Health Tips: వారానికి ఒకసారి ఈ పండు తినండి.. అందంతోపాటు ఆరోగ్యాన్నీ పొందండి..

డ్రాగన్ ఫ్రూట్.. ప్రస్తుతం పండ్ల మార్కెట్ లో ఎక్కువగా కనిపిస్తున్న పండు. కొంతకాలం క్రితం వరకూ ఎవరికీ పెద్దగా తెలియని ఈ పండును.. ఇప్పుడు జనాలు ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. కారణం.. ఇందులో ఉండే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు. డ్రాగన్ ఫ్రూట్ తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని తినడం వలన అందంతో పాటు.. ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. డ్రాగన్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాల కోసం పైన హెడ్డింగ్ క్లిక్ చేయండి..

New Update
Health Tips: వారానికి ఒకసారి ఈ పండు తినండి.. అందంతోపాటు ఆరోగ్యాన్నీ పొందండి..

Dragon Fruit Benefits: పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆరోగ్యాన్ని కాపాడటమే కాదు.. అందాన్ని కూడా పెంచుతాయి. శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడానికి, ఆరోగ్యంగా ఉండటానికి సీజనల్‌ వారీగా ఫ్రూట్స్(Fruits) తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి ఫ్రూట్స్‌లో డ్రాగన్ ఫ్రూట్(Dragon Fruit) ఒకటి. డ్రాగన్ ఫ్రూట్ తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను అందిస్తుంది. ఇంతకు ముందు డ్రాగన్ ఫ్రూట్ అంటే పెద్దగా తెలియదు. కానీ, ఇప్పుడు.. ఎక్కడపడితే అక్కడ మార్కెట్‌లో విరివిగా లభిస్తోంది. డ్రాగన్ ఫ్రూట్‌ను ఇప్పుడు మన దేశంలో విరివిగా పండిస్తున్నారు రైతులు. దీని ప్రయోజనాల కారణంగా.. ధర కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఇది తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ పండు కొన్ని వ్యాధులను కూడా నయం చేస్తుంది. వారానికి ఒకసారైనా ఈ పండును తింటే ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. డ్రాగన్ ఫ్రూట్ తినడం వలన కలిగే ప్రయోజనాలేంటో ఓసారి చూద్దాం..

చర్మ సంరక్షణ..

డ్రాగన్ ఫ్రూట్ తినడం వలన చర్మ సంబంధిత సమస్యలన్నీ తగ్గిపోతాయి. చర్మం కాంతివంతంగా ఉంటుంది. మచ్చలు తొలగిపోతాయి. ముఖానికి సహజ అందాన్ని ఇస్తుంది.

గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది..

డ్రాగన్ ఫ్రూట్ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు ఈ పండు తింటే ప్రయోజనకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

రోగనిరోధక శక్తి పెరుగుతుంది..

డ్రాగన్ ఫ్రూట్ తినడం వలన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధుల బారి నుంచి రక్షిస్తుంది. అంతేకాదు.. రక్తంలో షుగర్ లెవల్స్‌ని నియంత్రణలో ఉంచుతుంది.

జుట్టు దృఢంగా మారుతుంది..

డ్రాగన్ ఫ్రూట్ తినడం వలన జుట్టు సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. వారానికి రెండుసార్లు ఈ పండు తినడం వలన జుట్టు ఆరోగ్యంగా, దృఢంగా, మృదువుగా మారుతుంది. జుట్టు రాలిపోవడాన్ని కూడా తగ్గిస్తుంది. అంతేకాదు.. అల్జీమర్ బాధితులకు కూడా ఈ డ్రాగన్ ఫ్రూట్ ఎంతో మేలు చేస్తుంది.

ఎములకను బలంగా మారుస్తుంది..

డ్రాగన్ ఫ్రూట్‌లో కాల్షియం మూలకం అధికంగా ఉంటుంది. దీనిని తినడం వలన ఎముకలు దృఢంగా మారుతాయి. శరీరానికి కొత్త ఉత్సాహాన్ని అందిస్తుంది.

క్యాన్సర్‌ని నియంత్రిస్తుంది..

డ్రాగన్ ఫ్రూట్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది షుగర్‌ను నియంత్రించడంతో పాటు.. క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా అడ్డుకుంటుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.

Also Read:

Batukamma:గౌరమ్మను తల్లి గంగమ్మ ఒడిలో వదిలేసే సద్దుల బతుకమ్మ

Women Health: మహిళలూ బీ అలర్ట్.. ఈ 7 లక్షణాలు అస్సలు విస్మరించొద్దు..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

VIRAL VIDEO: ఈ ఆడోళ్లు మహా డేంజర్.. జుట్టు పట్టుకుని ఎలా కొడుతుందో చూశారా?

నోయిడాలోని సెక్టార్ 168లో ఉన్న ఓ సొసైటీలో ఇద్దరు మహిళల మధ్య వాట్సాప్ కాల్ విషయంలో వివాదం చెలరేగింది. అది కాస్త జుట్లు పట్టుకునే వరకు దారి తీసింది. ఒక మహిళ వేరొక మహిళ తల్లిని తిట్టిందని జుట్టు పట్టుకుని కొట్టింది. అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

New Update
noida woman grabs another by hair pins her down viral video

noida woman grabs another by hair pins her down viral video Photograph: (noida woman grabs another by hair pins her down viral video)

నోయిడాలోని ఓ సొసైటీలో ఇద్దరు మహిళల మధ్య జరిగిన వ్యక్తిగత వివాదం తీవ్రతరమైంది. దాని ఫలితం దారుణమైన దాడికి దారితీసింది. ఓ మహిళ వేరొక మహిళ జుట్టు పట్టుకుని రప్పా రప్పా కొట్టింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

సాధారణంగా మహిళలు గొడవ పడితే.. అది ఎంతవరకు అయినా దారి తీస్తుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. అది నడి రోడ్డు అని కూడా చూడరు. అయ్యో అందరూ ఉన్నారులే అని సైలెంట్‌గా ఉండరు. ఎవరుంటే మాకేంటి అన్నట్లు జుట్లు పట్టుకుని బాదుకుంటారు. తాజాగా అలాంటిదే నొయిడాలో జరిగింది. 

ఏం జరిగిందంటే?

సెక్టార్ 168లో ఉన్న నోయిడా సొసైటీలో ఇద్దరు మహిళల మధ్య వాట్సాప్ కాల్ విషయంలో వివాదం చెలరేగింది. ఇద్దరు మహిళలు ఒకరినొకరు ఘోరంగా.. అతి దారుణంగా తిట్టుకున్నారు. అది కాస్త తిట్లతో ఆగకుండా కొట్లాట వరకు వెళ్లింది. ఆ ఇద్దరు మహిళలు ఒకే కాంప్లెక్స్‌లో ఉంటున్నారు. వారిద్దరికీ మంచి పరిచయం ఉంది. ఒకరోజు వీరిద్దరిలో ఒక మహిళ వేరొక మహిళ తల్లిపై అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడింది. అలా మాటల యుద్ధం సాగిన తర్వాత చల్లబడ్డారు. 

కానీ ఒకే దగ్గర ఉండటంతో.. మరుసటి రోజు ఒకరికొకరు ఎదురుపడ్డారు. దీంతో వారి వివాదం మరింత దారుణంగా మారింది. ఒక మహిళ మరొక మహిళ జుట్టు పట్టుకుని వదలకుండా కొట్టింది. పక్కనే ఉన్నవారు విడిపించాలని చూసినా ఆమె జుట్టు వదల్లేదు. అందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.

(viral-news | viral-video | latest-telugu-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment