Fire Accident : కదులుతున్న బస్సులో మంటలు..8 మంది సజీవ దహనం..24 మందికి తీవ్ర గాయాలు!

హర్యానాలోని కుండ్లి మనేసర్ పాల్వాల్ ఎక్స్‌ప్రెస్‌వేపై అర్థరాత్రి భక్తులతో నిండిన బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది సజీవ దహనమవ్వగా, 24 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

New Update
Fire Accident : కదులుతున్న బస్సులో మంటలు..8 మంది సజీవ దహనం..24 మందికి తీవ్ర గాయాలు!

Haryana : హర్యానాలోని నుహ్ జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. కుండ్లి మనేసర్ పాల్వాల్ ఎక్స్‌ప్రెస్‌వేపై అర్థరాత్రి భక్తులతో(Devotees) నిండిన బస్సులో ఒక్కసారిగా మంటలు(Fire) చెలరేగినట్లు సమాచారం. మంటలు చెలరేగడంతో కొద్దిసేపటికే బస్సు మొత్తం దగ్ధమైంది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది సజీవ దహనమవ్వగా, 24 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా కాలిపోయారు. వారందరిని స్థానికులు, అధికారులు చికిత్స నిమిత్తం వివిధ ఆసుపత్రుల్లో చేర్చారు.

ప్రమాదంలో బాధితులుగా ఉన్నవారంతా చండీగఢ్(Chandigarh), పంజాబ్(Punjab) వాసులుగా చెబుతున్నారు. మధుర, బృందావనం సందర్శించిన తర్వాత  తిరిగి వస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 60 మంది ఉన్నారు. వారిలో పిల్లలు, మహిళలు కూడా ఉన్నారు. నుహ్ జిల్లా తవాదు పట్టణం సమీపంలోని కుండ్లి మనేసర్ పాల్వాల్ ఎక్స్‌ప్రెస్‌వే వద్దకు బస్సు రాగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది సజీవ దహనమయ్యారని అధికారులు గుర్తించారు.

ప్రయాణికులంతా ఓ టూరిస్ట్ బస్సు(Tourist Bus) ను అద్దెకు తీసుకుని బనారస్‌, మధుర, బృందావవన్‌ సందర్శనకు బయల్దేరరని..ఆ సమయంలో బస్సులో 60 మంది ఉన్నారని ప్రమాదం నుంచి బయటపడిన ఓ ప్రయాణికురాలు తెలిపారు. అర్థరాత్రి 1.30 గంటల ప్రాంతంలో కదులుతున్న బస్సులో మంటలను గుర్తించినట్లు పక్కనే పొలాల్లో ఉన్న వారు తెలిపారు.

బస్సు వెనుక నుంచి ఒక్కసారిగా పెద్దఎత్తున మంటలు చెలరేగినట్లు గుర్తించారు. గ్రామస్తులు పెద్దఎత్తున బస్సు డ్రైవర్‌ను బస్సు ఆపాలని కోరగా, బస్సు డ్రైవర్ పట్టించుకోలేదు. అనంతరం ఓ యువకుడు బైక్‌పై బస్సును వెంబడించి బైక్‌ను బస్సు ముందు ఉంచి బస్సును ఆపాడు.

ఇంతలో గ్రామస్తులు పోలీసులకు, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపు చేశాయి, కానీ అప్పటికి చాలా ఆలస్యం అయింది. అప్పటికే బస్సు పూర్తిగా మంటల్లో చిక్కుకుంది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 8 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. 24 మంది తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్స్‌, ఇతర వాహనాల సాయంతో మంటల్లో కాలిపోయిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసు సూపరింటెండెంట్ నరేంద్ర బిజారానియా తన బృందంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందినట్లు ఎస్పీ నరేంద్ర బిజారానియా ధృవీకరించారు. దాదాపు రెండు డజన్ల మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. అందరినీ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన వారిని ఇంకా గుర్తించలేదని అధికారులు వివరించారు.

Also read: మే 20 న తెలంగాణ టెట్‌…పరీక్ష నిబంధనలు ఎలా ఉన్నాయంటే!

Advertisment
Advertisment
తాజా కథనాలు