్లో ఎన్‌డిఆర్‌ఎఫ్‌, ఎస్‌డిఆర్‌ఎఫ్‌ బృందాలను మోహరించడంతో ప్రజలు ఒక వీధి నుంచి మరో వీధికి వెళ్లాలంటే పడవలను ఉపయోగించాల్సి వస్తోంది.

ఇది కూడా చదవండి: యశోభూమి కన్వెన్షన్ సెంటర్‌ను ప్రారంభించనున్న మోదీ…IICC ప్రత్యేకత ఏంటి?

వర్షాల కారణంగా, మధ్యప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఖార్గోన్ జిల్లాలో వరదల ప్రభావం ఎక్కువా ఉంది. ప్రజలు ఇళ్లలో నుండి బయటకు రావడం కష్టంగా మారింది. మధ్యప్రదేశ్‌తో పాటు, ఉత్తరప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. రాబోయే కొద్ది రోజులుగా యుపిలోని పూర్వాంచల్‌లో కూడా వర్షం కురుస్తుంది. మధ్యప్రదేశ్‌తో పాటు మహారాష్ట్ర, గుజరాత్‌లో మేఘాలు కమ్ముకుంటున్నాయి. మహారాష్ట్రలోని జల్‌గావ్‌లోని హత్నూర్‌ డ్యామ్‌ 41 గేట్లు, గుజరాత్‌లోని సర్దార్‌ సరోవర్‌ డ్యామ్‌కు చెందిన పలు గేట్లను కూడా తెరిచారు. దీంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు నదీ తీరాలకు దూరంగా ఉండాలని సూచించారు.

ఇది కూడా చదవండి:  ప్రభుత్వ హాస్టల్‎లో ఫుడ్ పాయిజన్..30 మంది విద్యార్థినులకు అస్వస్థత..!!

అటు తెలంగాణలోనూ శనివారం పలుప్రాంతాల్లో వర్షం కురిసింది. హైదరాబాద్ లోనూ అక్కడక్కడ వర్షం పడింది. రానున్న రెండు రోజుల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు