Health Tips: జామ ఆకులతో ఇక వద్దన్నా జుట్టు పెరుగుతుంది

చాలామంది జుట్టురాలే సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఎన్నో వేలు ఖర్చుచేసి సర్జరీలు సైతం చేయించుకున్నా ఫలితం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఆహారపు అలవాట్లతో పాటు, ఈ జామ ఆకుల్లో చాలా ఔషధ గుణాలతో పాటు పోషకాలు జుట్టును ఎక్కువగా పెరిగేలా చేస్తుంది.

New Update
Health Tips: జామ ఆకులతో ఇక వద్దన్నా జుట్టు పెరుగుతుంది

ప్రస్తుతకాలంలో చాలా మంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఎన్నో వేలు ఖర్చుచేసి సర్జరీలు సైతం చేయించుకున్నా ఫలితం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఆహారపు అలవాట్లతో పాటు వాతావరణ మార్పులు, పొల్యూషన్‌ కారణంగా జుట్టు రాలుతూ ఉంటుంది. వయసుతో సంబంధం లేకుండా చాలా మంది ఈ సమస్యతో బాధపడుతుంటారు. ఎన్నో రకాల హోం రెమెడీలను కూడా పాటిస్తుంటారు. మన త‌ల చ‌ర్మం లోప‌లి పొర‌ల్లోని కొల్లాజెన్ దెబ్బతినడం కారణంగా జుట్టు కుదుళ్లు బలహీనపడతాయి. దీని కారణంగా వెంట్రుకలు ఎక్కువగా రాలుతుంటాయి.

జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు

ఈ జుట్టు రాలే స‌మ‌స్యను తగ్గించుకోవాలని, తమ జుట్టును బలంగా, పొడవుగా పెంచుకోవాలని తాపత్రయపడుతుంటారు. చాలా రకాల ప్రయత్నాలతో పాటు ఖరీదైన షాంపూలు, నూనెలు కూడా వాడుతారు. కానీ తెలియని విషయం ఏంటంటే వీటిలో ఉండే కెమికల్స్‌ వల్ల జుట్టు ఇంకా ఎక్కువగా ఊడిపోతూ ఉంటుంది, ఫలితం కూడా అంతంతమాత్రమే అని చెప్పాలి. అయితే చిన్న చిట్కా ఉపయోగించడం వల్ల జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా దీన్ని తయారు చేయడం చాలా సులభం. కేవలం జామ ఆకులతో దీన్ని తయారు చేసుకోవచ్చు. మనం జామ పండ్లు మాత్రమే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అనుకుంటూ ఉంటాం. అంతేకాకుండా వీటిని పేదవాడి యాపిల్‌ అని కూడా పిలుస్తారు. అయితే ఈ జామ ఆకుల్లో చాలా ఔషధ గుణాలతో పాటు పోషకాలు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: ఇది ఒక్క స్పూన్‌ చాలు..వృద్ధాప్యం దరిచేరదు

మన జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి జామ ఆకులు ఎంతో దోహదం చేస్తాయి. జామ ఆకులలో ఎక్కువ శాతం సి-విటమిన్‌ ఉంటుంది. ఇది కిల్లాజెన్‌ అధికంగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. అంతేకాకుండా లైకోపిన్ అనే ర‌సాయ‌నం ఉండటం వల్ల మన జుట్టును ఎండ నుంచి కాపాడుతుంది. అధికంగా జుట్టు రాలుతున్నవారు మొదటగా జామ ఆకుల‌ను శుభ్రంగా క‌డిగి పేస్ట్‌ చేసుకోవాలి. ఆ పదార్థాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివరి వరకు బాగా పట్టించాలి. ఒక గంట సేపు అలాగే ఉంచిన తర్వాత కుంకుడు కాయలు వాడి తలస్నానం చేసుకోవాలి. వారానికి రెండుసార్లు ఇలా జుట్టుకు పట్టించడం వల్ల జుట్టు రాలకుండా ఉంటుంది. అంతేకాకుండా జామ ఆకుల కషాయంతోనూ జుట్టును సంరక్షించుకోవచ్చు. నీటిలో శుభ్రంగా క‌డిగిన ఏడు జామ ఆకులను నీటిలో వేసి బాగా మరిగించి. చల్లారిన తర్వాత వడకట్టుకోవాలి. ఈ కషాయాన్ని జుట్టు కుదుళ్లకు బాగా పట్టించి మర్దనా చేసుకోవాలి. గంట తర్వాత కుంకుడుకాయలతో తలస్నానం చేస్తే జుట్టు రాలడం బాగా తగ్గుతుంది. అంతేకాకుండా జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు