Modi Anushthan : కఠిన నేలే పట్టు పరుపు...కొబ్బిరినీళ్లే అన్నపానీయాలు

అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. కాగా ఈ సందర్భంగా ప్రధాని మోడీ అనుష్టాన దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే.  ప్రాణప్రతిష్ట వేడుకకు ముందు మోదీ 11 రోజులపాటు అనుష్ఠాన దీక్ష చేస్తానని ప్రకటించారు.

New Update
Modi Anushthan : కఠిన నేలే పట్టు పరుపు...కొబ్బిరినీళ్లే అన్నపానీయాలు

PM Modi : అయోధ్య(Ayodhya) లో రామమందిర(Ram Mandir) ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(Narendra Modi) ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. కాగా ఈ సందర్భంగా ప్రధాని మోడీ అనుష్టాన దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే.  ప్రాణప్రతిష్ట వేడుకకు ముందు మోదీ 11 రోజులపాటు అనుష్ఠాన దీక్ష చేస్తానని ప్రకటించారు. ప్రకటించినట్టే ఆయన దీక్షలో కొనసాగుతున్నారు. అందులో భాగంగా ఆయన పూర్తి నేలపై నిద్రిస్తూ, కొబ్బరి నీళ్లే సేవిస్తున్నారు. దీక్షలో భాగంగా మోదీ కఠిన నియమాలు పాటించడంతోపాటు, అందుకు సంబంధించిన నియమాలను అనుసరిస్తున్నాడని అధికార వర్గాలువెల్లడించాయి.

రామాలయ నిర్మాణాన్ని రామ జన్మభూమి ట్రస్ట్(Ram Janmasthan) అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. అందుకోసం దేశవ్యాప్తంగా పలు రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానించింది. అలాగూ ఆయా ప్రాంతాల నుంచి భక్తులు తమకు తోచిన విధంగా అయోధ్య రాములవారికి ఏదో ఒక రూపంలో కానుకలు అందించాలని భావిస్తున్నారు. అతిపెద్ద అగరుబత్తి, అతిపెద్ద లడ్డూ వంటవి సమర్పించుకుంటూ తమ భక్తిని చాటుకుంటున్నారు.

ఇది కూడా చదవండి :Enforcement Directorate : ఈడీ ఎదుట హాజరైన వివేక్ వెంకటస్వామి

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రామమందిర ప్రతిష్ట కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. దానికోసం అయోధ్యలో వేలాది కోట్లు వెచ్చిస్తూ అభివృద్ధి  కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఆధునిక విమానశ్రయం, రైల్వేస్టేషన్ లను నిర్మించింది. మరోవైపు అయోధ్యలో పెద్ద ఎత్తున హోటల్స్ ఏర్పాటు చేయడానికి పలు కార్పొరేట్ సంస్థలు ముందుకు వస్తున్నాయి,

కాగా రామాలయంలో ప్రతిష్టించనున్న రామలల్లా విగ్రహాం అయోధ్యకు చేరుకుంది. ఈ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాలు, నీటితో జలాధివాసం, హారతి, అరాధన తదితర పూజలు నిర్వహించారు.

ఇది కూడా చదవండి :BRS MLA: కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే?

ఈ 12న దీక్ష చేపట్టిన ప్రధాని మోడీ ప్రాణ ప్రతిష్ట పూర్తయ్యేవరకు కఠిన నియమాలు పాటించనున్నట్లు ప్రకటించారు. మితాహారం తీసుకోవడం, కొబ్బరినీళ్లు మాత్రమే సేవించడం, కఠిన నేలమీదా నిద్రించడం వంటి దీక్షలో భాగంగా కొనసాగిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు