IPL 2024: మేం బరిలో ఉంటే ఎంతటి లక్ష్యమైనా ఖతమే.. శుభ్‌మన్! రాజస్థాన్ పై గెలిచిన అనంతరం గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘మేం బరిలో ఉన్నప్పుడు ఎంతటి లక్ష్యమైనా సురక్షితం కాదని ప్రత్యర్థులు గుర్తుంచుకోవాలి. చివరి మూడు ఓవర్లలో 45 పరుగులు చేయడం మాకు పెద్ద కష్టం కాదు' అంటూ హెచ్చరికలు పంపాడు. By srinivas 11 Apr 2024 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి Shubman Gill: బుధవారం రాజస్థాన్ పై గెలిచిన అనంతరం గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్ లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన గిల్ (72) గుజరాత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే.. గిల్ ను ఉద్దేశిస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయగా గిల్ సైతం తనదైన స్టైల్ లో ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపాడు. The GOAT In making.🫡💯#IPLonJioCinema #ShubmanGill #GTvRR #CricketTwitter #cricketnews #cricketupdates #cricketfastliveline #cfll pic.twitter.com/m6AoMM4RZx — Cricket Fast Live Line (@cfll_live) April 11, 2024 ఇది కూడా చదవండి: TS: అడ్డగోలు అప్పులు.. దొంగ ఏడుపులు.. కేసీఆర్‌కు బుద్ధి చెప్పాల్సిందే: ఇందిరాశోభన్ మాకు పెద్ద కష్టం కాదు.. ఇక అసలు విషయానికొస్తే.. ‘చాలా బాగా ఆడారు. మీ ఖాతాలో రెండు పాయింట్లు చేరాయి. ఇంకాస్త ముందుగా గెలవాల్సిన మ్యాచ్‌ను చివరి వరకూ తీసుకెళ్లారని అనుకుంటున్నారు. మొత్తానికి కంగ్రాట్స్' చెప్పాడు హర్షా భోగ్లే. అయితే భోగ్లే వ్యాఖ్యలపై మాట్లాడిన గిల్.. ‘మేం బరిలో ఉన్నప్పుడు ఎంతటి లక్ష్యమైనా సురక్షితం కాదని ప్రత్యర్థులు గుర్తుంచుకోవాలి. చివరి మూడు ఓవర్లలో 45 పరుగులు చేయడం పెద్ద కష్టం కాదు. క్రీజ్‌లోని ఇద్దరు బ్యాటర్లు ఒక్కొక్కరు 9 బంతుల్లో 22 పరుగులు చేస్తే సరిపోతుంది. అందులో ఒకరు ఇంకాస్త దూకుడుగా ఆడితే మరింత సులభం. రషీద్ ఖాన్, రాహుల్ తెవాతియా అదే చేశారు. చివరి బంతికి రషీద్ ఖాన్ ఫోర్ కొట్టడం అద్భుతం. గత మ్యాచ్‌లోనూ 50 శాతం వరకు మేం ఆధిపత్యం ప్రదర్శించాం' అని గిల్ అన్నాడు. #shubman-gill #gujarat-titans మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి