Telangana: ప్రపంచ రక్తదాన దినోత్సవం.. మంత్రి దామోదర్ రాజనర్సింహ కీలక ఆదేశాలు

తెలంగాణలో జూన్ 14న ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని.. ఆరోజున అన్ని జిల్లా కేంద్రాల్లో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులకు ఆదేశించారు.

New Update
Telangana: ప్రపంచ రక్తదాన దినోత్సవం.. మంత్రి దామోదర్ రాజనర్సింహ కీలక ఆదేశాలు

ప్రభుత్వ ఆధ్వర్యంలో మెరుగైన పనితీరు కలిగిన 14 బ్లడ్ బ్యాంకులను బలోపేతం చేయాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులకు ఆదేశించారు. ఈ మేరకు సచివాలయంలోని తన కార్యాలయంలో రాష్ట్రంలో బ్లడ్ బ్యాంకుల పనితీరు, నిర్వహణపై, బలోపేతంపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. వీటికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. జూన్ 14న ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని.. ఆరోజున అన్ని జిల్లా కేంద్రాల్లో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

Also Read: లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన ఇన్‌స్పెక్టర్

రాష్ట్రంలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్త నిల్వలను పెంచుకోవాలని.. బ్లడ్‌ బ్యాంకులను మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వ కార్యదర్శి శ్రీమతి క్రిస్టినా చోంగ్తూ, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ R V కర్ణన్, ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ హైమావతి తదితరులు పాల్గొన్నారు.

Also Read: తెలంగాణలో త్వరలో మహిళా శక్తి క్యాంటీన్లు: సీఎస్ శాంతికుమారి

Advertisment
Advertisment
తాజా కథనాలు