Gopichand Malineni : గోపీచంద్ మలినేని సడెన్ ట్విస్ట్, రవితేజను కాదని బాలీవుడ్ హీరోతో సినిమా.. గ్రాండ్ గా పూజా కార్యక్రమాలు!

New Update
Gopichand Malineni : గోపీచంద్ మలినేని సడెన్ ట్విస్ట్, రవితేజను కాదని బాలీవుడ్ హీరోతో సినిమా.. గ్రాండ్ గా పూజా కార్యక్రమాలు!

Gopichand Malineni Movie With Sunny Deol : గత ఏడాది బాలయ్య (Balakrishna) తో 'వీరసింహారెడ్డి' సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న గోపీచంద్ మలినేని (Gopichand Malineni).. తనం నెక్స్ట్ ప్రాజెక్ట్ ను రవితేజతో అనౌన్స్ చేశాడు. 'RT4GM' అనే వర్కింగ్ టైటిల్ పెట్టిన ఈ ప్రాజెక్ట్ 'క్రాక్' మూవీకి సీక్వెల్ గా తెరకెక్కనుందని వార్తలు వినిపించాయి. మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్ ను బ్యాంక్ రోల్ చేశారు. త్వరలోనే సెట్స్ పైకి వెళ్తుందని అనుకునే లోపే డైరెక్టర్ గోపీచంద్ మలినేని తాజాగా ఓ సడెన్ ట్విస్ట్ ఇచ్చాడు.

రవితేజ (Ravi Teja) ప్రాజెక్ట్ ను పక్కన పెట్టి బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ తో సినిమా ప్రకటించి షాక్ ఇచ్చాడు. ఈ రోజే గ్రాండ్ గా పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. నేడు హైద‌రాబాద్ లో పూజా కార్య‌క్ర‌మాల‌తో సినిమా లాంచ‌నంగా ప్రారంభ‌మైంది. 'SDGM' అనే వర్కింగ్ టైటిల్ తో 'మాస్ ఫీస్ట్ లోడింగ్' అనే క్యాప్షన్ తో ఈ మూవీని లాంచ్ చేశారు. మైత్రి మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Also Read : ఓటీటీలోకి వచ్చేసిన ‘గం.గం..గణేశా’.. ‘బేబీ’ హీరో కొత్త సినిమా స్ట్రీమింగ్ ఎక్కడంటే?

త్వరలో షూటింగ్‌ షురూ కానుంది. ఈ మూవీతో గోపీచంద్ మలినేని డైరెక్టర్ గా బాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తుండటం విశేషం.కాగా ఈ చిత్రానికి టాలీవుడ్ మ్యూజిక్‌ డైరెక్టర్ ఎస్‌ థమన్ సంగీతం అందిస్తున్నారు. రిషి పంజాబి సినిటోగ్రాఫర్‌ కాగా.. అవినాష్‌ కొల్ల ప్రొడక్షన్‌ డిజైనర్‌గా వర్క్‌ చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రాబోతున్న ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌కు సంబంధించి త్వరలోనే పూర్తి వివరాలు బయటికి రానున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు