Guntur kaaram trailer:రౌడి రమణ సినిమా స్కోపు .. 70MM..మిర్చీ యార్డులో చెలరేగిపోయన మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో జనవరి 12న వస్తోన్న గుంటూరు కారం థియేట్రికల్ ట్రైలర్ రిలీజయింది. మిర్చీ యార్డులో రౌడీ రమణ గా మహేష్ బాబు చెలరేగిపోయాడు .

New Update
Guntur kaaram trailer:రౌడి రమణ సినిమా స్కోపు .. 70MM..మిర్చీ యార్డులో చెలరేగిపోయన మహేష్

Guntur kaaram trailer : సూపర్ స్టార్ మహేష్ , త్రివిక్రమ్ కాంబోలో వస్తోన్న గుంటూరు కారం థియేట్రికల్ ట్రైలర్ రిలీజయింది. మిర్చీ యార్డులో రౌడీ రమణ గా మహేష్ బాబు చెలరేగిపోయాడు .“చూడంగానే మజా వచ్చిందా.. హార్ట్ బీట్ పెరిగిందా.. ఈల వేయాలనిపించిందా” అంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు చెప్పిన డైలాగ్స్ లో అన్ని ఎమోషన్స్ ఉన్నట్లే ట్రైలర్ కూడా దుమ్మురేపేశాడు. ఊర మాస్ లుక్లో అదరగొట్టిన మహేష్ బాబు.. ఫ్యాన్స్ కు ఈ సంక్రాంతికి ముందే అసలు సిసలు ట్రీటిచ్చాడని చెప్పొచ్చు. కేవలం మాస్ అంశాలనే కాకుండా త్రివిక్రమ్ స్టైల్ ఎమోషన్స్ కూడా రంగరించి ట్రైలర్ రిలీజ్ చేశారు. "మీరు మీ పెద్దబ్బాయిని.. అనాథలాగా వదిలేశారని అంటున్నారు. దానికి మీరు ఏమంటారు” అని రమ్యకృష్ణను ఓ రిపోర్టర్ అడగడంతో ట్రైలర్ ఆరంభం అయింది.

రౌడీ రమణ సినిమా స్కోప్ 70 ఎంఎం

గుంటూరు యార్డులో మిర్చీల యంబియన్స్లో  బీడీ తాగుతూ రెడ్ కలర్ జీప్ నుంచి మహేశ్ దిగే షాట్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. త్రివిక్రమ్ గతంలో ఎన్నడూ ఈ రేంజ్ మాస్ సినిమా చేయలేదనే చెప్పొచ్చు . రౌడీ రమణ సినిమా స్కోప్ 70 ఎంఎం అంటూ రావు రమేష్ మహేష్ క్యారక్టర్ కు ఇచ్చిన ఎలివేషన్ మాములుగా లేదు. ట్రైలర్ చూస్తుంటే పొలిటికల్ మార్క్ కొట్టొచ్చినట్లుకనిపిస్తుంది.

"వాడొక బ్రేకుల్లేని లారీ”

శ్రీలీల వెంట మహేష్ బాబు తిరిగే సీన్లు చాలా ఫన్ పుట్టించాయి. వెన్నెలకిషోర్ , మహేష్ బాబు మధ్య వచ్చే డైలాగ్స్ ఎంటర్టైన్మెంట్ గా సాగాయి. “చింపేసుకుంటారా.. వేసుకొని చింపుకుంటారా.. ఎక్కడ చింపాలో.. ఎంత కనపడాలో వాటి యవ్వారమే వేరండి” అంటూ శ్రీలీల చిరిగిన జీన్స్ చూస్తూ మహేష్ బాబు చెప్పే డైలాగ్ కి థియేటర్లో నవ్వులు పూయడం ఖాయం. . ఈ మూవీలో మహేష్ ను ఉద్దేశించి "వాడొక బ్రేకుల్లేని లారీ” అంటూ ప్రకాష్ రాజ్ డైలాగ్ లానే మహేష్ పాత్ర అలానే తీర్చిదిద్దారు. ఇక.. మదర్ సెంటిమెంట్ పుష్కలంగా ఉన్నట్లు ఆ పాత్రకు రమ్యకృష్ణ జీవం పోసినట్లు ట్రైలర్ లో చెప్పకనే చెప్పారు.‘ఎప్పుడో చిన్నప్పుడు కొట్టాల్సిన అమ్మ ఇప్పుడు పిలిపించి ఇస్త్రీ చీర వేసుకొని మరీ కొడుతోంది రా’ అంటూ మహేశ్ చెప్పే డైలాగ్ హార్ట్ కు కనెక్ట్ అయ్యేవిధంగా చాలా ఎమోషనల్‍గా ఉంది.

2 నిమిషాల 47 సెకన్ల నిడివితో ట్రైలర్ 

అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటరైన్మెంట్ తో సాగిన ఈ ట్రైలర్ చూస్తుంటే రౌడీ రమణ గాడు చెలరేగిపోయాడు అనే రేంజ్ లో ఉంది. “రమణ గాడు.. నీ లైఫ్ ఒక మిరకిల్ రా బాబు” అనే డైలాగ్‍తో ఎండ్ అయిన గుంటూరు కారం ట్రైలర్ 2 నిమిషాల 47సెకన్ల నిడివితో ఇంటెన్స్ మాస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోందని అర్ధమవుతోంది. అయితే ట్రైలర్లో ఎక్కడా స్టోరీ రివీల్ చేయకపోవడం త్రివిక్రమ్ స్పెషాలిటీ. ఇక.. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే స్టన్నింగ్ విజువల్స్ ,వీటికి తోడు థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గూస్ బంప్స్ తెప్పించాయి. ఈ జనవరి 12 న సంక్రాంతికి రిలీజ్ కానున్న గుంటూరు కారం థియేటర్స్ లో ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

ALSO READ: గుంటూరులో గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ? ..మరి కాసేపట్లో ట్రైలర్ రిలీజ్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

రవితేజ ‘మాస్ జాతర’ నుంచి వచ్చేసిన మాస్ సాంగ్.. చూపుల్తో గుచ్చి గుచ్చి.. మ్యూజిక్, స్టెప్స్‌తో అదిరిపోయాయిగా!

మాస్ మహారాజ్ రవితేజ "మాస్ జాతర" మూవీ నుంచి ‘తు మేరా లవర్’ లిరికల్ సాంగ్‌ను మూవీ టీం రిలీజ్ చేసింది. చూపుల్తో గుచ్చి గుచ్చి మ్యూజిక్, సెప్స్‌తో వింటేజ్ రవితేజను గుర్తుచేశారు. ఇందులో హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తోంది.

New Update

మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) "మాస్ జాతర" మూవీతో ప్రేక్షకుల ముందుకు త్వరలో రాబోతున్నాడు. భాను భోగవరపు దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ మూవీకి సంబంధించిన తు మేరా లవర్ అనే పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ పాటలో ఇడియట్ సినిమాలోని చూపుల్తో గుచ్చి గుచ్చి బీట్, డ్యాన్స్‌ను రీమేక్ చేసి మధ్యలో యాడ్ చేశాడు.  

ఇది కూడా చూడండి: HIT 3 Trailer: ఆ నరుకుడు ఏంది సామి.. రక్తం ఏరులైపారిందిగా..! హిట్-3' ట్రైలర్ రిలీజ్..

ఇది కూడా చూడండి: AP Crime: విశాఖలో దారుణం.. మరో 24 గంటల్లో డెలివరీ.. నిండు గర్భిణిని గొంతు పిసికి చంపిన భర్త!

ఇది కూడా చూడండి:Aghori Audio Call Leak: రాధీ నావల్ల కావట్లేదే.. ఫస్ట్‌ వైఫ్‌తో అఘోరీ రాసలీలల ఆడియో లీక్.. ఒక్కసారి విన్నారంటే?

వింటేజ్ రవితేజను గుర్తు చేసేలా..

ఈ పాట అప్పట్లో సంచలనాలు సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అవే స్టెప్‌లు, మ్యూజిక్‌ వింటేజ్ రవితేజను గుర్తు చేశాయి. ఈ మాస్ సాంగ్‌లో రవితేజ, శ్రీలీల మాస్ బీట్స్‌తో అదరిగొడుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ పాట ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో ఈ స్టోరీలో చూద్దాం. 

ఇది కూడా చూడండి: Shiva Puja: ఇంట్లో శివలింగం ఏ దిశలో ఉంచాలంటే?: శివభక్తులు తప్పక తెలుసుకోవాల్సిన 5 విషయాలు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు