AP Govt Schemes: ఏపీలో మరో ఆరు పథకాల పేర్లు మార్పు.. లిస్ట్ ఇదే! ఆంధ్రప్రదేశ్‌లో మరో ఆరు పథకాల పేర్లను మార్చారు. గత ప్రభుత్వం ముఖ్యమంత్రి వైస్ జగన్ పేరుతో పెట్టిన విద్యాపథకాల పేర్లను మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు మంత్రి లోకేశ్. పాత పథకాలకు భరతమాత ముద్దుబిడ్డల పేర్లను పెడతామని తెలిపారు. By Manogna alamuru 28 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Minister Lokesh: అయిదేళ్లపాటు గత ప్రభుత్వం భ్రష్టుపట్టించిన విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలని చంద్రబాబునాయుడు గారి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేశ్ చెప్పారు. రాష్ట్రంలో విద్యాలయాలను రాజకీయాలకు అతీతంగా సరస్వతీ నిలయాలుగా తీర్చిదిద్దాలన్నది మా సంకల్పమని అన్నారు. ఇందులో భాగంగా తొలుత గత ప్రభుత్వం నాటి ముఖ్యమంత్రి పేరుతో ఏర్పాటుచేసిన పథకాల పేర్లకు స్వస్తి చెబుతున్నామని తెలిపారు లోకేశ్. విద్యారంగంలో విశేష సేవలందించిన భరతమాత ముద్దుబిడ్డల పేర్లను ఆయా పథకాలకు నామకరణం చేసి సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించామన్నారు. ఈరోజు దివంగత మాజీ రాష్ట్రపతి అబ్ధుల్ కలామ్ గారి వర్థంతి సందర్భంగా ఆ మహనీయుని స్పూర్తితో నూతన పథకాల పేర్లను ప్రకటిస్తున్నానని చెప్పారు. అమ్మఒడి పథకం పేరు ‘ తల్లికి వందనం’, జగనన్న విద్యాకానుక పేరు ‘ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర’గా జగనన్న గోరు ముద్ద పేరు ‘ డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం’గా, మన బడి నాడు-నేడు పేరును ‘ మనబడి- మన భవిష్యత్తు’గా, స్వేచ్ఛ పథకం పేరును ‘బాలికా రక్ష’గా జగనన్న ఆణిముత్యాలు పేరును ‘అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం’గా మార్చామని మంత్రి లోకేశ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. Also Read:Telangana: తెలంగాణ గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ #andhra-pradesh #minister-lokesh #government-schemes మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి