/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/kerala-1-1.jpg)
Green Protection For 6 States : కేరళ (Kerala) లోని వయనాడ్ (Wayanad) లో ప్రకృతి బీభత్సానికి 300 మందికి పైగా చనిపోయిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం (Central Government) కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమ కనుమలను పర్యావరణ సున్నిత ప్రాంతం గా ప్రకటించేందుకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ముసాయిదా నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
కొండచరియలు విరిగిపడటం వల్ల సంభవించిన ఘోర ఘటనలో వందలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయిన వయనాడ్ గ్రామాలు కూడా ఇందులో ఉన్నాయి. వయనాడ్‌లో ఇప్పటికీ ఇంకా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 300 మందికి పైగా గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు మొదలు పెట్టారు.
ప్రభుత్వ ముసాయిదాలో 6 రాష్ట్రాలలో 59940 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మేర ఈఎస్‌ఏ ఎంపిక చేసింది. ఇది పశ్చిమ కనుమల్లో దాదాపు 37 శాతం. 2022లో కూడా ఇదే విధమైన డ్రాఫ్ట్ విడుదలైంది. ప్రఖ్యాత పర్యావరణవేత్త మాధవ్ గాడ్గిల్ కమిటీ 2011లోనే దీన్ని సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. 13 ఏళ్ల తర్వాత ఆయన నివేదికపై ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. అయితే ఈ నివేదికలో 75 శాతం విస్తీర్ణాన్ని ఈఎస్‌ఏ పరిధిలోకి తీసుకురావాలని కేంద్రం సిఫారసు చేయగా, దానిని 37 శాతానికి తగ్గించాయి. ముసాయిదా గడువు ముగియడంతో కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేసినట్లు మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.