Gopichand Thotakura : గగనంలో దేశభక్తిని చాటిన గోపిచంద్!

అంతరిక్షంలోకి వెళ్లిన సమయంలో గోపిచంద్‌ తన దేశం మీద భక్తిని చాటుకున్నారు. బ్లూ ఆరిజిన్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేసిన వీడియోలో గోపిచంద్‌ చిన్న భారత జెండాను చూపిస్తున్నారు.

New Update
Gopichand Thotakura : గగనంలో దేశభక్తిని చాటిన గోపిచంద్!

Indian Flag While In Space : గోపిచంద్ తోటకూర (Gopichand Thotakura)... ప్రస్తుతం ఈ విజయవాడ (Vijayawada) అబ్బాయి పేరు అంతర్జాతీయంగా మారుమోగుతుంది. రోదసిలోకి (Space) వెళ్లి వచ్చిన తొలి భారతీయ పర్యాటకుడిగా తన పేరును సువర్ణాక్షరాలతో రాసుకున్నాడు. అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ (Jeff Bezos) స్థాపించిన బ్లూ ఆరిజన్‌ సంస్థ న్యూ షెపర్డ్‌ -25 పేరుతో ఏర్పాటు చేసిన అంతరిక్ష యాత్రలో గోపీచంద్ కూడా భాగస్వామి అయిన విషయం తెలిసిందే.

టెక్సాస్‌లోని ప్రయోగకేంద్రం నుంచి నింగిలోకి దూసుకెళ్లిన వ్యోమనౌక ధ్వనివేగానికి మూడింతల వేగంతో ప్రయాణించి భూ వాతావరణం, అంతరిక్ష సరిహద్దుగా భావించే కర్మన్ రేఖ ఎగువకు సుమారు 105.7 కిలోమీటర్ల ఎత్తుకు చేరింది. ఆ తరువాత వారు అక్కడి నుంచి భూమిని తనివితీరా వీక్షించారు. పది నిమిషాల్లోనే యాత్రను ముగించుకున్న నౌక ఆపై సురక్షితంగా భూమిని చేరింది. బ్లూ ఆరిజన్ నిర్వహించిన ఏడో మానవసహిత యాత్ర గోపిచంద్‌ పాల్గొన్న యాత్ర.

View this post on Instagram

A post shared by NDTV (@ndtv)

అంతరిక్షంలోకి వెళ్లిన సమయంలో గోపిచంద్‌ తన దేశం మీద భక్తిని చాటుకున్నారు. బ్లూ ఆరిజిన్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేసిన వీడియోలో గోపిచంద్‌ చిన్న భారత జెండాను చూపిస్తున్నారు. ఈ వీడియోను చూసిన వారంతా గోపిచంద్‌ దేశభక్తిని మెచ్చుకుంటున్నారు.

Also read: కౌంటింగ్ రోజు తోక జాడిస్తే.. తొక్క తీస్తా- కడప ఎస్పీ సిద్దార్థ్‌ కౌశల్‌

Advertisment
Advertisment
తాజా కథనాలు