Google Account Hacking: అలెర్ట్...గూగుల్ అకౌంట్ పాస్ వర్డ్ లేకపోయినా హ్యాక్ చేస్తున్న హ్యాకర్లు టెక్నాలజీ పెరిగడం మనల్ని ఎంత సుఖపెడుతోందో అంతే కష్టపెడుతోంది కూడా. ఇప్పుడు ఎక్కడికీ వెళ్ళక్కర్లేకుండా అన్నీ ఆన్ లైన్‌లోనే పనులు జరిగిపోతున్నాయి. కానీ అదే టైమ్‌లో సైబర్ నేరాలు కూడా ఎక్కువయిపోయాయి. సైబర్ నేరగాళ్లు తాజాగా పాస్‌వర్డ్ లేకపోయినా గూగుల్ అకౌంట్లను హ్యాక్ చేస్తున్నారు. By Manogna alamuru 08 Jan 2024 in ఇంటర్నేషనల్ నేషనల్ New Update షేర్ చేయండి Google Accounts: మారుతున్న టెక్నాలజీని హ్యాకర్లు కూడా తెగ వాడేసుకుంటున్నారు. ఏ పాస్‌వర్డ్‌లు లేకుండా మన గూగుల్ అకౌంట్లనుకూడా హ్యాక్ (Hacking) చేస్తున్నారుట. దీని కోసం ఒక పద్ధతిని కూడా కనుగొన్నారుట. దీని ద్వారా వినియోగదారులు తమ గూగుల్ అకౌంట్ పాస్‌వర్డ్‌ను రీసెట్ చేసినప్పటికీ, హ్యాకర్లు వారి గూగుల్ అకౌంట్‌ను (Google Account) యాక్సెస్ చేయగలరు. ఇప్పుడు ఇది ఎవరికైనా చాలా ప్రమాదంగామారనుంది. ఎందుకంటే నేటి ఆధునిక యుగంలో చాలా మంది వ్యక్తులు తమ వ్యక్తిగత డేటా, పాస్‌వర్డ్‌లను వారి గూగుల్ ఖాతాలో సేవ్ చేసుకుంటారు. అటువంటి పరిస్థితిలో హ్యాకర్లు పాస్‌వర్డ్ లేకుండా వ్యక్తుల గూగుల్ ఖాతాలను ఉపయోగించడం ప్రారంభిస్తే అప్పుడు జీమెయిల్ యూజర్ల అందరి ప్రైవసీ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. 2023 అక్టోబర్‌లో టెలిగ్రామ్ ఛానెల్‌లో హ్యాకర్ దీని గురించి పోస్ట్ చేయడంతో హ్యాకర్ల విషయం వెలుగులోకి వచ్చింది. Also read:మాల్దీవుల దేశ రాయబారికి నోటీసులు జారీ చేసిన భారత విదేశాంగ శాఖ థర్డ్ పార్టీ కుకీలతో హ్యాకింగ్.. వినియోగదారులను ట్రాక్ చేయడానికి వారి అవసరాలకు అనుగుణంగా ప్రకటనలను చూపించడానికి వెబ్‌సైట్‌లు, బ్రౌజర్‌లు థర్డ్ పార్టీ కుకీలను ఉపయోగిస్తాయి. కానీ ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ కుకీలు వినియోగదారులకు ముప్పుగా మారుతున్నాయి. ఈ కుకీల ద్వారానే హ్యాకర్లు గూగుల్ అకౌంట్లను హ్యాక్ చేసేస్తున్నారు. గూగుల్ ఏమంటోంది? గూగుల్ (Google) కూడా ఈ సైబర్ నేరం జరుగుతోందని ఒప్పుకుంటోంది. గూగుల్.. కుకీల సహాయంతో యూజర్ల పాస్‌వర్డ్‌లను సేవ్ చేస్తుంది. దీని వలన రెండో సారి లాగిన్ అయినప్పుడు మళ్లీ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయవలసిన అవసరం ఉండదు. కానీ ఇప్పుడు హ్యాకర్లు దాన్నే తమ ఆయుధంగా మలుచుకుంటున్నారు. టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్‌ను దాటేయడానికి ఒక మార్గాన్ని కనుగొని మరీ అకౌంట్లను హ్యాక్ చేసిపడేస్తున్నారు. CloudSEK బ్లాగ్‌పోస్ట్ ప్రకారం హ్యాకర్లు గూగుల్ అకౌంట్ పాస్‌వర్డ్‌ను రీసెట్ చేసిన తర్వాత కూడా దాన్ని ఉపయోగించగలరు. దీని మీద క్లౌడ్ సెక్ సంస్థ ఒక నివేదికను కూడా సమర్పించింది. ఈ నివేదికలో సైబర్ ప్రపంచంలో వస్తున్న పెను ముప్పు, గూగుల్ సాంకేతిక బలహీనతల గురించి హెచ్చరించింది. అయితే మరోవైపు ఇటువంటి సైబర్ ప్రమాదాల నుంచి తమను తాము రక్షించుకోవడానికి నిరంతరం భద్రతా వ్యవస్థను అప్‌గ్రేడ్ చేస్తూనే ఉన్నామని, అలాగే వినియోగదారుల పటిష్ట భద్రత కోసం కొత్త టెక్నాలజీని కూడా ఉపయోగిస్తున్నామని గూగుల్ అంటోంది. క్రోమ్ బ్రౌజర్ కోసం థర్డ్ పార్టీ కుకీలను బ్లాక్ చేస్తున్నామని ప్రకటించింది. దీని వల్ల రాబోయే కొద్ది రోజుల్లో వినియోగదారులందరి అకౌంట్లు సురక్సితంగా ఉంటాయని హామీ ఇస్తోంది. #hacking #cyber-crime #hackers #google-account #google-accounts మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్‌లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి