Gruha Jyothi: సీఎం సొంత జిల్లాలోనే గృహజ్యోతి పథకానికి బ్రేక్..!

రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో గృహజ్యోతి పథకానికి బ్రేకులు పడ్డాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో గృహలక్ష్మి పథకానికి అడ్డంకులు ఎదురయ్యాయి. గత నెల 26 నుంచే మహబూబ్‌నగర్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.ఇక ఇప్పటికే ఎంపీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది.

New Update
Gruha Jyothi: సీఎం సొంత జిల్లాలోనే గృహజ్యోతి పథకానికి బ్రేక్..!

Gruha Jyothi Scheme: 200 యూనిట్ల ఉచిత కరెంట్ పథకం గృహజ్యోతి(Gruha Jyothi) ఈ నెల ఒకటి నుంచి తెలంగాణలో అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకం అమలుకు కొన్ని నియమాలు పెడుతూ ట్విస్ట్‌లు ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి ఈ స్కీమ్‌ అమల్లో మొదటి నుంచి అడ్డంకులే ఎదురవుతున్నాయి. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ పొందాలంటే షరుతులు తప్పనిసరి. మరోవైపు ఈ పథకం అమలు సీఎం రేవంత్‌ సొంత జిల్లాలోనే జరగడం లేదని తెలుస్తోంది.

అమలకు బ్రేక్:
సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో గృహజ్యోతి పథకానికి బ్రేకులు పడ్డాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో గృహలక్ష్మి పథకానికి అడ్డంకులు ఎదురయ్యాయి. గత నెల 27న గృహలక్ష్మి పథకానికి రేవంత్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. అయితే 26 నుంచే మహబూబ్‌నగర్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఇప్పటికే ఎంపీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. మరోవైపు గృహలక్ష్మిపై జిల్లా వాసులు ఆశలు పెట్టుకున్నారు. సీఎం సొంత జిల్లాలోనే పథకానికి బ్రేక్‌ పడడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఎన్నికల కోడ్ ముగిసేంతవరకు గృహలక్ష్మికి బ్రేక్ తప్పనిసరి. దీంతో జీరో బిల్లులకోసం జిల్లా వాసులు ఎదురుచూస్తున్నారు.

Also ReaD: కవిత ఆడపడుచు ఇంట్లో ఈడీ సోదాలు!

Advertisment
Advertisment
తాజా కథనాలు