GVL: విశాఖ వచ్చి భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తా.. టికెట్ రాకపోవడంపై జీవీఎల్ రియాక్షన్ తనకు విశాఖ బీజేపీ టికెట్ దక్కకపోవడంపై జీవీఎల్ నరసింహారావు స్పందించారు. జీవీఎల్ ఫర్ వైజాగ్ అనేది నిరంతర ప్రక్రియ అని అన్నారు. త్వరలోనే విశాఖ వచ్చి భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తానన్నారు. By Nikhil 25 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ వైజాగ్ New Update షేర్ చేయండి విశాఖ ఎంపీ టికెట్ రాకపోవడంపై బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు స్పందించారు. తనకు టికెట్ ఇవ్వకపోవడంతో కార్యకర్తలు కలత చెందారన్నారు. మూడేళ్లుగా విశాఖలోనే ఉంటూ..అనేక సమస్యలకు పరిష్కారం చూపానని గుర్తు చేశారు. విశాఖ అభివృద్ధి కోసం తీవ్రంగా కృషి చేశానని గుర్తు చేశారు. తాను చేసిన సేవ నిస్వార్థమైనదన్నారు. ఎన్నికల కోసం తాను ఇక్కడ సేవ చేయలేదన్నారు. జీవీఎల్ ఫర్ వైజాగ్ అనేది నిరంతర ప్రక్రియ అని అన్నారు. త్వరలోనే విశాఖ వచ్చి భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తానన్నారు. విశాఖలోనే ఉంటా, అభివృద్ధికి భవిష్యత్తులో కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఏపీ బీజేపీ ఎంపీ అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ హైకమాండ్ నిన్న ప్రకటించింది. అరకు (ఎస్టీ) అభ్యర్థిగా కొత్తపల్లి గీత, అనకాపల్లి-సీఎం రమేష్, రాజమండ్రి-పురంధేశ్వరి, నరసాపురం-భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, తిరుపతి (ఎస్సీ)-వరప్రసాద్ రావు, రాజంపేట-కిరణ్ కుమార్ రెడ్డి పేర్లతో జాబితాను విడుదల చేసింది. 2024 లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రం నుండి పోటీచేయడానికి బిజెపి కేంద్ర ఎన్నికల కమిటీ ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు ఘన విజయం చేకూరాలని కోరుకుంటూ అభ్యర్థులందరికీ బిజెపి ఆంధ్రప్రదేశ్ శుభాకాంక్షలు తెలియచేస్తుంది.#AbkiBaar400Paar #PhirEkBaarModiSarkar pic.twitter.com/QN69GTyYnJ — BJP ANDHRA PRADESH (@BJP4Andhra) March 24, 2024 అయితే.. నరసాపురంలో రఘురామకృష్ణరాజు బదులుగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేరు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంకా.. వైజాగ్ లో జీవీఎల్ నరసింహరావుకు కూడా టికెట్ దక్కకపోవడం చర్చనీయాంశమైంది. #bjp #vizag #gvl మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి