Temperatures: నేడు , రేపు వడగాలులు వీచే అవకాశాలు... ప్రజలు బయటకు రావొద్దు!

తెలంగాణ లో ఈరోజు, రేపు వడగాలులు వీచే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఎండలు కూడా సాధారణం కంటే మూడు డిగ్రీలు అధికంగా నమోదు అవుతాయని అధికారులు హెచ్చరించారు. ఈ క్రమంలోనే ప్రజలెవరూ కూడా బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు.

New Update
Weather: దేశంలో కొన్ని రాష్ట్రాల్లో హీట్ వేవ్..ఐఎండీ హెచ్చరిక

Summer : తెలంగాణలో ఎండలు(Heat)  మండుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో పలు జిల్లాల్లో 43 డిగ్రీలు నమోదు అవుతున్నాయి. రోజురోజుకి విపరీతంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నల్గొండ జిల్లాలో 43. 5 , కనగల్‌లో 43.4 , మాడుగుపల్లిలో 43.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు అధికారులు తెలిపారు.

ఏప్రిల్‌ మొదలై ఇంకా వారం కూడా గడవక ముందే ... 43 డిగ్రీలు మండుతుంటే... రానున్న కాలంలో ఇంకా ఎలా ఉంటుందో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ(Telangana) లో ఈరోజు, రేపు వడగాలులు(Hail) వీచే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

ఎండలు కూడా సాధారణం కంటే మూడు డిగ్రీలు అధికంగా నమోదు అవుతాయని అధికారులు హెచ్చరించారు. ఈ క్రమంలోనే ప్రజలెవరూ కూడా బయటకు రావొద్దని అత్యవసరం అయితే తప్ప..అది కూడా సాయంత్రం 5 దాటిన తరువాతే రావాలని ..అప్పుడు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

ఆదివారం తరువాత ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశాలున్నట్లు అధికారులు వివరించారు.

Also read: వేసవిలో 24 గంటల్లో నీటిని ఎప్పుడూ తాగాలంటే!

Advertisment
Advertisment
తాజా కథనాలు