HanuMan Movie Highlights: హనుమాన్ మూవీలో హైలెట్స్ అవే !!

New Update
HanuMan Movie Highlights: హనుమాన్ మూవీలో హైలెట్స్ అవే !!

HanuMan Movie Highlights తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సినిమాల సందడి మొదలయింది. ఈ ఏడాది ఈ సీజన్లో నాలుగు సినిమాలు రిలీజ్ అవుతుండగా జనవరి 12న గుంటూరు కారం , హనుమాన్ చిత్రాలు రిలిజవుతున్నాయి. అయితే ..హనుమాన్ కు పబ్లిక్ లో ఉన్న క్రేజ్ దృష్ట్యా జనవరి 11స ఈవెనింగ్  నుంచే ప్రిమియర్ షోస్ వేసారు. అందరూ ఊహించినట్లుగానే హనుమాన్  సంక్రాంతికి సక్సస్ తో బోణీ కొట్టింది.

విభిన్న చిత్రాల దర్శకుడు ప్రశాంత్ వర్మ 

అ!, కల్కి, జాంబీ రెడ్డి చిత్రాలతో తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యెక శైలి ఏర్పరచుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ అందించిన సెల్యులాయిడ్ వండర్ హనుమాన్. బాలనటుడిగా అపార అనుభవమున్న తేజ సజ్జతో జాంబి రెడ్డి వంటి డిఫరెంట్ జానర్ ఫిలిం చేసి ఇప్పుడు  హనుమాన్ మూవీని తెరకేక్కించడం .. ఈ మూవీ నుంచి రిలీజయిన ప్రమోషనల్ కంటెంట్ కు విపరీతమైన బజ్ క్రియేట్ అవడంతో  హనుమాన్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పెద్ద సినిమాల రేసులో గట్టి నమ్మకంతో వచ్చిన ఈ సినిమా రిలీజ్కు ఒక రోజు ముందుగానే ప్రిమియర్ షోస్ ప్రదర్శించారు. ఈ సినిమా చుసిన వాళ్ళు విజువల్ వండర్ గా ప్రసంశిస్తున్నారు. అంతలా ఆకట్టుకునే అంశాలు ఈ సినిమాలో ఏమున్నాయి? ఈ చిత్ర కథాకమామిషు ఏంటో చూద్దాం.

కథ విషయానికి వస్తే ..

అంజనాద్రి అనే ఊళ్ళో హన్మంతు పాత్రదారి తేజ సజ్జా అల్లరిచిల్లరగా తిరుగుతూ దొంగతనాలు చెసుకుంటూ తన అక్క అంజమ్మ (వరలక్ష్మీ శరత్ కుమార్) తో కలిసి జీవనం సాగిస్తూ ఉంటాడు. ఇక..అదే ఊర్ర్లో మీనాక్షి (అమృతా అయ్యర్)కుడా ఉంటుంది. చిన్నప్పటి నుంచి హనుమంతుకి మీనాక్షి అంటే విపరీతమిన ప్రేమ. కానీ ఎనాదూ కుడా తన ప్రేమను వ్యక్తం చేయడు. ఈ ఊరంతా పాలేగాల్ల్ల ఆధిపత్యంలో ఉంటుంది. ఈ పాలెగాళ్ళకు అధిపతి గజపతి. ఎదురు తిరిగిన వాళ్ళను మల్లయుద్దంలో ప్రాణాలు తీయడం గజపతి పని. ఇలాంటి గజపతి అగడాలకు అడ్డుకట్టవేసేందుకు మీనాక్షి ముందుకొస్తుంది. ఈ క్రమంలో మీనాక్షిపై గజపతి దాడి చేస్తాడు.మీనాక్షిని గజపతి దాడి నుంచి కాపాడే ప్రయత్నంలో హనుమంతు  ఓ పెద్ద నదిలో పడిపోతాడు. నదిలో పడ్డ  హన్మంతుకు ఆ నదిలో రుధిర మణి దొరుకుతుంది. మణిని దగ్గర పెట్టుకున్న హన్మంతుకు సూపర్ పవర్స్ వస్తాయి. మరో వైపు  చిన్నతనం నుంచి సూపర్ హీరో అవుదామని కలలుకంటున్న మైఖేల్ కు ఈ మణి గురించి తెలుస్తుంది. ఇక.. అక్కడ నుంచి కథ లో ఎన్నో ట్విస్టులతో ప్రేక్షకులకు గూస్ బంప్స్  తెప్పిస్తుంది. ఇంతకీ ఆ మదిర మణితో హనుమంతు ఏం చేసాడు ? మైఖేల్ – హన్మంతు మధ్య ఎలాంటి వార్ నడిచింది? ఫైనల్ గా ఆ మణి ఎవరి సొంతం అవుతుంది అనేది వెండితెరమేదే చూడాలి.

ఫస్ట్ హాఫ్ సరదాగా

సామాన్య వ్యక్తికి అతీంద్రియ శక్తులు రావడం అనే కాన్సెప్ట్ తో తెలుగు సినిమాలు వచ్చాయి. అయితే .. అందరికి గుర్తుండిపోయే సినిమా జగదేకవీరుడు అతిలోకసుందరి. ఈ  సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి  అతీంద్రియ శక్తులు వస్తే .. థియేటర్స్ లో ఎలా ఎంజాయ్ చేసారో .. ఇప్పుడు తేజా సజ్జ నటనకు అదే రేంజ్లో ఎంజాయ్ చేస్తున్నారు. సూపర్ హీరో జానర్ లో హాలివుడ్ లో వచ్చిన స్పైడర్ మ్యాన్ , ఐరన్ మ్యాన్ తరహా సినిమాలు చిన్నపిల్లలకు బాగా ఆకట్టుకుంటాయి. ఇలా ఈ సంక్రాంతికి హనుమాన్ చిన్నపిల్లలతో పాటు పెద్దవారి మనసులను దోచుకున్నాడనే చెప్పాలి. ముఖ్యoగా  దర్శకుడు ప్రశాంత్ వర్మ విజువలైజేషన్ కు సెల్యూట్ చేయకుండా  ఉండలేము. సినిమా ఓపెనింగ్ సీన్ తోనే ప్రశాంత్ వర్మ మార్కులు కొట్టేసాడు. ఇంత భారీ స్కేల్ సినిమాను చాలా కూల్ గా ఫినిష్ చేసి జనాలతో శభాష్ అనిపించుకున్నాడు. ఫస్ట్ హాఫ్ అంతా చాలా సరదాగా సాగిపోతూ..  ప్రాబ్లoతో ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది. ఫస్ట్ హాఫ్ లో కామెడికి కొదవే లేదు. సత్య, గెటప్ శ్రీను కామెడికి ఫుల్ ఎంజాయ్ చేస్తారు.

సెకెండ్ హాఫ్ గూస్ బంప్స్

ఇంటర్వెల్ ముందు సరదాగా సాగిపోయిన హనుమాన్ మూవీ ఇంటర్వెల్ తరువాత తన ప్రతాపం చూపిస్తుంది. ఎలివేషన్తో ప్రతీ సీన్ పూనకాలు తెప్పిస్తాయి.ఇక.. బుల్లెట్ల వర్షంతో బ్యాక్ గ్రౌండ్లో  వచ్చిన  శ్రీరాముడి రూపం వచ్చేటప్పుడు  బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్ళాయి. ఇక.. క్లైమాక్స్ గురించి చెప్పేఅవసరం లేదు.  ఆంజనేయుడి ఆగమనాన్ని ఓ విజువల్ వండర్ గా తెరకెక్కించారు. సినిమా థియేటర్స్ నుంచి బయటకు వచ్చిన ప్రేక్షకుడిని హంట్ చేస్తూ ఉంటుంది. అంతలా అద్బుతమైన విజువల్స్ తో తీర్చిదిద్దారు ప్రశాంత్ వర్మ.ఇక.. భావోద్వేగాలను సైతం ప్రశాంత్ వర్మ చాలా చక్కగా తెరకెక్కించారు. సిస్టర్ సెంటిమెంట్‌ పాట మనసును బరువెక్కిస్తుంది, హనుమాన్ సినిమాలో  సముద్రఖని  పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుంది.

నటీనటుల విషయానికి వస్తే

హనుమాన్ సినిమాకు ప్రధాన పిల్లర్ తేజ సజ్జ. హనుమంతు పాత్రలో ఒదిగిపోయాడని ఖచ్చితంగా చెప్పాలి. ఓ సామాన్య వ్యక్తికి సూపర్ నేచరల్ పవర్స్ వస్తే ఎలా ఉంటుందో అలా తన నటనతో జీవం పోసాడు తేజా సజ్జ. వరలక్ష్మి శరత్ కుమార్ మరో వైవిధ్యమైన పాత్ర పోషించింది.ఈ మూవీలో సత్య , గెటప్ శీను , వెన్నెల కిషోర్ ల కామెడి ఇరగదీసారు, వెర్సటైల్ యాక్టర్ సముద్రఖని పాత్ర అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ప్రతి నాయకుడిగా  వినయ్ రాయ్ నటన బాగుంది.

సాంకేతిక వర్గం పనితీరు 

ఈ చిత్రం హై స్టాండర్డ్ టెక్నికల్‌ వ్యాల్యుస్ తో విజువల్స్, ఆర్ఆర్ మైండ్ బ్లోయింగ్ గా ఉంటుంది. హనుమాన్ పాట,నేపధ్య సంగీతం వచ్చేటప్పుడు ప్రేక్షకులకు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. శివేంద్ర సినిమాటోగ్రఫీ చాలా ప్రామిసింగ్ గా ఉంది. ఈ సినిమాకు సంగీత త్రయం అయిన గౌర హరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ లు అందించిన సంగీతం నెక్స్ట్ లెవల్ లో ఉంది.  సాయిబాబు తలారి  ఎడిటింగ్ షార్ప్ గా ఉంది. అత్యన్నత నిర్మాణ విలువలతో సెల్యులాయిడ్ వండర్ లా తీర్చిదిద్దారు ప్రశాంత్ వర్మ.

ప్లస్ పాయింట్స్

హనుమాన్ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ హనుమంతుడే. తేజ సజ్జ నటన, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ విజువలైజేషన్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, క్లైమాక్స్ ఈ  సినిమాకు ప్రధాన బలం. ఇక. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే .. ఇంటర్వెల్ తరువాత కాస్త స్లో అయినట్లు అనిపిస్తుంది. కాసేపటి తరువాత ఊపందుకుంది.

థియేటర్స్ లో బ్రహ్మరథం

ఓవరాల్ గా హనుమాన్ సినిమా గురించి చెప్పాల్సి వస్తే .. టాలివుడ్ నుంచి వచ్చిన ఫస్ట్ సూపర్ హీరో మూవీ “హను మాన్”కు థియేటర్స్ లో బ్రహ్మరథం పడుతున్నారు.  ఈ సంక్రాంతికి  హిట్ తో తొలి బోణీ కొట్టి ఈ సీజన్లో తొలి విజయాన్ని అందుకుంది హనుమాన్ మూవీ.

ALSO READ:“గుంటూరు కారం” సక్సెస్ మీట్ పై మహేష్ బాబు క్లారిటీ ?

Advertisment
Advertisment
తాజా కథనాలు