/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/unnamed-file-jpg.webp)
మంచిర్యాల జిల్లా చెన్నూరులో విషాదం చోటుచేసుకుంది. పెద్ద చెరువులో దూకి గురుకులంలో జూనియర్ లెక్చరర్ తిరుమలేశ్వరి ఆత్మహత్య చేసుకుంది. ప్రిన్సిపల్ వేధింపుల వల్లే తాను చనిపోతున్నట్టు వాయిస్ రికార్డ్ చేయడం కలకలం సృష్టిస్తోంది. గురుకులంలో సిబ్బంది వేధింపులు భరించలేకే తిరుమలేశ్వరి చనిపోయిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. వివరాళ్లోకి వెళ్తే.. మృతురాలు తిరుమలేశ్వరి(35) ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. అయితే తన చావుకు ప్రిన్సిపల్, తోటి ఉపాధ్యాయురాళ్ల వేధింపులే కారణమని వాయిస్ రికార్డులో పేర్కొన్నారు. తిరుమలేశ్వరి స్వగ్రామం మంచిర్యాల జిల్లా నస్పూర్ గ్రామం.. ఆమెకు భర్త సంపత్, కూతురు ఉన్నారు. కరీంనగర్ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఆమె నాలుగేళ్ల క్రితం డిప్యుటేషన్‌పై చెన్నూరు గురుకుల పాఠశాలకు వచ్చింది. భర్త సందీప్ తెలిపిన వివరాల ప్రకారం.. గురుకుల పాఠశాలలో జరుగుతున్న జోనల్‌స్థాయి ఆటల పోటీల్లో పాల్గొంటున్న 1275 మంది క్రీడాకారులు, మరో సహాయ సిబ్బందికి సంబంధించి భోజన ఏర్పాట్ల బాధ్యతలను తిరుమలేశ్వరికి అప్పగించారు.
అయితే.. ఏర్పాట్లలో ఆమెకు సహాయంగా ఉండేందుకు కమిటీలోని మరో పది మందిని నియమించగా.. గత 4 రోజులుగా తిరుమలేశ్వరి ఈ బాధ్యతల్లో ఉన్నారు. పని విషయంతో ఆమెకు కమిటీ సభ్యుల్లో ఏ ఒక్కరూ సహకరించలేదు. భోజన ఏర్పాట్ల బాధ్యతను చూసుకోవటంలో తిరుమలేశ్వరి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తనకు సహకరించాల్సిందిగా కమిటీలోని సభ్యులను అడిగినా.. వారు ససేమిరా అన్నారు. నిన్న టిఫిన్, భోజనం ఆలస్యం కావటంతో అందరూ తిరుమలేశ్వరినే తప్పుబట్టారు. విధి నిర్వహణలో భాగంగా భర్త సంపత్ తిరుమలేశ్వరిని గురుకులంలో దింపి వెళ్లాడు.. గంట తర్వాత భర్త ఫోన్ చేయగా ఆమె లిఫ్ట్ చేయలేదు. వరుసగా ఫోన్ చేశాడు. అప్పుడే ఓ వ్యక్తి లిఫ్ట్ చేసి పెద్ద చెరువు కట్టపై బ్యాగు ఉందని చెప్పాడు. ఫోన్ మోగడంతో లిఫ్ట్ చేశానని చెప్పాడు. సంపత్ వెంటనే చెరువు కట్ట దగ్గరకు వెళ్లగా.. అప్పటికే తిరుమలేశ్వరి చెరువులో దూకినట్లు గుర్తించారు. జాలర్ల సహాయంతో చెరువులో గాలించగా తిరుమలేశ్వరి మృతదేహం లభ్యమైంది.
ఆ ఐదుగురుపై కేసు నమోదు
గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ రాజమణి, పీఈటీలు రేష్మ, శిరీష, పుష్పలత, అసిస్టెంట్ కేర్ టేకర్ స్రవంతి వేధించడం వల్లే తన భార్య తిరుమలేశ్వరి ఆత్మహత్య చేసుకుందంటూ భర్త సంపత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భోజనాల ఏర్పాట్ల రూపంలో అదనపు బాధ్యతలు అప్పగించి.. తనకు సహకరించకపోగా సూటిపోటి మాటలతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నాడు. మృతురాలి ఫోన్‌లో ప్రిన్సిపల్ సహా.. మరో ఐదుగురి వేధింపులపై వాయిస్ రికార్డు ఉందని సీఐ వాసుదేవరావు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: అత్యాధునిక పరికరాలతో ఏటీఎం దొంగతనాలు.. ముఠా ఆట కట్టించిన తిరుపతి పోలీసులు