Movies : తెలుగు ఇండస్ట్రీలో మరో వివాదం.. హరీష్ శంకర్, ఛోటా కె నాయుడు మధ్య గొడవ

తెలుగు సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ వర్సెస్ కెెమెరా పర్శన్ గొడవ నడుస్తోంది. ఎప్పుడో పదేళ్ళ కిందట మొదలైన వివాదాన్ని ఇద్దరూ తవ్వుకుంటున్నారు. డైరెక్టర్ హరీష్ శంకర్, ఛోటా కే నాయుడు మధ్య ప్రస్తుతం మాటల యుద్ధం నడుస్తోంది.

New Update
Movies : తెలుగు ఇండస్ట్రీలో మరో వివాదం.. హరీష్ శంకర్, ఛోటా కె నాయుడు మధ్య గొడవ

War : డైరెక్టర్ హరీష్ శంకర్(Harish Shankar) కెమెరా మ్యాన్ ఛోటా కె నాయుడు(Chota K Naidu) కి వార్నింగ్ ఇస్తూ లేఖ రాశారు. పదేళ్ళ కిందట తీసిని ఆరమయ్యా వస్తాయయ్యి సినిమా దగ్గర నుంచి ఇద్దరి మధ్యా వివాదం మొదలైంది. అయితే ఆ సినిమా గురించి తాను అప్పుడే వదిలేసినా ఛోటా కె నాయుడు వదిలేయడం లేదని హరీష్ శంకర్ అంటున్నారు. ఇప్పటికీ తన మీద అనవసరంగా మాటలు వదులుతున్నారని చెబుతున్నారు. ఈ పదేళ్ళల్లో ఛోటా కె నాయుడు 10 ఇంటర్వ్యూలు ఇస్తే తాను 100కు పైగా ఇచ్చి ఉంటానని.. అయినా తానెప్పుడూ అతని గురించి తప్పుగా మాట్లాడలేదని చెప్పుకొచ్చారు.

మీరంటే గౌరవం ఉంది..

ఛోటా కె నాయుడు అన్నా, ఆయన కెమెరా వర్క్ అన్నా తనకు ఎనలేని గౌరవం ఉందని చెబుతున్నారు హరీష్ శంకర్. అలాంటిది ఆయన అవసరం ఉన్నా లేకపోయినా తన గురించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాంకర్ అడగకపోయినా కూడా ఛోటా కే నాయుడే తన ప్రస్తావన తీసుకువస్తున్నారని మండిపడ్డారు. రామయ్యా వస్తావయ్యే సినిమా అప్పుడే నాయుడుని తీసేయాలని చర్చ జరిగింది. కానీ దిల్ రాజు(Dil Raju) చెప్పాడనో, గబ్బర్ సింగ్ తర్వాత తనకు పొగరు ఎక్కువైందనో మిమ్మల్ని తీసేయలేదని గుర్తు చేశారు. ఏ రోజూ ఆయన మీద నింద వేయలేదని... అది తన వ్యక్తిత్వం కాదని.. అని చెప్పుకొచ్చాడు హరీష్ శంకర్. ఇప్పుడు కూడా ఈ గొడవను ఇకకడితో వదిలేస్తే మంచిదని అంటున్నారు హరీష్ శంకర్. కాదు కూడదు అని కెలుక్కుంటే ఏ రోజైనా, ఏ ప్లేస్ అయినా గొడవకు తాను రెడీ అని చెప్పారు.

Also Read:Warning: మహేష్‌బాబు అడ్వర్టైజ్ చేస్తున్న మసాలాలు బ్యాన్..కాన్సర్ కారకాలే కారణం

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Mass Jathara Song: 'చూపుల్తో గుచ్చి గుచ్చి’ మాస్ జాతర ప్రోమో సాంగ్ అదిరిపోయిందిగా..!

మాస్ మహారాజ్ రవితేజ "మాస్ జాతర" మూవీ నుండి ‘తు మేరా లవర్’ పాట టీజర్‌ రిలీజ్ చేసారు మేకర్స్. ఇందులో ‘చూపుల్తో గుచ్చి గుచ్చి’ పాట ను మళ్ళీ రీ క్రియేట్ చేసారు. ఈ ఎనర్జిటిక్ సాంగ్‌ను ఏప్రిల్ 14న పూర్తిగా రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

New Update
Mass Jathara Song

Mass Jathara Song

మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) తన 75వ చిత్రంగా "మాస్ జాతర"తో మరోసారి తెరపై సందడి చేయడానికి రెడీ అవుతున్నారు. శ్రీలీల ఈ మూవీలో కథానాయికగా నటిస్తుండగా, ఈ చిత్రానికి భాను భోగవరపు దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

Chiranjeevi: డ్యాన్స్ చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయిన చిరంజీవి..!

‘చూపుల్తో గుచ్చి గుచ్చి’ రీ క్రియేట్..

ఇటీవల రిలీజ్ చేసిన ‘తు మేరా లవర్’ పాట టీజర్‌ మాస్ ఆడియన్స్ లో ఫుల్ జోష్ నింపింది. ఈ పాటలో ‘ఇడియట్’ సినిమాలోని పాపులర్ బీట్ ‘చూపుల్తో గుచ్చి గుచ్చి’ను మళ్ళీ రీ క్రియేట్ చేసారు. అంతేకాదు, అప్పట్లో రవితేజ వేసిన ఐకానిక్ స్టెప్పులను కూడా రీ-క్రియేట్ చేశారు. ఈ మాస్ మూమెంట్స్ అభిమానులకు కిక్ ఇస్తున్నాయి.

Also Read: మహేష్ హీరోయిన్ పై కన్నేసిన బన్నీ..!

ఈ ఎనర్జిటిక్ సాంగ్‌ను ఏప్రిల్ 14న పూర్తిగా రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. శ్రీలీలతో కలిసి రవితేజ చేసే డ్యాన్స్ ఈసారి ఎలాంటి మాస్ హంగామా చేస్తుందో చూడాల్సిందే!

Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!

Also Read: 'మంగపతి' గెటప్‌లో శివాజీ స్పెషల్ వీడియో వైరల్

 

Mass Jathara Song | Hero Ravi Teja | actress-sreeleela | 2025 Tollywood movies | latest tollywood updates | telugu-cinema-news | telugu-film-news | latest-telugu-news | today-news-in-telugu | telugu-news

Advertisment
Advertisment
Advertisment