Hardik-Natasha: హార్దిక్-నటాషా విడాకులు.. అధికారికంగా ప్రకటించిన పాండ్య!

భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాషా స్టాంకోవిచ్ తో విడిపోతున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తమ నాలుగేళ్ల బంధానికి ముగింపు పలకబోతున్నట్లు తెలిపాడు. నటాషా, తాను పరస్పరం విడిపోవాలని నిర్ణయించుకున్నామని చెప్పాడు.

New Update
Hardik-Natasha: హార్దిక్-నటాషా విడాకులు.. అధికారికంగా ప్రకటించిన పాండ్య!

Hardik Pandya : భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాషా స్టాంకోవిచ్ తో విడిపోతున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తమ నాలుగేళ్ల బంధానికి ముగింపు పలకబోతున్నట్లు తెలిపాడు. నటాషా, తాను పరస్పరం విడిపోవాలని నిర్ణయించుకున్నామని చెప్పాడు.

ఇది కఠినమైన నిర్ణయమే..
గత కొంతకాలంగా వీరిద్దరూ దూరంగా ఉంటున్నట్లు వార్తలొస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇన్నాళ్ల ఊహాగానాల మధ్య చివరకు హార్దిక్ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. నాలుగేళ్ల అనుబంధం తర్వాత భార్య నటాషా స్టాంకోవిచ్‌తో విడిపోతున్నట్లు తెలిపాడు. '4 సంవత్సరాలపాటు కలిసి ఉన్న నటాషా, నేను పరస్పరం విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మేము కలిసివుండటానికి మా వంతు ప్రయత్నం చేసాము. చివరికి విడిపోవాలనే ఫిక్స్ అయ్యాం. ఇది మా ఇద్దరికీ మేలు చేస్తుందని బలంగా నమ్ముతున్నాం. ఇది కఠినమైన నిర్ణయమే. మేము కలిసి ఆనందించిన క్షణాలు, పరస్పర గౌరవం, సాహచర్యం అన్నింటితో కలిపి మేము ఒక కుటుంబాన్ని ఏర్పరచుకున్నాం. మేము అగస్త్యునితో ఆశీర్వదించబడ్డాం. అతను మా ఇద్దరి జీవితాలకు కేంద్రంగా కొనసాగుతాడు. అతని ఆనందం కోసం మనం చేయగలిగినదంతా చేస్తాం. అతనికోసం మేము సహ-తల్లిదండ్రులుగా ఉంటాం' అంటూ చెప్పుకొచ్చాడు పాండ్య.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ దుమ్ము దులిపేసింది మామా..

ఐపీఎల్ 2025లో ఈరోజు అద్భుతమైన మ్యాచ్ జరిగింది. హైదరాబాద్ ఉప్పల్ లో ఈరోజు పంజాబ్ కింగ్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ నువ్వా నేనా అన్నట్టు ఆడారు. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 246 పరుగుల టార్గెట్ ఇస్తే దాన్ని ఎనిమిది వికెట్ల తేడాతో ఛేదించింది. 

author-image
By Manogna alamuru
New Update
ipl

SRK VS PBKS

హైదరాబాద్ సన్ రైజర్స్ అద్భుతమైన కమ్ బ్యాక్ ఇచ్చింది. ఐదు మ్యాచ్ లు ఓడిపోయిన తర్వాత ఈరోజు పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ చితక్కొట్టేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ లు విజృంభించి ఆడేశారు. పజాబ్ కింగ్స్ ఇచ్చిన 246 పరుగుల భారీ టార్గెట్ ను 8 వికెట్ల తేడాతో సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్లు అభిషేక్ వర్మ 141 పరుగులు, ట్రావిస్ హెడ్ 66 పరుగులతో ఇరగదీసారు. ఇద్దరూ కలిసి మ్యాచ్ ను గెలిపించేశారు. 150 పరుగుల ముందు అభిషేక్ వర్మ వికెట్ కోల్పోవడం కొంత నిరాశ కలిగించినా...అతను ఈరోజు ఆడిన తీరుతో ఉప్పల్ స్టేడియం మొత్తాన్ని ఉర్రూతలూగించాడు. అభిషేక్‌ శర్మ 55 బంతుల్లో 14 ఫోర్లు, 10 సిక్స్‌లsy 141 పరుగులు చేసి పంజాబ్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు. వరుస ఫోర్లు, సిక్సర్లతో ఉప్పల్ మైదానంలో పరుగుల వరద పారించాడు. అభిషేక్ ధాటికి పంజాబ్ ఏకంగా ఎనిమిది మందితో బౌలింగ్‌ చేయించింది.  మరోవైపు అతను కొట్టిన బంతులను గ్రౌండ్ స్టాఫ్ వెతుక్కోవడంతోనే సరిపోయింది.  ట్రావిస్ హెడ్ 37 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 66 పరుగులు చేసి అభిషేక్ కు మంచి సపోర్ట్ ఇచ్చాడు.  చివర్లో క్లాసెన్ 14 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌ తో 21, ఇషాన్ కిషన్ 9*; 6 బంతుల్లో 1 సిక్స్ కొట్టి మ్యాచ్ ను గెలిపించారు. 

పంజాబ్ కూడా దుమ్మ రేపింది..

అంతకు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు చెలరేగిపోయింది. తొలి ఇన్నింగ్స్ చేసి కింగ్స్ జట్టు నిర్దేశించిన 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగులు సాధించింది. దీంతో SRH ముందు 246 భారీ టార్గెట్ ఉంది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఈ మ్యాచ్ జరుగుతోంది. మొదట టాస్ గెలిచిన పంజాబ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్స్‌గా క్రీజులోకి ప్రభ్‌మన్ సింగ్‌, ప్రియాంశ్‌ ఆర్య మొదటి నుంచి దంచి కొట్టారు. బాల్‌ టు బాల్ ఫోర్లు, సిక్సర్లతో దుమ్ము దులిపేశారు. ఉప్పల్ స్టేడియంలో పరుగుల వరద పెట్టించారు. సన్ రైజర్స్ జట్టు బౌలర్లకు చెమటలు తెప్పించారు. ఇక హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో (3.6) ప్రియాంశ్‌ ఆర్య (36) నితీశ్‌ రెడ్డికి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.  ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన శ్రేయస్ అయ్యార్ దుమ్ము దులిపేశాడు. పరుగులు రాబడుతూ అదరగొట్టేశాడు. ఫోర్లు, సిక్సర్లతో కెవ్ కేక అనిపించాడు. అతడు 36 బంతుల్లో 82 పరుగులు చేసి ఔటయ్యాడు. అలాగే వధేరా 22 బంతుల్లో 27 పరుగులు, శశాంక్ సింగ్ 3 బంతుల్లో 2 పరుగులు, మాక్స్‌వెల్ 7 బంతుల్లో 3 పరుగులు, స్టొయినీస్ 11 బంతుల్లో 34 పరుగులు చేశారు. 

 today-latest-news-in-telugu | IPL 2025 | srh-vs-pbks

Also Read:  USA: యాపిల్ కు అండగా ట్రంప్..సుంకాల నుంచి ఫోన్లు, కంప్యూటర్లు మినహాయింపు

Advertisment
Advertisment
Advertisment