/rtv/media/media_files/2025/04/24/USQYVhPGVglf9aL7JSs1.jpg)
Shimla Agreement
కాశ్మీర్ లో ఉగ్రదాడికి భారత్ రగిలిపోతోంది. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన టెర్రరిస్టులకు, పాకిస్తాన్ కు బుద్ధి చెప్పాలని గట్టిగా డిసైడ్ అయింది. ఇందులో భాగంగా సర్జికల్ స్ట్రైక్ కంటే ఎక్కువ ఎఫెక్ట్ చూపే ఐదు కీలక నిర్ణయాలను తీసుకుంది. పాకిస్తాన్ ను అన్ని విధాలా దిగ్భంధనం చేసింది. దీంతో ఏం చేయాలో తెలియక పాకిస్తాన్ భారత్ దారిలోనే నడిచింది. వాళ్ళు కూడా దౌత్యపరమైన నిర్ణయాలను తీసుకున్నారు. అందులో ఒకటి సిమ్లా ఒప్పందం రద్దు. అసలు ఈ సిమ్లా ఒప్పందం ఏమిటి? దీనిలోని నిబంధనలు ఏమిటి? దీని రద్దు వల్ల భారత్, పాక్ సంబంధాలపై ఎలాంటి ప్రభావం పడుతుంది? ఈ నిర్ణయంతో ఇరు దేవాల మధ్యా యుద్ధం కచ్చితంగా జరుగుతుందా..
1972లో కుదుర్చుకున్న ఒప్పందం...
1972 జూలై 2న భారత్, పాకిస్థాన్ మధ్య సిమ్లాలో కుదిరిన చారిత్రక ఒప్పందం ఇది. 1971లో ఇండియా-పాక్ మధ్య యుద్ధం జరిగింది. దాని తరువాత రెండు దేశాల మధ్యనా మామూలు వాతావరణం తీసుకువచ్చేలా సిమ్లా ఒప్పందాన్ని చేసుకున్నారు. దీనిపై అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ, పాకిస్థాన్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం రెండు దేశాల మధ్య ఉన్న అన్ని వివాదాలను, సమస్యలను శాంతియుత మార్గాల ద్వారా.. ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి అంగీకరించాయి. మూడో దేశం లేదా పక్షం ప్రమేయం లేకుండా సమస్యలను పరిష్కరించుకోవాలనేది భారతదేశం ముఖ్య ఉద్దేశం. అంతేకాదు యుద్ధం టైమ్ లో భారత్, పాక్ ఆక్రమించుకున్న ప్రదేశాల నుంచి తమ సైనిక బలగాలను వెనక్కు రప్పించడం కూడా ఇందులో ఉంది. అలాగే 1971 యుద్ధం తర్వాత ఏర్పడిన ఎల్వోసీ సరిహద్దు రేఖను ఇరు దేశాలు గౌరవించాలని, ఎవరూ దీన్ని దాటకూడదని అనుకున్నారు. సిమ్లా ఒప్పందంలో ఇది అన్నింటికంటే ముఖ్యమైనది.
ఇప్పుడు దీని రద్దుతో పర్యవసానాలు..
సిమ్లా ఒప్పందం రద్దుతో అతి ముఖ్యమైన ఎల్వోసీ సరిహద్దు రేఖకు కట్టుబడి ఉండడం ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారుతుంది. ఇన్నాళ్ళు దీనిని స్ట్రిక్ట్ గా అమలు చేశారు కాబట్టే ఇరు దేశాల్లో శాంతి నెలకొంది. ఇప్పుడు కనుక ఇది లేకపోతే విచ్చలవిడిగా ఎవరికి వారు బార్డర్ ను దాటేయొచ్చు. ఇది సైనిక సంఘర్షణలకు దారి తీస్తుంది. అంతకంటే ముఖ్యంగా యుద్ధం సంభవిస్తుంది. ఇవన్నీ తెలిసే పాకిస్తాన్ ప్రభుత్వం సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసుకుంది అంటే భారత్ ను కచ్చితంగా యుద్ధానికి ఆహ్వానిస్తున్నట్టే అని చెబుతున్నారు. దాంతో పాటూ కశ్మీర్ లేదా ఇతర సమస్యల పరిష్కారం కోసం పాకిస్థాన్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వాన్ని కోరే అవకాశం ఉంటుంది. అయితే ఇందుకు భారత్ ఒప్పుకోవాలి. మన దేశం కనుక అంతర్జాతీయ మధ్యవర్తిత్వాన్ని ఒప్పుకోకపోతే ఎవరూ ఏం చేయలేరు. కానీ యుద్ధం, చొరబాట్ల విషయంలో మాత్రం ఇండియా చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే.
today-latest-news-in-telugu | india | pakistan | shimla | agreement
Telangana: ఎంపీగా కేసీఆర్ పోటీ? హరీష్ రావు ఇంట్రస్టింగ్ కామెంట్స్..!
పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టామని బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ప్రిపరేషన్ మొదలుపెట్టామన్నారు. ఎంపీగా కేసీఆర్ పోటీ చేయడంపై ఇంకా క్లారిటీ రాలేదన్నారు. ఢిల్లీ పెద్దల పోటీపై స్పష్టత వచ్చాకే తమ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు.
Harish Rao: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన బీఆర్ఎస్ పార్టీ.. లోక్‌సభ ఎన్నికలపై గురి పెట్టింది. పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించేలా ప్లాన్స్ వేస్తోంది. ఈ క్రమంలోనే ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కీలక కామెంట్స్ చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ప్రిపరేషన్ మొదలుపెట్టామన్నారు. ఆదివారం బీఆర్ఎస్‌ఎల్పీ ఆఫీసులో మీడియాతో చిట్‌చాట్‌లో పాల్గొన్నారు హరీష్ రావు. ఈ సందర్భంగా ఎంపీగా కేసీఆర్ పోటీ చేయడంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో కేసీఆర్ పోటీ చేసే అంశంపై ఇంకా క్లారిటీ రాలేదన్నారు హరీష్ రావు. ఢిల్లీ పెద్దల పోటీపై స్పష్టత వచ్చాకే తమ అభ్యర్థులను ప్రకటన ఉంటుందన్నారు.
ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు హరీష్ రావు. మార్చి 17వ తేదీ నాటికి కాంగ్రెస్ ప్రభుత్వానికి 100 రోజులు అవుతాయన్నారు. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ రాక ముందే పథకాలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. ఇక ప్రజాపాలన దరఖాస్తులపైనా విమర్శలు గుప్పించారు. ఇదంతా డ్రామా అని కొట్టిపారేశారు. గైడ్‌లైన్స్ ఇవ్వకుండానే అప్లికేషన్లు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఇక అప్పులపై మంత్రులు చేస్తున్న ఆరోపణలను తోసిపుచ్చారు హరీష్ రావు. అప్పుల పేరుతో పథకాల దాటవేత, ఎత్తివేత, కోతకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోందని ఆరోపించారాయన. ఓట్ అన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడితే ఆరు పథకాలు లేనట్లేనని అన్నారు.
ఆ పథకంపై శ్వేతపత్రం విడుదల చేయాలి..
రైతుబంధు ఎంతవరకూ ఇచ్చారో వైట్ పేపర్ రిలీజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు హరీష్ రావు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రులు, కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. మేడిగడ్డ, ప్రాణహితపై త్వరలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఉంటుందని చెప్పారు హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారని, మరి ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజా పాలన పేరుతో ప్రోటోకాల్ తప్పుతారా? అని ప్రభుత్వం తీరును తూర్పారబట్టారు హరీష్ రావు. ఓడిపోయిన వారి చేత రిబ్బన్ కటింగ్స్ చేయిస్తున్నారని విమర్శించారు.
Also Read:
మారి మంచిగ బతకండి.. రౌడీ షీటర్లకు కమిషనర్ కౌన్సిలింగ్!
తాగి బయటకొచ్చారో తాట తీసుడే.. పోలీసుల మాస్ వార్నింగ్..
Ind-Pak: సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసిన పాక్..అసలేంటీ ఒప్పందం..భారత్ మీద ఇంపాక్ట్ ఎలా?
పహల్గామ్ ఉగ్రదాడి మొత్తం సీన్ నే మార్చేసింది. భారత్, పాక్ ల మధ్య ఉద్రిక్తతకు తెర లేపింది. దీంతో రెండు దేశాలూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
New Smartphone: శాంసంగ్ M56 5G ఫస్ట్ సేల్ షురూ.. భారీ డిస్కౌంట్- ధర, స్పెసిఫికేషన్ల వివరాలివే!
శాంసంగ్ గెలాక్సీ M56 5G ఫస్ట్ సేల్ షురూ అయింది. అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్, రిటైల్ స్టోర్ల నుండి కొనుక్కోవచ్చు. టెక్నాలజీ | Short News | Latest News In Telugu
RCB Vs RR: దుమ్ము దులిపేసిన కోహ్లీ, పడిక్కల్.. ఆర్సీబీ భారీ స్కోర్ - రాజస్థాన్ టార్గెట్ ఇదే
ఆర్ఆర్తో మ్యాచ్‌లో ఆర్సీబీ జట్టు తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేశారు. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
Raja Saab Update: "హై అలర్ట్…!! మే మరింత వేడెక్కనుంది!" రాజాసాబ్ అప్డేట్ ఆన్ ది వే..!
Raja Saab Update: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), మలవిక మోహనన్(Malavika Mohanan) కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ.... Short News | Latest News In Telugu | సినిమా
🔴Pahalgam Terrorist Attack Live Updates: కశ్మీర్ లో ఉగ్రవాదుల వేట.. లైవ్ అప్డేట్స్!
జమ్ము కశ్మీర్లో అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ భీకర ఘటనలో 27 మంది ప్రాణాలు కోల్పోగా. Latest News In Telugu | నేషనల్
Virat Kohli: చిన్నస్వామిలో చించేసిన కింగ్ కోహ్లీ.. అడుగు దూరంలో రికార్డు మిస్
చిన్నస్వామి స్టేడియం వేదికగ రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ చెలరేగిపోయాడు. వరుస ఫోర్లతో దుమ్ము దులిపేశాడు. Short News | Latest News In Telugu | స్పోర్ట్స్
PM Modi: వారిని మట్టిలో కలిపేస్తాం.. ఇక యుద్ధమే: మోదీ సంచలన ప్రకటన
Ind-Pak: సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసిన పాక్..అసలేంటీ ఒప్పందం..భారత్ మీద ఇంపాక్ట్ ఎలా?
New Smartphone: శాంసంగ్ M56 5G ఫస్ట్ సేల్ షురూ.. భారీ డిస్కౌంట్- ధర, స్పెసిఫికేషన్ల వివరాలివే!
RCB Vs RR: దుమ్ము దులిపేసిన కోహ్లీ, పడిక్కల్.. ఆర్సీబీ భారీ స్కోర్ - రాజస్థాన్ టార్గెట్ ఇదే
Raja Saab Update: "హై అలర్ట్…!! మే మరింత వేడెక్కనుంది!" రాజాసాబ్ అప్డేట్ ఆన్ ది వే..!