Fraud Loan Apps: గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆ యాప్స్ తీసేశారు.. ఎందుకంటే..  

గూగుల్ ప్లే స్టోర్ నుంచి 17 లోన్ యాప్స్ తొలగించారు. ఈ యాప్స్ యూజర్ పర్సనల్ డేటాను చోరీ చేస్తున్నాయని గుర్తించారు. అంతేకాదు, ఇవి లోన్స్ రికవరీ పేరుతో యూజర్స్ పై బెదిరింపులకు పాల్పడుతున్నట్టు గూగుల్ గుర్తించింది. దీంతో ఈ యాప్స్ ను ప్లే స్టోర్ నుంచి తీసేశారు. 

New Update
Fraud Loan Apps: గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆ యాప్స్ తీసేశారు.. ఎందుకంటే..  

Fraud Loan Apps: టెక్ దిగ్గజం గూగుల్ ప్లే స్టోర్ నుంచి లోన్స్  అందించే 17 యాప్స్ తొలగించింది. ఈ యాప్స్ యూజర్లను మోసం చేస్తున్నాయి. వాటిలో స్పై మాల్ వేర్ ఉన్నట్లు కనుగొన్నారు. చాలా  మోసపూరిత ఇన్ స్టంట్ లోన్ యాప్ లు ఆండ్రాయిడ్ యూజర్లను లక్ష్యంగా చేసుకుంటున్నాయని సైబర్ సెక్యూరిటీ సంస్థ ఈసెట్ రీసెర్చ్ రిపోర్టు వెల్లడించింది. ఈ రిపోర్ట్ లో గుర్తించిన 18 యాప్ లలో గూగుల్ 17 యాప్ లను తొలగించగా, ఒక యాప్ డెవలపర్లు గూగుల్ నిబంధనల ప్రకారం తమ విధానాన్ని మార్చుకున్నారు. ఈ కారణంగా, ప్లే స్టోర్ నుంచి దీనిని తొలగించలేదు.

అయితే, గూగుల్ చర్యకు ముందు, ఈ  యాప్స్(Fraud Loan Apps) 1.20 మిలియన్ల సార్లు డౌన్లోడ్ అయ్యాయి. ఈ యాప్స్ ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్, ఎస్ఎంఎస్ వంటి థర్డ్ పార్టీ విధానాల ద్వారా టెక్స్ట్ మెసేజెస్  పంపుతూ ప్రజలను మోసం చేస్తున్నాయి. భారత్ సహా మెక్సికో, ఇండోనేషియా, థాయ్ లాండ్, వియత్నాం, పాకిస్థాన్, కొలంబియా, పెరూ, ఫిలిప్పీన్స్, ఈజిప్ట్, కెన్యా, నైజీరియా, సింగపూర్ లలో ఈ యాప్ లు పనిచేస్తున్నాయి.

ఇన్ స్టంట్ లోన్స్ పేరుతో ఈ యాప్స్(Fraud Loan Apps) కాల్ లాగ్స్, స్టోరేజ్, మీడియా ఫైల్స్, కాంటాక్ట్ లిస్ట్, లొకేషన్ డేటా వంటి అనేక అనుమతులను తీసుకుంటున్నాయి దీంతోపాటు యూజర్ పర్సనల్ డేటా కోసం అడ్రస్, బ్యాంక్ అకౌంట్, ఫొటో వంటి వివరాలను కూడా షేర్ చేయమని కోరుతున్నాయి. 

చంపేస్తామని  బెదిరిస్తున్నారు.

గూగుల్ ప్లే స్టోర్ పాలసీని కూడా వారు లెక్కచేయడంలేదు.  ఈ యాప్స్(Fraud Loan Apps) ద్వారా ప్రజలు వెంటనే లోన్స్ పొందుతారు.  కానీ దీని కోసం, ఎక్కువ వడ్డీ వసూలు చేస్తారు.  లోన్  తిరిగి చెల్లించడానికి తక్కువ సమయం ఇస్తారు.

వినియోగదారుడి పూర్తి వివరాలు సేకరించిన తర్వాత లోన్ వెంటనే  తిరిగి చెల్లించాలని యాప్ బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభిస్తుంది. లోన్ యాప్స్ ద్వారా ప్రజలను బ్లాక్ మెయిల్ చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారని ఈసెట్ పరిశోధకుడు లుకాస్ స్టెఫాంకో తెలిపారు.

Also Read: రోజుకు రూ. 41 కట్టండి..వందేళ్లు ఆదాయం..ఈ కిర్రాక్ ప్లాన్ గురించి పూర్తివివరాలివే..!

అంతే కాదు యూజర్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోకపోయినా, రుణం మంజూరు చేయకపోయినా యాప్ ద్వారా వచ్చే సమాచారంపై ఆధారపడి రుణాన్ని తిరిగి చెల్లించేలా ఈ  యాప్స్ బ్లాక్ మెయిల్  చేస్తున్నాయి.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) ప్రకారం, మీరు లిస్టెడ్ వెబ్సైట్ లేదా దాని యాప్ కు  వెళ్లినప్పుడు, అది ఆర్బిఐ వద్ద రిజిస్టర్ అయిందా? లేదా అనేవిషయాన్ని చెక్ చేసుకోవాలి.  లేదా ఆర్బీఐ వద్ద రిజిస్టర్ అయిన బ్యాంకు లేదా ఎన్బీఎఫ్సీకి చెందినదేనా అనేది పరిశీలించాలి. లోన్స్ ఇచ్చే అన్ని కంపెనీలు తమ కంపెనీ ఐడెంటిఫికేషన్ నంబర్ (సీఐఎన్), సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ (సీఓఆర్)లను స్పష్టంగా చూపించాలి.

గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించిన యాప్స్ ఇవే.. 

AA Kredit, Amor Cash, Guayabacash, Easy Credit, Cashwow, CrediBus, FlashLoan, PrestamosCredito, Go Credito, Intantaneo Prestamo, Cartera grande, Rapido Credito, Finupp Lening, 4S Cash, TrueNaira, EAsyCash

Watch this latest Video:

Advertisment
Advertisment
తాజా కథనాలు