Monkhood: రూ.200 కోట్లు దానం చేసి సన్యాసం తీసుకోనున్న దంపతులు

గుజరాజ్‌లోని సబర్‌కాంత జిల్లాలోని ఓ దంపతులు తమకున్న రూ.200 కోట్ల ఆస్తుల్ని దానం చేసి సన్యాసం తీసుకునేందుకు సిద్ధమయ్యారు. 2022లో వాళ్ల కూతరు (19), కొడుకు (16) సన్యాసంలో చేరారు. ఏప్రిల్‌ 22న ఈ దంపతులు అధికారికంగా సన్యానంలో చేరనున్నారు.

New Update
Monkhood: రూ.200 కోట్లు దానం చేసి సన్యాసం తీసుకోనున్న దంపతులు

ఈ సమాజంలో పేద, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ఉంటారు. ధనవంతులు తక్కువగా ఉంటారు. డబ్బులు ఎక్కువగా ఉన్నవారు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఇంకా డబ్బులు సంపాదించేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఓ దంపతులకు మాత్రం వందల కోట్లు ఆస్తులు ఉన్నప్పటికీ అవి వారికి సంతృప్తిని ఇవ్వలేదు. తమకున్న రూ.200 కోట్ల ఆస్తిని దానం చేసి చివరికి సన్యాసం తీసుకునేందుకు సిద్ధమయ్యారు. అందేంటీ అంత ఆస్తి ఉండి కూడా సన్యానం తీసుకోవడం ఏంటీ అని ఆలోచిస్తున్నారా. అయితే ఈ స్టోరీ చదవాల్సిందే

Also Read: వివాదంలో ఇరుక్కున్న మరో బీజేపీ ఎంపీ రవి కిషన్ ..

ఇక వివరాల్లోకి వెళ్తే.. గుజరాజ్‌లోని సబర్‌కాంత జిల్లాలో భావేష్ భండారి అనే వ్యక్తి తన భార్యతో కలిసి ఉంటున్నారు. ఈయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండేవారు. కొంత మొత్తంలో పెట్టుబడి పెట్టి ఆ వ్యాపారంలోకి అడుగు పెట్టిన భండారి కుటుంబానికి కొంతకాలానికి భారీగా లాభాలు వచ్చాయి. కానీ ఈ ఆస్తులు, వ్యాపారం ఆ భార్యభర్తలకు సంతృప్తినివ్వలేదు. అయితే ఈ దంపతులకు కుమార్తె (16), కొడుకు (16) కూడా ఉన్నారు. కానీ వీళ్లిద్దరూ 2022లో సన్యాసం తీసుకున్నారు. దీంతో వారి నుంచి ప్రేరణ పొందిన భండారి దంపుతులు.. తమ పిల్లలలాగే సన్యాసం తీసుకునేందుకు సిద్ధమయ్యారు.

సన్యాసానికి తీసుకునేందుకు.. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఓ వేడుకలో భావేష్ భండారి, తన భార్య తమకున్న రూ.200 కోట్ల ఆస్తిని విరాళంగా ఇచ్చారు. ఏప్రిల్ 22న జరిగే ఈ కార్యక్రమంలో అధికారికంగా సన్యానం తీసుకోనున్నారు. మోక్షం పొందడం కోసం యాత్రకు బయలుదేరేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే భండారి దంపతులతో పాటు మరో 35 మంది కలిసి నాలుగు కిలోమీటర్ల వరకు ఊరేగింపుగా వెళ్లనున్నారు. అక్కడ వారు తమ యావదాస్తుల్ని వదిలేసి.. ఆ తర్వాత రెండు తెల్లని వస్త్రాలు ధరిస్తారు. ఆ తర్వాత భిక్ష కోసం ఒక గిన్నె తీసుకుని దేశమంతటా చెప్పులు లేకుండా ప్రయాణం చేస్తున్నారు. కేవలం భిక్షాటన చేసుకుంటూనే వీళ్లు జీవిస్తారు.

Also Read: మరో 25 ఏళ్లు బీజేపీనే.. మోదీ సెన్సేషనల్ ఇంటర్వ్యూ లైవ్

Advertisment
Advertisment
తాజా కథనాలు