Telangana : రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు..ఈ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌!

తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్‌,ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌,కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

New Update
Weather Alert: తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు..

Heavy Rains : తెలంగాణ (Telangana) లో రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలు జారీ చేసింది. సోమవారం హైదరాబాద్‌ సహా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌,కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఆ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించింది.

పెద్దపల్లి, సూర్యాపేట, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, ఆదిలాబాద్‌, జగిత్యాల, కరీంనగర్‌, జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. గంటలకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, ఈదురుగాలులు వీస్తాయని వాతావరణశాఖ తెలిపింది.

మంగళవారం కుమ్రంభీం ఆసిఫాబాద్‌ (Kumuram Bheem Asifabad), మంచిర్యాల జిల్లా (Mancherial District) ల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు , కుమ్రంభీం ఆసిఫాబాద్‌, జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. గురువారం మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.

Also Read: పాఠశాలలకు మరోసారి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Two rowdy sheeters : ఇద్దరు రౌడీషీటర్లపై నగర బహిష్కరణ వేటు

ప్రజల భద్రతకు విఘాతం కలిగిస్తూ సమాజానికి ప్రమాదకరమైన ఇద్దరు క్రిమినల్స్ పై రాచకొండ పోలీసు కమిషనరేట్ నగర బహిష్కరణ వేటు వేసింది. రాచకొండ కమిషనరేట్‌లో వారు కనిపిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని  పోలీసు కమిషనర్ సుధీర్ బాబు హెచ్చరించారు.

New Update
Two rowdy sheeters

Two rowdy sheeters

Two rowdy sheeters :   ప్రజల భద్రతకు విఘాతం కలిగిస్తూ సమాజానికి ప్రమాదకరమైన ఇద్దరు క్రిమినల్స్ పై రాచకొండ పోలీసు కమిషనరేట్ నగర బహిష్కరణ వేటు వేసింది. రాచకొండ కమిషనరేట్‌లో వారు కనిపిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని  పోలీసు కమిషనర్ సుధీర్ బాబు హెచ్చరించారు.

Also Read: ఏడుగురిని పొట్టనబెట్టుకున్న ఫేక్ డాక్టర్.. ఎన్నో గుండె ఆపరేషన్లు

పోలీసు కమిషనర్ సుధీర్ బాబు వెల్లడించిన వివరాల ప్రకారం.....రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధికి చెందిన రాజేష్ అలియాస్ మెంటల్ రాజేష్ పై 19 కేసులు, నాలుగు హత్య కేసులున్నాయి.  మరిన్ని కేసుల్లో అనుమానితుడిగా, నిందితుడిగా ఉన్నాడు. మరో క్రిమినల్ సురేందర్ అలియాస్ సూరి అలియాస్ మోహిన్ 21 కేసులతో పాటు, హత్య, హత్యాయత్నాల కేసులలో అనుమానితుడిగా, నిందితుడిగా నమోదయ్యాడు. ఇద్దరు రౌడీషీటర్లపై సెక్షన్ 261 సిటీ యాక్ట్ ప్రకారం నగర బహిష్కరణ  వేటు వేసినట్లు వివరించారు.

Also Read: America Layoffs: అమెరికా రెవెన్యూ సర్వీసులో 20 వేల ఉద్యోగాలు ఔట్‌!

Also Read:  America Trump:ధనవంతులు కావడానికి ఇదే గొప్ప సమయం: ట్రంప్!

 వీరు తీరు మార్చుకోక పోవడంతో పాటు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. వీరి చర్యలతో ప్రజలకు ఇబ్బందిగా మారడంతో ఈ ఇద్దరి పై ఆరు నెలల పాటు రాచకొండ పోలీసు కమిషనరేట్ నుంచి బహిష్కరిస్తూ సీపీ సెక్షన్ సిటీ యాక్ట్ -261 ప్రకారం శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఇద్దరు రానున్న ఆరు నెలల కాలంలో కమిషనరేట్ పరిధిలో కనిపించిన వెంటనే ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీపీ కోరారు. నగర బహిష్కరణ నిబంధనలను ఉల్లంఘించి కమిషనరేట్ పరిధిలో సంచరిస్తే కఠిన చర్యలు తప్పవని సీపీ సుధీర్ బాబు హెచ్చరించారు.

Also Read: America: హుతీలను ఎలా చంపామో తెలుసా...వీడియో విడుదల చేసిన అగ్రరాజ్యం!

Also Read: America-Ukrain: ఏడు రోజుల్లో దేశాన్ని విడిచి పొండి...!

Advertisment
Advertisment
Advertisment