ప్రైవేటు ఉద్యోగాల్లో రిజర్వేషన్ చెల్లదు.. హర్యానా హైకోర్టు సంచనల తీర్పు..

ప్రైవేటు ఉద్యోగాల్లో స్థానికులకే 75 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని హర్యాణా ప్రభుత్వం చట్టం తీసుకురాగా.. దీనిపై విచారణ జరిపిన పంజాబ్-హర్యానా కోర్టు ఈ చట్టాన్ని కొట్టివేసింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని చెబుతూ తీర్పునిచ్చింది.

New Update
TS News: ఒకే కుటుంబంలో 9 మందికి జీవిత ఖైదు.. సంగారెడ్డి కోర్డు సంచలన తీర్పు!

ప్రైవేట్‌ జాబ్స్‌లో 75 శాతం స్థానికులకు రిజర్వేషన్ కల్పించే విషయంలో హర్యానా సర్కార్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 2020లో ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన చట్టా్న్ని పంజాబ్‌-హర్యానా హైకోర్టు కొట్టివేసింది. ప్రైవేటు ఉద్యోగాలకు సంబంధించింది ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టం రాజ్యంగ విరుద్ధమని చెబుతూ తీర్పునిచ్చింది. రాజ్యంగంలోని ఆర్టికల్‌ 14, ఆర్టికల్‌ 19లను ఈ చట్టం ఉల్లంఘించినట్లు పేర్కొంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. 2020లో మనోహర్‌ లాల్ ఖట్టర్ సర్కార్.. రాష్ట్రంలో ప్రైవేటు రంగం ఉద్యోగాల్లో స్థానికులకే 75 శాతం రిజర్వేషన్ ఇవ్వాలంటూ ఓ చట్టాన్ని తీసుకొచ్చింది. నెలకు రూ.30 వేల కంటే తక్కువగా వచ్చే ఉద్యోగాల్లో స్థానికులకు ఈ కోటా కల్పించే విధంగా దీన్ని రూపొందించారు. ఆ తర్వాత ఈ చట్టాన్ని ప్రైవైటు సంస్థలు, పారిశ్రామిక వేత్తల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది.

Also read: సంతానం లేని జంటకు మైనార్ బాలికల అండాలు అమ్ముతున్న ముఠా.. నలుగురు అరెస్టు

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పారిశ్రామిక రంగానికి నష్టం కలిగించడంతో సహా.. పెట్టుబడులపై కూడా దీని ప్రభావం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే రాష్ట్రంలోకి భారీగా వలస వచ్చిన వారిని స్థానికంగా ప్రైవేటు ఉద్యోగాల్లోకి రాకుండా ఆపేందుకు ఈ చట్టం తీసుకొచ్చామని ప్రభుత్వం అప్పట్లో చెప్పింది. కానీ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ ప్రైవేటు సంస్థలు హైకోర్టులో పిటీషన్లు దాఖలు చేశాయి. దీంతో స్థానిక రిజర్వేషన్లపై హర్యానా ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం చెల్లుబాటు కాదని.. గతంలోనే పంజాబ్-హర్యానా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దీన్ని సవాలు చేస్తూ.. హర్యాణా సర్కార్‌ సుప్రీంకోర్టుకు వెళ్లింది. దీంతో సుప్రీం ఈ ఉత్తర్వులపై స్టే విధించింది. దీనిపై పూర్తిగా విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు సూచనలు చేసింది. అయితే తాజాగా దీనిపై పూర్తిగా విచారణ జరిపిన పంజాబ్-హర్యానా హైకోర్టు ఈ చట్టాన్ని రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. ఇదిలాఉండగా.. రాష్ట్రంలో కీలకంగా జాబ్‌ల ఓట్ల కోసమే ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్లు ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు