Neem leaves: ఖాళీ కడుపుతో ఈ ఆకులను ఎప్పుడైనా తిన్నారా.? అద్భుతాలు తెలిస్తే వదలరు

ఉగాది పండుగ సమయంలో తప్ప సంవత్సరంలో ఒక్కసారి కూడా వేప చెట్టు వైపు కన్నెత్తి చూడరు ఇప్పటికాలం మనుషులు. గ్రామాలలో ఎక్కడో అమ్మవారి జాతరలకు వేపను అప్పుడప్పుడు వాడుతారే తప్ప నేరుగా వేపను ఉపయోగించేవారు తక్కువేనని చెప్పాలి. 

New Update
Neem leaves: ఖాళీ కడుపుతో ఈ ఆకులను ఎప్పుడైనా తిన్నారా.? అద్భుతాలు తెలిస్తే వదలరు

వేపాకు పేరు వినగానే అబ్బా చేదు అంటారు. ఆయుర్వేదంలో వేపను సర్వరోగ నివారణిగా చెబుతారు. పుర్వం తాతలు, తండ్రుల కాలంలో వేపాకు విశిష్టత ఉంది. వేపాకుల్లో యాంటి హైపర్‌ గ్లైసెమిక్‌, అల్సర్‌, ఇన్‌ఫ్లమేటరీ, మలేరియల్‌, బ్యాక్టీరియల్‌, ఆక్సిడెంట్‌, ఫంగల్‌, వైరల్‌, కార్సినోజెనిక్‌, మ్యుటాజెనిక్‌ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. వేపలో విటమిన్‌-ఎ, సీ, లినోలియిక్‌, కెరొటినాయిడ్స్‌, ఒలియిక్‌ లాంటి సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. వేపాకులను రోజూ ఖాళీ కడుపుతో తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వాటిగురించి ఇప్పుడు కొన్ని విషయాలను తెలుసుకుదాం.
వ్యాధికారకాల నుంచి రక్షణ
ఈ రోజుల్లో మనం అనుసరించే జీవనశైలి, తినే ఆహారం, మద్యపానం వంటి అలవాట్లతో చాలామంది పేగు ఇన్ఫెక్షన్ల సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఖాళీ కడుపుతో వేపాకును తింటే ఈ సమస్య నుంచి రక్షణ పొందవచ్చు. వేపకులు బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ను కంట్రోల్‌లో ఉంచడంతో బెస్ట్‌ అనే చెప్పాలి. నిపుణులు అధ్యాయనం ప్రకారం ప్రతిరోజు ఉదయం లేవగానే వేపాకులను తిన్నా, వేప ఆకులతో కషాయం తాగినా రక్తంలో షుగర్ స్థాయిలు తగ్గుతాయని చెబుతున్నారు. అంతేకాకుండా గట్‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. క్రమ పద్ధతిలో పరగడుపున వేపాకులు తింటే.. పేగు వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచి అలిమెంటరీ కెనాల్‌ను వ్యాధికారకాల నుంచి రక్షిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: జుట్టు ఒత్తుగా పెరగాలంటే ఈ నూనెలతో హెడ్‌ మసాజ్‌ ట్రై చేయండి
అంతేకాకుండా లివర్‌ను ఆరోగ్యంగా ఉండాలంటే ఖాళీ కడుపుతో వేప ఆకులు తింటే మంచిది. వేప ఆకులలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఒత్తిడిని తగ్గిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడి వలన లివర్‌ కణాలు దెబ్బతింటాయి. అందుకే వేప ఆకులు తింటే రక్తాన్ని శుద్ధిచేసి.. రక్తంలోని మలినాలను తొలగించి లివర్‌ పనితీరును మెరుగుపరుస్తుందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆహార అలవాట్లు, ఒత్తిడి వలన మలబద్ధకం సమస్య రోజురోజుకూ పెరుగుతోంది . మలబద్ధకంతో ఇబ్బంది పడేవారికి వేపాకు మంచి ఔషధంలా పనిచేస్తోంది. వేప ఆకుల్లో ఉండే ఫైబర్‌ ప్రేగుల కదలికలను మెరుగుపరిచి కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది. మీకు మలబద్ధకం సమస్య ఉండే రోజూ పరగడుపున వేపాకులు తింటే మంచిది. మరి అతిగా దుష్ప్రభావాలు ఉంటాయి కాబట్టి రోజుకు 5 నుంచి 6 ఆకులు మాత్రమే తినాలని నిపుణులు చెబుతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు